EPAPER

OY! Movie: ఓయ్.. సినిమా టైటిల్ వెనుక ఉన్న అర్థం ఇదంట..

OY! Movie: ఓయ్.. సినిమా టైటిల్ వెనుక ఉన్న అర్థం ఇదంట..
OYE Movie Title Meaning

OY! Movie Title Meaning:


వాలెంటైన్స్ డే వచ్చేసింది. ప్రేమికులంతా.. తమ పార్ట్నర్లతో కలిసి ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రేమ పక్షుల్ని అలరించేందుకు కొన్ని సినిమాలు కూడా రీ రిలీజ్ లకు సిద్ధమయ్యాయి. వాటిలో ఒకటి ఓయ్ సినిమా. 2009లో జులై 3న విడుదలైన ఈ సినిమా.. మ్యూజికల్ హిట్. కానీ స్టోరీ పరంగా అప్పట్లో ఎవరికీ కనెక్ట్ అవ్వకపోవడంతో.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. థియేటర్లో నిలబడలేకపోయినా.. బుల్లితెరపై ఎప్పుడు ఈ సినిమా వచ్చినా.. అలా టీవీలకు అతుక్కుపోతారు. సంధ్య ప్రేమ కోసం.. ఉదయ్ చేసే ప్రయత్నాలు, ఆమెను సంతోషంగా ఉంచేందుకు చేసే పనులు నచ్చుతాయి. ఇదంతా సరే.. అసలు OY అనే టైటిల్ కు అర్థమేంటో మీకు తెలుసా ? తాజాగా ఆ విషయాన్ని సినిమా రీ రిలీజ్ సందర్భంగా.. దర్శకుడు ఆనంద్ రంగ ఈ విషయాన్ని నెటిజన్లతో పంచుకున్నారు.

Read More:  సాయి పల్లవి ఇన్ని సినిమాలను రిజక్ట్ చేసిందా?.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..


OY అనే పిలుపు చాలా కుటుంబాల్లో వినిపిస్తుంది. అంతేకాదు. మణిరత్నం సినిమాల్లోని హీరోయిన్లు కూడా హీరోని ఎక్కువగా OY అనే పిలుస్తారు. అదే OY ని హైలైట్ చేస్తూ.. ఆనంద్ రంగ సిద్ధం చేసుకున్న ఈ కథ వెనుక ఒక ఆసక్తికరమైన పాయింట్ ఉందంట. ఈ సినిమాలో సంధ్య (Shamili), ఉదయ్ (Siddharth)ను పేరుతో కాకుండా ఓయ్ అనే పిలుస్తుంది. టైటిల్ OY అని పెట్టడానికి ఇదీ ఒక కారణమే అయినా.. అసలు కారణం వేరే ఉందంట.

సంధ్య-ఉదయ్ ల ప్రేమ 2007 జనవరి 1న మొదలవుతుంది. జనవరి 1నే ఉదయ్ పుట్టినరోజు. ఉదయ్ తండ్రి సంక్రాంతి సమయంలో చనిపోతాడు. ఆ తర్వాత వాలెంటైన్స్ డే, హోలీ, వినాయకచవితి, క్రిస్మస్.. ఇలా అన్ని పండుగలకు సంబంధించిన సీన్స్ ఉంటాయి. క్యాన్సర్ బారిన పడిన సంధ్య.. దానితో పోరాడి 2008 జనవరి 1న కన్నుమూస్తుంది. 2007 జనవరి 1న మొదలైన లవ్ స్టోరీ.. 2008 జనవరి 1తో ముగిసిపోతుంది. అంటే సరిగ్గా ఏడాది. అందుకే ఇంగ్లీష్ లో OY అంటే One Year. అని పెట్టారట. ఈ విషయాన్నే ఆనంద్ రంగ వివరిస్తూ ఇన్ స్టా లో పోస్ట్ చేశారు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుందిగా.. సినిమా పరంగా OY అంటే అర్థం ఏంటో. మరి ఈ వాలెంటైన్స్ డే కి మీ పార్ట్నర్ తో కలిసి ఎంచక్కా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి.

Related News

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Big Stories

×