Big Shock For Dil Raju : తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన మార్కెట్‌లో నైజాం ఏరియాకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ఏరియాలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజుకి మంచి పట్టుంది. అందుకు కారణం.. ఆయన చేతిలో కొన్ని థియేటర్స్ ఉండటం కూడా అని అందరూ అంటుంటారు. అయితే ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న సమాచారం మేరకు త్వరలోనే నైజాం ఏరియాలో దిల్ రాజు ఆధిపత్యానికి తెర పడనుందట. అందుకు కారణం ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అనే వార్తలైతే బలంగా వినిపిస్తున్నాయి.
అసలు దిల్ రాజుకు సంబంధించిన నైజాం ఏరియా హక్కులకు, మైత్రీ మూవీ మేకర్స్‌కు ఉన్న రిలేషన్ ఏంటనే సందేహం రాక మానదు. విషయమేమంటే.. ప్రస్తుతం తెలుగులో బడా సినిమాలను నిర్మిస్తోన్న ప్రొడక్షన్ హౌసెస్‌లో మైత్రీ మూవీ మేకర్స్ ముందు వరుసలో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి ఏకంగా ఇద్దరు అగ్ర హీరోలకు చెందిన సినిమాలను ఆ నిర్మాణ సంస్థ విడుదల చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. అయితే మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు కొత్తగా ఓ నిర్ణయం తీసుకుందట. అదేంటంటే భారీ సినిమాలను నిర్మిస్తున్న తాము.. డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగు పెట్టాలనుకోవటం.
మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు ఓ భారీ నిర్మాణ సంస్థ, సీడెడ్‌కు సంబంధించిన ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కలిసి డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్టార్ట్ చేయబోతున్నారట. అది కూడా వచ్చే సంక్రాంతికి లోపలే అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇదే కనుక జరిగితే దిల్ రాజుకి షాక్ తగిలినట్టేనని సినీ వర్గాల్లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీంతో దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్ జాగ్రత్త పడుతున్నారట. మరో వైపు నైజాంకు సంబంధించిన మరో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ కూడా థియేటర్స్ చేజారకుండా తగు చర్యలు తీసుకునే పనిలో ఉన్నారట మరి.
Leave a Comment