EPAPER

Mahesh Babu: అదిరా సూపర్ స్టార్ అంటే.. ఏడాదికి రూ. 30 కోట్లు వారి కోసమే

Mahesh Babu: అదిరా సూపర్ స్టార్ అంటే..  ఏడాదికి రూ. 30 కోట్లు వారి కోసమే

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు చూసిన విమర్శించినవారు.. ట్రోల్ చేసిన వారు ఉంటారేమో కానీ, మహేష్ చేసే మంచి పనులకు, సేవా కార్యక్రమాలను వంకపెట్టేవారు ఉండరు. మహేష్ ను అందరూ దేవుడిలా చూస్తారు.


దైవం మానుష రూపేణ.. అంటే దేవుడు ఎక్కడో లేడు. మనుషులకు సహాయం చేస్తూ మన మధ్యనే ఉంటాడు అని. మహేష్ చేస్తుంది కూడా అలాంటి దైవ కార్యమే. చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయిస్తూ ఎన్నో కుటుంబాలకు కడుపుకోత లేకుండా చేస్తున్నాడు. మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు ఆపరేషన్స్ చేయిస్తున్నాడు.

ఇదే కాకుండా నిరుపేద పిల్లలకు ఉచిత వైద్య సంరక్షణ అందించడంలో సహాయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్ర చికిత్స చేసిన ఘనత మహేష్ కు ఉంది. ఇక శ్రీమంతుడు సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం.. తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకున్నాడు. పేరుకు తీసుకొని వదిలేయకుండా .. ఆ గ్రామంకు ఏమేమి కావాలో అన్ని చేస్తున్నాడు.


ఇక వీటన్నింటికి మహేష్ ప్రతి ఏడాది.. దాదాపు రూ. 30 కోట్లు ఖర్చుపెడుతున్నాడట. అవును.. మీరు విన్నది నిజమే.. ఒక నివేదిక ప్రకారం.. స్వచ్ఛంద సంస్థలకు మహేష్ నుంచి ప్రతి ఏడాది రూ. 30 కోట్ల వరకు విరాళంగా వెళ్తున్నాయట. ఇది చిన్న అమౌంట్ కాదు. వేరేవాళ్ల కోసం ఇంత డబ్బు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. కానీ, మహేష్ మాత్రం అలాంటివేమీ ఆలోచించకుండా నిస్వార్ధంగా సేవ చేస్తున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు.. అదిరా సూపర్ స్టార్ అంటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో SSMB29 లో నటిస్తున్నాడు.

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×