EPAPER
Kirrak Couples Episode 1

Devil Movie Review: 2023 ఆఖరి శుక్రవారం.. డెవిల్ సక్సెస్ అయ్యాాడా ?

Devil Movie Review: 2023 ఆఖరి శుక్రవారం.. డెవిల్ సక్సెస్ అయ్యాాడా ?

Devil Movie Review: ప్రతి శుక్రవారం టాలీవుడ్ నుంచి సినిమాలు విడుదలవుతుంటాయి. పెద్ద సినిమాలు లేనప్పుడు విడుదలైన చిన్న సినిమాలు.. భారీ వసూళ్లు చేశాయి. ఈ ఏడాదిలో చివరి శుక్రవారం రెండు సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఒకటి కల్యాణ్ రామ్ నటించిన డెవిల్. స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన సంయుక్త నటించింది. విరూపాక్ష సక్సెస్ కావడం.. ఈ సినిమాకు సంయుక్తకు ప్లస్ పాయింట్. అందుకే డెవిల్ పై అంచనాలున్నాయి. మరి ఆ అంచనాలను డెవిల్ అందుకుందా? 2023లో చివరి హిట్ గా నిలిచిందా ? చూద్దాం.


సినిమా: డెవిల్

నటీనటులు: కల్యాణ్ రామ్, సంయుక్త, మాళవిక నాయర్, సీత, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, ఎస్తర్ నోరోన్హా, అజయ్, షఫి తదితరులు


నిర్మాణం: అభిషేక్ పిక్చర్స్

నిర్మాత, దర్శకత్వం: అభిషేక్ నామా

మాటలు: శ్రీకాంత్ విస్సా

సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్

సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్

ఎడిటింగ్: తమ్మిరాజు

విడుదల: 29-12-2023

కథ

1940వ దశకంలో జరిగే కల్పిత కథ ఇది. నాటి బ్రిటీష్ ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధుడైన సుభాష్ చంద్రబోస్ ను పట్టుకోవాలనే ప్రయత్నంలో ఉంటుంది. సుభాష్ చంద్రబోస్ రాక గురించిన సమాచారం వారికి అందుతుంది. ఆ సమయంలోనే బ్రిటీష్ ప్రభుత్వంలో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేస్తాడు డెవిల్ (కల్యాణ్ రామ్). రసపురంలో ఉన్న జమిందార్ ఇంట్లో జరిగిన ఒక హత్యకేసుని ఛేదించడానికి ప్రభుత్వం అతడిని పంపిస్తుంది. ఈ హత్యకేసు దర్యాప్తులోనే.. బోస్ నేతృత్వంలో నడుస్తున్న ఐఎన్ఏ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) ఏజెంట్లను డెవిల్ గుర్తిస్తాడు.

మరోవైపు.. బోస్ తనకు కుడిభుజమైన త్విరవర్ణతో టచ్ లో ఉన్నాడన్న విషయాన్ని డెవిల్ పసిగడతాడు. సుభాష్ చంద్రబోస్ కు కోడ్ రూపంలో ఉన్న సమాచారాన్ని చేరవేసేందుకు త్రివర్ణ, మరికొందరు ఐఎన్ఏ ఏజెంట్లు ప్రయత్నిస్తుంటారు. ఆ కోడ్ తో జమిందార్ ఇంట్లో హత్యకు సంబంధం ఏంటి ? డెవిల్ కు అప్పగించిన హత్యకేసును ఎలా ఛేదించాడు ? ఈ కథలో ఉన్న త్రివర్ణ ఎవరు? నైషధ (సంయుక్త), మణిమేకల (మాళవికనాయర్)తో ఆమెకున్న రిలేషన్ ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

దేశభక్తి, థ్రిల్లింగ్ అంశాల కలయికతో కూడిన చిత్రమిది. మిగతా స్పై థ్రిల్లర్ సినిమాలతో పోల్చితే.. పీరియాడిక్ నేపథ్యంలో సాగడమే డెవిల్ ప్రత్యేకత. అనూహ్యమైన మలుపులు థ్రిల్ పంచుతాయి. ఉత్కంఠను పెంచే సన్నివేశాలు సినిమాకు బలం. నేపథ్యం ఆకట్టుకున్నా.. అసలు కథను ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు విఫలమైనట్లు అనిపిస్తుంది. హత్యకేసు ఛేదనలోకి డెవిల్ దిగాక కొత్త ఆధారాలు, అనుమానాలు, కోణాలతో సినిమా సాగుతుంది. ఇంటర్వెల్ కు ముందు వచ్చే సీన్స్ నుంచి అసలు కథ మొదలవుతుంది. దేశభక్తి, అక్కడక్కడా పండిన ఎమోషన్స్ సినిమాకు బలంగా నిలిచాయి.

ప్లస్ పాయింట్స్

  • కథలో దేశభక్తి కోణం చూపించడం
  • సెకండాఫ్
  • నటీనటులు

మైనస్ పాయింట్స్

  • సాదాసీదాగా ప్రథమార్ధం
  • ఆకట్టుకోని మలుపులు

చివరిగా.. స్పై థ్రిల్లింగ్ లవర్స్ ను డెవిల్ మెప్పిస్తాడు

Related News

Actress Pragathi: అలర్ట్ అయిన ప్రగతి.. తన నంబర్ కాదంటూ కంప్లైంట్..!

Mrunal thakur: అతడిని పరిచయం చేసిన మృణాల్.. ఆగలేకపోతున్న అంటూ పోస్ట్..!

Jani Master Case : అసిస్టెంట్ ని ట్రాప్ చేసింది ఇక్కడి నుంచే…

Jani Master Case : నేరాన్ని అంగీకరించాడా… అంగీకరించాల్సి వచ్చింది..?

Jani Master Case : బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ అవుట్… జానీ కేసుతో ఆమె లింక్ ఇదే..

Tollywood Heroine: రహస్యంగా తల్లికి ఇష్టం లేని పెళ్లి.. కట్ చేస్తే..!

Madhavi Latha: నాగబాబుకి కూడా కూతురు ఉంది మర్చిపోయారా.. ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..?

Big Stories

×