EPAPER

Devara: ఒక రోజు ముందే దేవర రిలీజ్ అక్కడ..ముందు రోజే టాక్ రివీల్

Devara: ఒక రోజు ముందే దేవర రిలీజ్ అక్కడ..ముందు రోజే టాక్ రివీల్

Devara will release one day before at Los Angeles: ఎన్నో భారీ అంచనాల మధ్య టాలీవుడ్ లో హైప్ క్రియేట్ చేస్తూ పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజవుతోంది దేవర. ఎన్టీఆర్ గ్లోబల్ హీరోగా ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన పేరు ఓవర్సీస్ లోనూ మార్మోగిపోతోంది. అప్పటిదాకా రీజనల్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ ని ఒక్కసారిగా రాజమౌళి ఆస్కార్ ముంగిటకు తీసుకెళ్లారు. అసలు ఆర్ఆర్ఆర్ మూవీకి ఎన్టీఆర్ కు ఆస్కార్ ఉత్తమ నటుడి క్యాటగిరీలో పురస్కారం అందుతుందని అభిమానులు పందాలు కూడా కట్టారు. అయితే కేవలం నాటు నాటు పాటకు సంబంధించి కీరవాణి కి మాత్రమే ఆ అదృష్టం దక్కింది. అయినా ఎన్ఠీఆర్ అభిమానులు నిరుత్సాహపడలేదు. తమ హీరోకి గ్లోబల్ స్థాయిలో మార్కెట్ పెరిగిందని సంతోషించారు. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన హైప్ ని ఎన్టీఆర్ క్యాష్ చేసుకోల్చుకోలేదు. తర్వాత చాలా కథలే వచ్చాయి.


కొరటాలపై నమ్మకం

పలువురు టాలీవుడ్ దర్శకులు కూడా అద్భుతమైన కథలతో ఎన్టీఆర్ వద్దకు వచ్చారు. వాటన్నింటినీ కాదని షాక్ ఇస్తూ కొరటాల శివకు ఛాన్స్ ఇచ్చారు ఎన్టీఆర్. అప్పటికి కొరటాల శివ ఆచార్య మూవీ ఫ్లాప్ తో తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈ సారి ఎలాగైనా మంచి హిట్ కొట్టి మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావించారు. అయితే అప్పటికే జనతా గ్యారేజ్ లాంటి సూపర్ హిట్ సినిమాను ఎన్టీఆర్ కు అందించిన కొరటాల శివ కథ నచ్చడంతో ఎన్టీఆర్ మరో మాట లేకుండా ఓకే చేశారు. సాధారణంగా సెంటిమెంటును ఫాలో అయ్యే తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎన్టీఆర్ ని హెచ్చరించింది. అసలే రాజమౌళి తర్వాత సినిమా చేస్తే టాలీవుడ్ లో ఏ హీరోకైనా ఫ్లాప్ అనే సెంటిమెంటు ఉండగా ఫ్లాప్ సినిమా అందించిన కెరటాలకు ఎలా ఛాన్స్ ఇచ్చారంటూ..ఈ సినిమా చెయ్యవద్దంటూ తీవ్ర ఒత్తిడులు కూడా చేశారు. అయినా ఎన్టీఆర్ అవేమీ పట్టించుకోకుండా తన దారిన తాను మూవీ చెయ్యడం జరిగింది. ఇక రీసెంట్ గా రిలీజయిన ట్రైలర్ కూడా మిశ్రమ టాక్ వచ్చింది. ఎన్టీఆర్ మూవీని ఆంధ్రావాలాతో పోలిక తెచ్చి మరీ ట్రోలింగులు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ఎన్టీఆర్ ఫాన్స్ ని ఇంకో భయం వెంటాడుతోంది.


ఒక రోజు ముందే..

లాస్ ఏంజెల్స్ లో అతి పెద్ద ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. లియాండ్ పెస్ట్ పేరున కాలిఫోర్నియాలో ఈ నెల 26న ఈ వేడుకను జరపనున్నారు. కాగా దేవర మూవీ 27న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ కానుంది. దేవర మూవీని ఒక రోజు ముందరే ఈ లాస్ ఏంజిల్స్ లో జరగబోయే వేడుకలో ప్రదర్శించనున్నారని తాజా సమాచారం. సెప్టెంబర్ 26న అంటే దేవర మూవీ రిలీజ్ కు ఒక రోజు ముందరే ఈజిప్షియన్ థియేటర్ లో ఈ మూవీని ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్ షోని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ షోకి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ కు చెందిన ప్రముఖులంతా హాజరవుతారని..వారంతా కలిసి ఈ మూవీని వీక్షించనున్నారని సమాచారం. అయితే ఒక రోజు ముందుగానే దేవర మూవీ టాక్ కూడా తెలిసిపోతుందని..ఒక వేళ సినిమా అటో ఇటో అయితే ఆ కలెక్షన్ల ప్రభావం దేశమంతటా కనిపిస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫ్యాన్స్ ఆందోళన

ఉదయం షోలు పడకముందే ట్విట్టర్ రివ్యూలు రావడంతో కొన్ని సినిమాలపై ఆ ప్రభావం కూడా పడుతోంది. వెంటనే తర్వాత షో బుకింగ్స్ ఖాళీ అవుతున్నాయి. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం దీనిని పాజిటివ్ గానే తీసుకుంటున్నారు. నిర్మాతకు ఈ సినిమాపై గట్టి నమ్మకం ఉంది కాబట్టే ఒక రోజు ముందర షో వేస్తున్నారని..తప్పకుండా దేవర బ్లాక్ బస్టర్ ఖాయం అని..ఇండస్ట్రీ రికార్డు కొట్టబోతోందని అంటున్నారు. కనీసం దేవర వెయ్యి కోట్ల క్లబ్ లో చేరితే ఇక ఎన్టీఆర్ కు వచ్చిన గ్లోబల్ రేంజ్ అలానే కొనసాగుతుందని ఇండస్ట్రీ ప్రముఖులు అనుకుంటున్నారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×