EPAPER

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Devara: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్ ఎప్పటికి వర్కౌట్ అవుతూ ఉంటాయి. కొన్ని గుడ్ సెంటిమెంట్ వర్కౌట్ అయినట్లే కొన్ని బ్యాడ్ సెంటిమెంట్స్ కూడా వర్కౌట్ అవుతాయి. వాటిలో ముఖ్యంగా రాజమౌళి హీరో సెంటిమెంట్. రాజమౌళి ఒక హీరోతో సినిమా చేసిన తర్వాత ఆ హీరోతో ఏ దర్శకుడు పని చేసినా కూడా ఆ తర్వాత సినిమాలు ఫెయిల్ అవుతాయి. ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా అలా హిట్ కాలేదు. చాలామంది హీరోలు రాజమౌళితో సినిమా చేయాలని ఆశతో ఉంటారు. అలానే ఆ తర్వాత ప్లాప్ సినిమాలు కూడా వస్తాయి అని ముందే ఫిక్స్ అయి ఉంటారని చెప్పాలి.


ఏవి వర్కౌట్ కాలేదు

ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేసిన సినిమా ట్రిపుల్ ఆర్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ఎస్ఎస్ రాజమౌళి స్థాయి మాత్రమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసింది ఈ సినిమా. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ ఆచార్య సినిమాలో గెస్ట్ రోల్ చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. దర్శకుడుగా కొరటాల శివకు ఈ సినిమా మొదటి డిజాస్టర్. అయితే ఈ సినిమాతో రాజమౌళి సెంటిమెంటుకు చెక్ పడుతుంది అని మెగాస్టార్ చిరంజీవి ఆన్ స్టేజ్ పై కూడా చెప్పుకొచ్చారు. కానీ అది వర్కౌట్ కాలేదు.


రాజమౌళి హీరో

ఇప్పుడు రాజమౌళి మరో హీరో ఎన్టీఆర్ తో దేవర సినిమా తెరకెక్కించాడు కొరటాల శివ. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈసారి రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడా లేదా అని ఆలోచనలు కూడా చాలా మందిలో ఉన్నాయి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఆగస్టు 22న జరగనుంది. ఈవెంట్ కి ఎస్ ఎస్ రాజమౌళి త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి చీఫ్ గెస్ట్ లు హాజరు కానున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

Devara

సెంటిమెంట్స్ కి చెక్

ఇక త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు అనగానే చాలామందికి కొత్త అనుమానాలు మొదలయ్యాయి. ఎందుకంటే త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఎక్కువ శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. రామ్ పోతినేని రెడ్, రామ్ చరణ్ వినయ విధేయ రామ, నితిన్ లై, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు వంటి ఎన్నో సినిమాలు డిజాస్టర్ గా మిగిలాయి. అయితే త్రివిక్రమ్ హోం బ్యానర్ ప్రొడ్యూస్ చేసిన కొన్ని సినిమాలు మాత్రం మంచి హిట్ అయ్యాయి. అలా త్రివిక్రమ్ హాజర హిట్స్ సాధించిన సినిమా భీష్మ. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. ఏదేమైనా ఈ ఒక్క సినిమాతో చాలా సెంటిమెంట్స్ కి కొరటాల శివ చెక్ పెట్టినట్లు అవుతుంది. మరి ఈ కొరటాల శివ పై ఆ శివయ్య ఆలోచన ఎలా ఉందో సెప్టెంబర్ 27 తెలియనుంది.

Tags

Related News

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Big Stories

×