EPAPER

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Devara Pre Release Event : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర.. ఈ సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. భారీ అంచనాల తో సినిమాను ఈనెల 27 న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.. దేవర మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఫిక్సయింది. మూవీ రిలీజ్ కంటే ముందు ఏ హీరో అభిమాని అయినా.. ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తుంటారు. దేవర రిలీజ్ దగ్గర పడుతున్నా ప్రీరిలీజ్ గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. మొత్తానికి ఈ ఈవెంట్ వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 22) జరగబోతోందని మేకర్స్ అనౌన్స్ చేశారు. మరి ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్టులు గా డైరెక్టర్స్ రాబోతున్నారని టాక్ మరి డైరెక్టర్స్ ఎవరో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


ఈ సినిమా నిర్మాణ సంస్థ తన అధికార x లో పోస్ట్ చేసింది. బిగ్ స్క్రీన్స్ ను తాకే ముందే ఈ ఆవేశానికి స్వాగతం పలుకుదాం. దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 22న. మరిన్ని వివరాలు త్వరలోనే..” అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరుగుతుందన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.. ఇకపోతే  అందుతున్న సమాచారం మేరకు దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని నోవోటెల్ హోటల్లో నిర్వహించనున్నారని సమాచారం. అయితే ముందుగా వేరే ప్లేసు అనుకున్న భారీ వర్ష సూచన ఉండటంతో మేకర్స్ ప్లేసును చేంజ్ చేసినట్లు తెలుస్తుంది.

 Devara Pre Release Event Date Fix.. Star Directors as Chief Guests?
Devara Pre Release Event Date Fix.. Star Directors as Chief Guests?

దేవర ప్రీరిలీజ్ ఈవెంట్ గెస్టులు..


త్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా దేవర పై భారీ అంచనాలే ఉన్నాయి. కొరటాల కు ఇది లైఫ్ ఎండ్ సమస్య.. ఈ సినిమా హిట్ అయితే అతనికి మరో ఛాన్స్ ఉంటుంది. ఇక అనుకున్నట్లుగానే ఎన్టీఆర్ సినిమాకు అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ నెల 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దాంతో సినిమాను జనాల్లో కి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు. ఒకవైపు ముంబై, తమిళనాడులో ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇక హైదరాబాద్ లో భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్టులు రాజమౌళి, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ వస్తున్నారనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అందులో నిజమేంత ఉందో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల ను బాగా ఆకట్టుకున్నాయి. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.. దేవర సినిమా ఇప్పటికే జనాల్లో బాగా ఎక్కేసింది.. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను స్క్రీన్ మీద చూద్దామా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. మరి కొద్దిరోజులే ఉండటంతో దేవర టీమ్ జనాల్లోకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది..

Related News

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Big Stories

×