EPAPER
Kirrak Couples Episode 1

Devara Movie: ‘దేవర’ సీక్వెల్ చూడడానికి 5 ప్రధాన కారణాలు ఇవే..?

Devara Movie: ‘దేవర’ సీక్వెల్ చూడడానికి 5 ప్రధాన కారణాలు ఇవే..?

Devara Movie.. ఆచార్య సినిమాతో డిజాస్టర్ మూటగట్టుకున్న కొరటాల శివ(Koratala Shiva) ఈసారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలనే కసితో దేవర (Devara ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరొకవైపు ఆర్ ఆర్ ఆర్ తో కాకుండా సోలో హీరోగా మొదటిసారి పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఎన్టీఆర్ (NTR). ఈ సినిమాతో ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని, తన కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా దేవర మూవీ ని తీర్చిదిద్దాలని ఎన్టీఆర్ పట్టుదలతో రంగంలోకి దిగారు. అలా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27 అర్ధరాత్రి ఒంటిగంట నుండి దేవర షోలు ప్రారంభమయ్యాయి. సినిమా చూసిన ఆడియన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.


దేవరతో ఎన్టీఆర్ బ్లాక్ బాస్టర్..

ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలతో సినిమా థియేటర్లు అభిమానుల చప్పట్లు, ఈలలతో మారుమ్రోగిపోతున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ సో సో గా అనిపించినా.. రెండవ పార్ట్ లో క్లైమాక్స్ మాత్రం ఎవరూ ఊహించలేదని, ప్రత్యేకించి షార్క్ షాట్ సినిమాకే హైలెట్ అని ఇప్పటికే సినిమా చూసిన ఆడియన్స్ తమ అభిప్రాయాలుగా వ్యక్తపరుస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్ క్యారెక్టర్జేషన్ పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో ఈ సినిమా కథను పేపర్ పై పెట్టినప్పుడు ఏడు గంటలు వచ్చిందని, అయితే మూడు గంటల్లో సినిమాను కుదించడం కష్టమని, అందుకే రెండు భాగాలుగా దేవర విడుదల చేస్తున్నాము అంటూ కొరటాల శివ ప్రకటించిన విషయం తెలిసిందే.


సీక్వెల్ పై హైప్ పెంచేసిన మొదటి భాగం..

దీనికి తోడు దేవర మొదటి భాగంలో ఎన్నో ఊహించని మలుపులు, అర్థం కాని క్యారెక్టర్ లను అలాగే వదిలేశారు కొరటాల శివ. ఈ కొన్ని క్యారెక్టర్ ల తదుపరి కర్తవ్యం ఏమిటి..? అనే విషయం తెలియాలి అంటే సీక్వెల్ చూడాల్సిందే అనే ఆసక్తి కూడా రేకెత్తించారు. ముఖ్యంగా సీక్వెల్ చూడడానికి ప్రత్యేకంగా 5 ప్రధాన కారణాలు మన ముందుకు వచ్చేసాయి. మరి సీక్వెల్ చూడడానికి గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

సీక్వెల్ చూడడానికి 5 ప్రధాన కారణాలు ఇవే..

ముందుగా ఈ సినిమాలో వర పాత్రకు సంబంధించి ఎండింగ్లో రెండు ట్విస్ట్ లు ఇచ్చారు డైరెక్టర్. సీక్వెల్ లో మరి వర పాత్ర ఉంటుందా..? ఉండదా..?

మురుగ పాత్ర ఎవరి చేతిలో చనిపోయాడు?

అసలు సినిమా స్టార్టింగ్ లో ఎక్కువగా కనిపించిన యతి అనే గ్యాంగ్ స్టర్ పాత్ర ఎవరు..?ఈ పాత్రకు దేవర కథకి ఉన్న లింక్ ఏంటి?

రాయప్ప చేసిన నమ్మకద్రోహం వర కు తెలుస్తుందా..? వర భయస్తుడిలా రాయప్ప నటించడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి..?

జాన్వి కపూర్ పాత్రకు కనీసం సీక్వెల్ లో అయినా ప్రాధాన్యత ఉంటుందా..? ఉండదా..?

ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే దేవర -2 చూడాల్సిందే.

దీనికి తోడు దేవరలో ఉన్న బాహుబలి టైప్ ట్విస్ట్ కి ఎలాంటి జవాబు ఇస్తారనే స్పష్టత కూడా ఇక్కడ రావాల్సి ఉంది.

Related News

Janhvi Kapoor : సపోర్టింగ్ క్యారెక్టర్ కు ఎక్కువ, ఐటం గర్ల్ కి తక్కువ… ఈమాత్రం దానికే అంత బిల్డప్ ఇచ్చారా?

Devara Movie : ‘దేవర’ కోసం ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ ఎన్ని కోట్లంటే?

Devara : హద్దులు దాటిన అభిమానం… దేవర కోసం టోక్యో నుంచి లాస్ ఎంజిల్స్ కు వచ్చిన డై హార్డ్ ఫ్యాన్

Devara : ఋణపడి ఉంటా… దేవర రెస్పాన్స్ కు ఉబ్బితబ్బివుతున్న ఎన్టీఆర్

Khushboo: లడ్డూ వివాదంపై ఖుష్బూ ఊహించని కామెంట్స్.. ఇరుక్కోబోతోందా..?

Kiraak RP: ఓయో లో బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయిన ఆర్పీ భార్య.. కట్ చేస్తే.!

Devara Audience Reaction : తారక్ ఎర్ర సంద్రంపై తాండవం… ఆడియన్స్ రియాక్షన్ ఇదే..

Big Stories

×