EPAPER
Kirrak Couples Episode 1

Devara Movie : ఫస్ట్ డే వంద కొట్టాలంటే… ఇది జరిగి తీరాల్సిందే

Devara Movie : ఫస్ట్ డే వంద కొట్టాలంటే… ఇది జరిగి తీరాల్సిందే

Devara Movie : మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా మూవీ దేవర మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే దేవర మూవీ 100 కోట్ల ఓపెనింగ్ రాబడుతుందా ? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఎన్టీఆర్ అభిమానులు దేవర మూవీ 100 కోట్లు మొదటి రోజే కొల్లగొడుతుంది అని నమ్మకంతో చెబుతున్నప్పటికీ, పరిస్థితులు చూస్తుంటే అది సాధ్యమేనా ? అనే అనుమానం కలుగుతుంది. అయితే దేవర టీంతో పాటు ఎన్టీఆర్ అభిమానులు కోరుకుంటున్నట్టుగా ఈ మూవీ ఫస్ట్ డే వంద కోట్లు కొల్లగొట్టాలి అంటే కచ్చితంగా ఇది జరిగి తీరాల్సిందే.


దేవర ఫస్ట్ డే 100 కోట్లు రాబట్టాలంటే…

దేవర మంచి ఓపెనింగ్ రాబట్టాలి అంటే ముందుగా పాజిటివ్ టాక్ రావాలి. అదికూడా విమర్శకుల నుంచి కాదు అభిమానుల నుంచి. సెప్టెంబర్ 27న దేవర మూవీ థియేటర్లలోకి రానుండగా, సెప్టెంబర్ 26 అర్ధరాత్రి నుంచి షోలు పడబోతున్నాయి. అయితే ఈ స్పెషల్ షోలకు వెళ్ళేది సాధారణ ప్రేక్షకులు కాదు డై హార్డ్ ఫ్యాన్స్. అర్ధరాత్రి నుంచి షోలు పడతాయి కాబట్టి సినిమాకు అభిమానుల నుంచి వచ్చే మౌత్ టాక్ ఎఫెక్ట్ సినిమాపై గట్టిగానే పడుతుంది. అలా మిడ్ నైట్ షోల ద్వారా పాజిటివ్ టాక్ వస్తే సాధారణ ప్రేక్షకులు థియేటర్లకి వెళ్లడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒక్క  మాటలో చెప్పాలంటే దేవర భవిష్యత్తు అభిమానుల చేతుల్లోనే ఉంది. వాళ్ళు మూవీ అదిరిపోయింది అనాలంటే విజువల్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అనేలా ఉండాలి. అంతేకాకుండా ఇప్పటిదాకా దేవర మూవీ ఆచార్య సినిమాలా ఉంది అంటూ వస్తున్న నెగిటివ్ టాక్ సినిమా రిలీజ్ అయ్యాక ఎక్కడా వినిపించకూడదు. అయితే ఇక్కడ భయపెట్టే విషయం ఏమిటంటే అభిమానుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుందా రాదా? అనేది. ఎందుకంటే గతంలో గుంటూరు కారం మూవీకి ఆ రేంజ్ లో నెగిటివ్ టాక్ రావడానికి అభిమానులే కారణం అంటూ నిర్మాత ఒకానొక సందర్భంలో చెప్పనే చెప్పాడు. సామాన్య ప్రేక్షకుడు మూవీని బాగానే ఇష్టపడ్డాడు గాని ఇలా స్పెషల్ షోల ద్వారా వచ్చిన నెగిటివ్ టాక్ సినిమాను బాగా ఇంపాక్ట్ చేసింది. ఇప్పుడు దేవర విషయంలో కూడా అది జరగకుండా ఉంటే కచ్చితంగా ఈ మూవీ 100 కోట్లు కొల్లగొట్టొచ్చు.


Devara: Jr NTR's Latest Film Gets U/A Certificate

గుంటూరు కారం మేకర్స్ చేసిన తప్పే దేవర టీమ్ చేస్తోందా?

సినిమా హిట్ అవ్వాలన్నా, ఊహించిన రేంజ్ లో కలెక్షన్లు రాబట్టాలన్న్నా ప్రమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కేవలం ప్రమోషన్స్ చేయడమే కాదు సినిమాను జనాల్లోకి ఎలా తీసుకెళ్తున్నాం అనేది కూడా ముఖ్యమే. అయితే దేవర విషయంలో ఈ ప్రమోషన్స్ సరిగ్గా జరుగుతున్నట్టుగా అనిపించలేదు. గుంటూరు కారం మూవీ రిలీజ్ కి ముందు ఈ మూవీని యాక్షన్ ఎంటర్టైనర్ అంటూ చెప్పుకొచ్చారు. కానీ తీరా ట్రైలర్ చూస్తే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉంది. అక్కడే మహేష్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఇక దేవర విషయంలో కూడా ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకెళ్తాం అంటూ అంచనాలు ఆకాశాన్ని తాకేలా చేస్తున్నారు. ఒకవేళ థియేటర్లకు వెళ్ళాక ఎన్టీఆర్ అభిమానులను కొరటాల చెప్పినట్టుగా వేరే లోకంలోకి తీసుకెళ్లకపోతే స్వయంగా వాళ్లే ఈ సినిమాను పాతాళానికి తొక్కేస్తారు. ఇక సినిమాకు ఉన్న చివరగ చెప్పేది ఏమిటంటే ఫస్ట్ దేవర ఎన్టీఆర్ అభిమానులను మెప్పిస్తే హిట్ అయినట్టే, 100 కోట్లు కొల్లగొట్టినట్టే. లేదంటే గుంటూరు కారం పరిస్థితి తప్పదు.

Related News

Sreeleela : ఓర్నీ ఇది డ్యాన్సా.. శ్రీలీల డ్యాన్స్ పై సెటైర్స్..

Harsha Sai:పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ యూట్యూబర్ హర్షసాయిపై యువతీ ఫిర్యాదు

Pawan Kalyan: పవన్ తప్పు చేశావ్.. నిన్ను వదలేది లేదు అంటున్న తమిళ తంబీలు.. ?

Star Singer: అది లేకపోవడం వల్లే విడాకులు పెరుగుతున్నాయి.. సీనియర్ సింగర్ షాకింగ్ కామెంట్..!

Actor Siddique: నటిపై లైంగిక వేధింపుల కేసులో మరో ట్విస్ట్.. పరారిలో నటుడు సిద్ధిఖీ

Ram Gopal Varma : ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై స్పందించిన ఆర్జీవి.. ఇలా చేస్తే బెటర్..

Alia Bhatt: చుట్టమల్లే.. ఎంత ముద్దుగా పాడావ్ అలియా.. ఫిదా అయిపోయాం

Big Stories

×