EPAPER
Kirrak Couples Episode 1

Devara: ఆదివారం అయినా అందుకోవడం లేదు.. తారక్‌కు ఇది తప్పదా..

Devara: ఆదివారం అయినా అందుకోవడం లేదు.. తారక్‌కు ఇది తప్పదా..

Devara: ఆదివారం అయినా అందుకోవడం లేదు.. తారక్‌కు ఇది తప్పదా..మామూలుగా స్టార్ హీరో సినిమాలు అంటే మొదటిరోజు మాత్రమే కాదు.. మొదటి వీకెండ్ కూడా లాభాలను తెచ్చిపెడుతుంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. అలా జరుగుతుంది కాబట్టే ఒక సినిమాకు మించి మరొక సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. కానీ ‘దేవర’ విషయంలో మాత్రం అలా జరగడం లేదు అనిపిస్తోంది. మొదటిరోజు ఈ సినిమాకు భీభత్సమైన కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుందని ఊహించారు. మొదటిరోజు పరిస్థితి అలా ఉన్నా.. మొదటి వీకెండ్ విషయంలో మాత్రం ‘దేవర’కు ఆ రేంజ్‌లో కలెక్షన్స్ వచ్చినట్టుగా అనిపించడం లేదు.


సీట్లు ఖాళీ

‘దేవర’ సినిమాకు ప్రీ బుకింగ్స్ బాగా జరిగాయి. కొన్ని థియేటర్లలో అయితే మొదటి రోజు మొత్తం హౌస్‌ఫుల్ షోలు నడిచాయి. దీంతో ‘కల్కి 2898 ఏడీ’, ‘సలార్’ వంటి సినిమాల ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డులను ‘దేవర’ బ్రేక్ చేసింది కూడా. ఇదే ఫ్లోలో కంటిన్యూ అయితే ఈ సినిమాకు రికార్డ్ స్థాయి కలెక్షన్స్ పక్కా అనుకున్నారు. కానీ వీకెండ్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ‘దేవర’ డల్ అయినట్టు అనిపిస్తోంది. ఊహించినంత కలెక్షన్స్ రావడం లేదని బుకింగ్స్ చూస్తే అర్థమవుతోంది. స్టార్ హీరో సినిమా కాబట్టి ఫస్ట్ వీకెండ్ మొత్తం హౌస్‌ఫుల్ అయ్యిండాలి కానీ ‘దేవర’ బుకింగ్స్ అలా లేవు. చాలా థియేటర్లలో చాలావరకు సీట్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి.


Also Read: ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్‌కు రూట్ క్లియర్.. కమల్ హాసన్‌తో ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా

‘దేవర’తో పోటీ

మూవీ టికెట్ బుకింగ్ యాప్ అయిన బుక్ మై షోలో ‘దేవర’కు కేటాయించిన చాలావరకు థియేటర్లలో చాలా సీట్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. హౌస్‌ఫుల్ అనే బోర్డ్ ఏ థియేటర్ ముందు కూడా కనిపించడం లేదు. దీంతో రెండో వీకెండ్ వచ్చేసరికి ఈ సినిమా కలెక్షన్స్ మరింత డల్ అవుతాయేమో అని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలా అయితే ‘దేవర’ క్రియేట్ చేసిన ఫస్ట్ డే రికార్డ్స్‌కు అర్థం ఉండదని ఫ్యాన్స్ సైతం ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. కానీ ‘దేవర’ విడుదలయిన మొదటిరోజే మిక్స్‌డ్ టాక్ అందుకుంది. దీంతో తర్వాత రోజు విడుదలయిన కార్తీ ‘సత్యం సుందరం’కు బుకింగ్స్ పెరిగాయి.

ఫ్యామిలీ ఆడియన్స్ లేరు

‘దేవర’ యావరేజ్‌గా ఉందని, మిక్స్‌డ్ టాక్ వచ్చిందని తెలుసుకున్న ప్రేక్షకులు వెంటనే కార్తి, అరవింద స్వామి కలిసి నటించిన ‘సత్యం సుందరం’ సినిమాను చూడడానికి ఇష్టపడుతున్నారు. ఎమోషనల్ డ్రామా కాబట్టి ‘సత్యం సుందరం’ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఎక్కువగా ఆకట్టుకునే ఛాన్స్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఇంప్రెస్ అయితే కొన్నాళ్ల పాటు కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉండదు. ‘దేవర’ కోసం ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ‘సత్యం సుందరం’కు ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో బుకింగ్స్ విషయంలో ‘దేవర’ వెనకబడే ఛాన్స్ ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇలా అయితే రాజమౌళితో సినిమా చేసిన హీరో.. తర్వాతి సినిమా ఫ్లాప్ అవుతుంది అనే సెంటిమెంట్ బ్రేక్ అవ్వడం కష్టమే అంటున్నారు.

Related News

FNCC President: బయటికొచ్చిన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఎన్నికల ఫలితాలు.. భారీ మెజారిటీతో గెలిచిన సీనియర్ నిర్మాత

Jani Master: దానివల్లే దీనిగురించి మాట్లాడలేను.. జానీ మాస్టర్ కేసుపై ఎట్టకేలకు నోరువిప్పిన మంచు విష్ణు

Kamal Haasan: ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్‌కు రూట్ క్లియర్.. కమల్ హాసన్‌తో ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా

Jr NTR: పొలిటికల్ ఎంట్రీ పై తారక్ కామెంట్… మళ్లీ హీట్ పెంచాడు..

Ram Charan: మెగా కుటుంబంలో ఆనందమే ఆనందం.. మొన్న చిరు.. నేడు చెర్రీకి అరుదైన గౌరవం

Arshad Warsi: అప్పుడలా ఇప్పుడలా.. ప్రభాస్‌ విషయంలో ప్లేట్ మార్చిన బాలీవుడ్ నటుడు

Big Stories

×