EPAPER
Kirrak Couples Episode 1

Devara Collections Day 1 : బాక్సాఫీస్ వద్ద దేవర సునామీ… రికార్డులు అన్నీ మాయం..

Devara Collections Day 1 : బాక్సాఫీస్ వద్ద దేవర సునామీ… రికార్డులు అన్నీ మాయం..

Devara Collections Day 1.. ఆచార్య (Aacharya )సినిమా భారీ డిజాస్టర్ అవడంతో ఆ భారం మొత్తం కొరటాల శివ (Koratala Shiva) పైనే వేసేశారు. దీంతో ఆ భారాన్ని దించుకోవడానికి కసితో దేవర సినిమా మొదలుపెట్టారు కొరటాల శివ. ఆచార్య సినిమా విడుదలైన 20 రోజులకే దేవర పోస్టర్ చేయడం ప్రారంభించారట. ఈ విషయాన్ని దేవర సినిమా ప్రమోషన్స్ లో స్వయంగా కొరటాల శివ చెప్పుకొచ్చారు. ప్రతిఫలం ఆశించకుండా కష్టపడితే సక్సెస్ నీదే అవుతుంది అనే సామెతకు కొరటాల శివ చక్కటి నిదర్శనం అని చెప్పవచ్చు. నాడు ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈయన అదే కసి తో , పట్టుదలతో ప్రతిఫలం గురించి ఆలోచించకుండా తనలోని టాలెంట్ మొత్తం వెలికి తీసి దేవర మూవీతో ప్రేక్షకుల ముందు ఉంచాడు. ఈ సినిమా మొదటి రోజే భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా దేవర సినిమా ఎన్టీఆర్ అభిమానులకు మంచి ఫీస్ట్ ఇచ్చిందని చెప్పవచ్చు.


సోలో హీరోగా వచ్చి బ్లాక్ బాస్టర్ అందుకున్న ఎన్టీఆర్..

మరొకవైపు ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ తన సినీ కెరియర్ లోనే సోలో హీరోగా చేసిన మొదటి పాన్ ఇండియా చిత్రం కావడం గమనార్హం. రూ.350 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొదటి రోజే రూ.125 కోట్ల వరకు వసూలు చేయవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనాలు వేశారు. అయితే వారందరి అంచనాలను తొలగించేస్తూ.. ఈ సినిమా ఏకంగా నాన్ ఎస్ఎస్ రాజమౌళి రికార్డులను బ్రేక్ చేసి అందరి అంచనాలను దాటేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్, బాహుబలి తర్వాత ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.


కలెక్షన్ల సునామీ కురిపించిన దేవర..

ఇదిలా ఉండగా మొదటి రోజే ఏకంగా రూ.172 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఎన్టీఆర్ సినీ కెరియర్ లోనే ఇది హైయెస్ట్ రికార్డు అని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా దేవర సినిమా ట్రైలర్ విడుదలైనప్పుడు చాలామంది ఈ సినిమా ఆచార్యలా ఉందని, అందులోని పాదఘట్టం సన్నివేశాలు కొరటాల శివ రిపీట్ చేశారని, మరొకవైపు కొంతమంది రాజకీయ నేతలు కూడా పనిగట్టుకొని సినిమా అట్టర్ ప్లాప్ అవుతుందంటూ కామెంట్లు చేశారు. అంతేకాదు సినిమా విడుదలైన తర్వాత కూడా సినిమా బాగలేదంటూ నెగిటివ్గా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అయితే కథ కంటెంట్ బాగుంటే ఎలాంటి దుష్ప్రచారాలు కూడా సినిమాపై ప్రభావం చూపవని నిరూపించింది దేవర. ఎన్నో అవమానాలు, అనుమానాలు , నెగటివ్ రూమర్స్ మధ్య కమ్ముకున్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ వెలుతురుల దూసుకొచ్చారు ఎన్టీఆర్. తనలో నటన ఉంది అని , కథలను ఎంపిక చేసుకునే తీరు తనకు తెలుసు అని మరొకసారి నిరూపించారు. ఎవరు ఎలాంటి కామెంట్లు చేసినా కథ నచ్చితే ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి ఇది చక్కటి నిదర్శనం. మొత్తానికైతే మొదటి రోజే భారీ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త సంచలనం క్రియేట్ చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.

Related News

Devara: నాన్ SSR రికార్డ్స్ బ్రేక్.. అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా ఆ స్థానం..!

Ranbir Kapoor : కొత్త బిజినెస్ మొదలెట్టిన రణబీర్ కపూర్… బర్త్ డే స్పెషల్ గా బట్టల వ్యాపారం

Harsha Sai : ‘కొంచం రొమాంటిక్ గా మాట్లాడదామా..?’ హగ్గు, ఐ లవ్ యూ… హర్ష సాయి సంచలన వీడియో లీక్

Jani Master Case : ‘జానీ నాకు అన్నయ్య’.. బాధిత యువతి మాటలివి… కేసులో అసలు ట్విస్ట్ ఇదే..

Dil Raju : వెటరన్ డైరెక్టర్ తో దిల్ రాజు కొత్త ప్రాజెక్ట్… వారసుడి కోసం రిస్క్

HBD Puri Jagannadh: పూరీ చిరకాల కోరిక మెగాస్టార్ తీర్చేనా..?

Big Stories

×