BigTV English

Shaakuntalam: శాకుంతలం కోసం బంగారు వజ్రాభరణాలు.. రేట్ ఎంతో తెలుసా?

Shaakuntalam: శాకుంతలం కోసం బంగారు వజ్రాభరణాలు.. రేట్ ఎంతో తెలుసా?

Shaakuntalam: మెరిసేదంతా బంగారం కాదు. సినిమాల్లో అయితే అస్సలు కాదు. అంతా రోల్డ్ గోల్డ్. లేదంటే గ్రాఫిక్స్. కానీ, శాకుంతలం సినిమాలో సమంత ఒంటిపై మెరిసేదంతా స్వచ్ఛమైన, అసలుసిసలైన బంగారు ఆభరణాలే అంటున్నారు డైరెక్టర్ గుణశేఖర్. ఆయనకు సినిమా మీద ఉన్న ప్రేమ అలాంటిది.


అసలే పౌరాణిక పాత్ర. మహారాణి గెటప్. రాణి గారి ఒంటిపై బంగారం అంటే మామూలు విషయమే. రత్నవజ్రవైడూర్యాలు పొదిగి ఉండే ఆభరణాలు అనేకం ఉంటాయి. అంతటి గ్రాండ్ జ్యువెలరీని.. రియల్‌గా చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుంది? మరొకరైతే వామ్మో అనేసేవారే. కానీ, గుణశేఖర్ అలా కాదు. నిజమైన బంగారంతో చేసిన ఆభరణాలనే తన శకుంతలకు అలంకరించారు. ఒక్క శకుంతలకే కాదు దుష్యంత మహారాజుకు, మేనక కోసమూ వర్జినల్ జ్యువెలరీనే వాడారు. అందుకోసం సుమారు 14 కోట్లు ఖర్చు చేశారు.

శకుంతల పాత్ర కోసం 15 కిలోల బంగారంతో 14 రకాల ఆభరణాలను తయారు చేయించారట. దుష్యంత మహారాజు పాత్ర కోసం 8 నుంచి 10 కిలోల బంగారంతో ఆభరణాలు రెడీ చేయించారు. మేనక పాత్రధారి మధుబాల కోసం వజ్రాలు పొదిగిన దుస్తులను రూపొందించారు.


ప్రముఖ డిజైనర్ నీతు లుల్లా సారథ్యంలో వసుంధర జ్యుయెలరీస్ శాకుంతలం కోసం బంగారు, వజ్రాభరణాలను తయారు చేసింది. దాదాపు ఆరేడు నెలలు శ్రమించి నగలు రూపొందించారు. పూర్తిగా చేతితోనే ఆభరణాలు తయారు చేయడంతో.. అవి ధరించిన పాత్రలకు మరింత అందం, రాజసం వచ్చిందని దర్శకుడు గుణశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు.

‘దాన వీర శూర కర్ణ’లో ఎన్టీఆర్ వాడిన బంగారు కిరీటం స్ఫూర్తితోనే తన సినిమాల్లో హీరో, హీరోయిన్లకు నిజమైన బంగారం, వజ్రాలతో తయారు చేయించిన ఆభరణాలనే వాడినట్టు గుణశేఖర్ చెప్పారు.

శాకుంతలం.. ఏప్రిల్ 14న విడుదల అవుతోంది. చిత్రంలో శకుంతల, దుష్యంతుడు ధరించిన బంగారు, వజ్రాభరణాల ఫొటోలను హైదరాబాద్‌లోని వసుంధర జ్యుయెలరీస్‌లో ఆవిష్కరించారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా రూపొందిన ‘శాకుంతలం’ మూవీలో శకుంతల పాత్రను సమంత చేయగా.. దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ (Dev Mohan) నటించారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మోహన్‌ బాబు, గౌతమి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×