EPAPER

Custody Twitter Review : చైతు, అరవింద్ స్వామి యాక్టింగ్ అదుర్స్.. కస్టడీ మూవీ ఎలా ఉందంటే..?

Custody Twitter Review : చైతు, అరవింద్ స్వామి యాక్టింగ్ అదుర్స్.. కస్టడీ మూవీ ఎలా ఉందంటే..?

Custody Movie Twitter Review(Latest Tollywood Updates) : నాగచైతన్య, కృతీశెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం కస్టడీ. తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీని డెరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. అక్కినేని అభిమానులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది.


ఇప్పటికే ఓవర్సీస్‌తోపాటు తెలుగురాష్ట్రాల్లో ప్రేక్షకులు చాలామంది కస్టడీ మూవీ చూసేశారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్‌ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు. కస్టడీ సినిమా ఎలా ఉంది? పోలీస్ గా నాగచైతన్య మెప్పించాడా? ఇలాంటి అంశాలను ట్విటర్‌ లో చర్చిస్తున్నారు.

కస్టడీ మూవీకి సోషల్‌ మీడియాలో డివైడ్ టాక్ వచ్చింది. నాగచైతన్య, అరవింద్ స్వామి నటన బాగుందని ప్రశంసలు కురిపిస్తున్నారు. కథ, కథనాలపై భిన్నఅభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇళయరాజా, యువన్‌ శంకర్‌ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందంటున్నారు. కానీ పాటలు ఆకట్టుకునేలా లేవని ట్విట్టర్ టాక్


సినిమా నెమ్మదిగా మొదలైందని నెటిజన్లు అంటున్నారు. ఫస్టాప్ రొటీన్ గా ఉందని చెబుతున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగానే ఉందని ట్వీట్లు చేస్తున్నారు. నాగచైతన్య కెరీర్‌లో మంచి మూవీ అవుతుందని మరికొందరు పాజిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు రొటీన్ మూవీ అని అంటున్నారు. మొత్తంమీద కస్టడీకి ట్విట్టర్ లో ఓవరాల్‌గా యావరేజ్‌ టాక్ వచ్చింది. 4 షోలు పడిన తర్వాత మూవీ అసలు టాక్ తెలుస్తుంది.

https://twitter.com/ReviewMamago/status/1656827812668665856?cxt=HHwWgMDTwcGHnv4tAAAA

Related News

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Sekhar Bhashaa : జానీ మాస్టర్ కేసు పై సంచలన నిజాలను బయట పెట్టిన శేఖర్ భాషా..?

Prakash Raj: తిరుపతి లడ్డూ వివాదం.. పవన్ కళ్యాణ్ పై ప్రకాష్ రాజ్ ఫైర్

Tripti dimri: ఒకే గదిలో 50 మందితో.. భరించలేకపోయా – నేషనల్ క్రష్..!

Jani Master : జానీ మాస్టర్ దొరికిన హోటల్ ఎంత గ్రాండ్ గా ఉందొ చూసారా.?

Mahesh Babu : మహేష్ బాబు సినిమాలో ఎన్టీఆర్.. ఇదేం ట్విస్ట్ మామా.. నిజమైతే థియేటర్లు చిరిగిపోవాల్సిందే..

Big Stories

×