EPAPER

CM Revanth Reddy: సీఎం కీలక నిర్ణయం.. తెలంగాణలో ‘ఎమర్జెన్సీ’ మూవీ బ్యాన్!

CM Revanth Reddy: సీఎం కీలక నిర్ణయం.. తెలంగాణలో ‘ఎమర్జెన్సీ’ మూవీ బ్యాన్!

CM Assures Sikh Community to ban Emergency movie: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎమర్జెన్సీ’. ఈ మూవీకి తెలంగాణలో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ సినిమాను తెలంగాణలో విడుదలపై నిషేధం విధించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మాజీ ఐపీఎస్ అధికారి తేజ్ దీప్ కౌర్ మీనన్ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి బృందం సచివాలయంలో షబ్బీర్‌ను కలిశారు.


తెలంగాణలో ‘ఎమర్జెన్సీ’ సినిమా విడుదలపై నిషేధం విధించాలని అభ్యర్థించినట్లు తెలిపారు. ఇందులో సిక్కు సమాజాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని, ఈ సినిమా చిత్రీకరణ పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ 18 మంది సభ్యుల సిక్కు సొసైటీ బృందం రిప్రజెంటేషన్ సమర్పించినట్లు షబ్బీర్ తెలిపారు.

ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని షబ్బీర్ కలిసి వివరించారు. ఈ సినిమా అభ్యంతకరమని, సమాజ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందని తెలంగాణ సిక్కు సొసైటీ బృందం చెప్పిన అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ సినిమా విడుదలపై న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని ఆ తర్వాత ఈ సినిమా నిషేధించేందుకు ప్రయత్నిస్తానని సీఎం రేవంత్ రెడ్డి సిక్కులకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. తెలంగాణ జనాభాలో సిక్కు సమాజం 2 శాతంగా ఉంది.


ఈ సినిమాను దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో విధించిన ఎమర్జెనీ ఇతివృత్తం నేపథ్యంలో తెరకెక్కించారు. ఇందులో సిక్కు కమ్యూనిటీకి చెందిన వారి మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. ఈ సినిమాలో తమ వర్గాన్ని ఉగ్రవాదులు, దేశద్రోహులుగా చిత్రీకరించాని ఆరోపించారు. అందుకే ఈ సినిమా విడుదలపై నిషేధం విధించాలని కోరుతున్నామన్నారు. కాగా, ఈ వివాదం దేశవ్యాప్తంగా జరుగుతుండగా.. ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కాగా, ఈ సినిమా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇందులో కంగనా మాజీ సీఎం ఇందిరాగాంధీ పాత్రలో నటించారు. ఇందిరాగాంధీ పాలనలో 1975 జూన్ 25 నుంచి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాను సెప్టెంబర్ 6న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా..కంగనా హోం బ్యానర్ మణి కర్ణిక ఫిల్మ్స్ బ్యానర్ పై రేణు పిట్టి, కంగనా రనౌత్ సంయుక్తంగా నిర్మించారు.

Also Read: హైదరాబాద్,వరంగల్ టిమ్స్‌ నిర్మాణం.. విజిలెన్స్‌ విచారణ

కంగనా రనౌత్ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తన గురువు సద్గురు జగ్గీవాస్ దేవ్ సూచించన మార్గంలో రాజకీయాల్లోకి వచ్చినట్లు పలుమార్లు చెప్పుకొచ్చారు. అంతకుముందు తను రాజకీయాల్లో రావాలని ఆఫర్లు వచ్చినప్పటికీ పెండింగ్‌లో ఉన్న సినిమాలు పూర్తి చేసి రావాలని అనుకున్న తరుణంలో పిలుపు వచ్చిందన్నారు.

రాజకీయం నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో మొదటి నుంచి రాజకీయాల్లోకి రావాలని అడిగినట్లు వెల్లడించారు. తన తాత సర్జూ సింగ్ రనౌత్ మూడు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

Related News

Suriya: బాలీవుడ్ బాటపట్టనున్న సూర్య.. హీరోగా కాదు విలన్‌గా ఎంట్రీ!

Devara: రెడ్ సీ.. ఏం సాంగ్ రా బాబు.. పోవడంలేదు మైండ్ లో నుంచి..

Jani Master : ఇక్కడ ఇంత రచ్చ జరిగితే… నిన్న ముంబైలో ఏం పట్టనట్టు ఏం చేశాడో తెలుసా..?

Anasuya Bharadwaj: నేను బాధితురాలిని కలిశాను.. జానీ మాస్టర్ కేసుపై స్పందించిన అనసూయ

Johnny Master : రంగంలోకి దిగిన మహిళా సంఘాలు… జానీ మాస్టర్ కి ఇక జాతరే..

Coolie Leaked : రజినీ మూవీ నుంచి యాక్షన్ ఎపిసోడ్ లీక్… నాగ్ క్లాసిక్ ఫైట్ ఏం ఉంది మామా….

Poonam Kaur: త్రివిక్రమ్ వేధించింది.. పవన్ కోసమా.. ?

Big Stories

×