Chiranjeevi Godfather Politics : మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ గురించి అప్పుడప్పుడూ మీడియాలో ప్రస్తావన వస్తుంది. ఇందులో ప్రముఖంగా.. ప్రజారాజ్యం పార్టీని, టికెట్లను అమ్ముకున్నారని అనేక విమర్శలు వచ్చాయి. ఇటీవల గాడ్‌ఫాదర్ మూవీ సక్సెస్ మీట్‌లో నిర్మాత ఎన్వీ ప్రసాద్ దీనికి సంబంధించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
“ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి టికెట్స్ అమ్ముకున్నారన్నారు.. కానీ ఆయన పార్టీ నడపడానికి చేసిన అప్పుల కోసం చెన్నై ప్రసాద్ ల్యాబ్ సమీపంలో అత్యంత విలువైన స్థలాన్ని అమ్ముకున్నారు”. అని నిర్మాత ఎన్వీ ప్రసాద్ చెప్పారు.
ప్రజారాజ్యం పార్టీలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికే జనసేన వచ్చిందని అన్నారు ఎన్వీ ప్రసాద్. సినీటౌన్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గంలో కూడా తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో పవన్‌కు మెగాస్టార్ పూర్తి మద్దతు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. పవన్‌కు తన మద్దతు ఉంటుందని చిరు కూడా ఇప్పటికే ప్రకటించడం విశేషం. చిరంజీవి.. సినిమా స్క్రీన్ లోనే కాదు.. పొలిటికల్ స్క్రీన్ లో పవన్ కు గాడ్ ఫాదర్ కానున్నారా అన్న చర్చ రాజకీయవర్గాల్లో నడుస్తోంది.
Leave a Comment