EPAPER

Chiranjeevi : ఎలాంటి కుర్చీలు వద్దు.. చిరంజీవి ఆ మాట ఎందుకన్నారు?

Chiranjeevi : ఎలాంటి కుర్చీలు వద్దు.. చిరంజీవి ఆ మాట ఎందుకన్నారు?

Chiranjeevi :


Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ వివాదాల జోలుకు పోరు. కానీ వివాదాలే ఆయన చుట్టూ తిరుగుతాయి. అందుకే తన ఆవేదన అప్పుడు కొన్ని వేదికలపై వెల్లడిస్తారు. ఈ క్రమంలో ఇప్పుడు మెగాస్టార్ తాజా చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ లో చర్చకు దారితీశాయి. సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీలో నిర్మించిన నూతన గృహ సముదాయాన్ని చిరంజీవి ప్రారంభించారు. లబ్ధిదారులకు పట్టాలు అందించారు. ఆ తర్వాత మెగాస్టార్ కీలక వ్యాఖ్యలుచేశారు. సినిమా ఇండస్ట్రీలో పెద్దరికం అనుభవించాలనే ఉద్దేశం తనకు లేదని అన్నారు. తనకు ఎలాంటి కుర్చీలూ వద్దని స్పష్టం చేశారు. కేవలం కళాకారుల సంక్షేమం కోసం తానెప్పుడూ ముందుంటానని తెలిపారు. సినీ కార్మికులు, కళాకారులు తన కుటుంబసభ్యులతో సమానమన్నారు. వాళ్లకు ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతానని స్పష్టం చేశారు. భగవంతుడు తనకు అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడని తెలిపారు. అందుకే ఏదో ఒకరకంగా కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు చేస్తున్నానని పేర్కొన్నారు. పెద్దరికం అనుభవించాలనే ఆలోచన తనకు లేదన్నారు. అవసరం వచ్చినప్పుడు తప్పకుండా భుజం కాస్తానని చిరంజీవి స్పష్టం చేశారు.

సరిగ్గా 22 ఏళ్ల క్రితం ఇదే రోజున చిత్రపురి కాలనీకి శంకుస్థాపన జరిగిందని మెగాస్టార్ గుర్తు చేశారు. అందుకే ఈ రోజు ఉన్న కార్యక్రమాలను వాయిదా వేసుకుని ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. సినీ కార్మికులకు సైతం సొంత ఇల్లు ఉండాలనేది ఒక పెద్ద కల అన్నారు. ఆ కల సాకారం చేయడం కోసం కృషి చేసిన వారిని అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర్‌రెడ్డిని గుర్తు చేసుకున్నారు. ఆయన సుదీర్ఘ ఆలోచన నేడు సాకారమైందని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం టాలీవుడ్ సినీ కార్మికులకే గృహ సముదాయం ఉందన్నారు.


ఇంకా చిరు ఏం చెప్పారంటే..
ఈ గృహ సముదాయాన్ని నిర్మించడం కోసం కమిటీని ఏర్పాటు చేయగా మధ్యలో ఏవో అవకతవకలు జరిగాయన్నారు. దాని గురించి నాకు పూర్తి సమాచారం లేదు. కాబట్టి దానిపై మాట్లాడను. అనిల్‌ దొరై సారథ్యంలోని కొత్త కమిటీ అన్ని పనులను సజావుగా పూర్తి చేసిందని సి.కల్యాణ్‌, తమ్మారెడ్డి తెలిపారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ లబ్ధిదారులందరికీ శుభాకాంక్షలు. మీకెప్పుడూ ఏ అవసరం వచ్చినా సరే నేను ముందు ఉంటాను. సి.కల్యాణ్‌, తమ్మారెడ్డి భరద్వాజ నన్ను ప్రతిసారీ పెద్ద అని చెబుతుంటారు. వాళ్లు నాకంటే చిన్నవాళ్లు అనిపించుకోవడం కోసం నన్ను పెద్ద అంటున్నారు. నిజం చెప్పాలంటే వాళ్లే పెద్దలు. వాళ్లకు అండగా నేను ఉంటాను. మరి చిరంజీవి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Related News

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Big Stories

×