E-Paper
Advertisement

Chiranjeevi:- డా.బ్రహ్మానందంను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్

Chiranjeevi:- డా.బ్రహ్మానందంను అభినందించిన మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్

Chiranjeevi:- ప్రతిభను ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎల్లప్పుడూ ముందుంటారు. మంచి సినిమాకు ఆయన అండదండలు, ప్రశంసలు ఎప్పుడూ ఉంటాయి. ఈ మధ్య చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘రంగమార్తాండ’ సినిమా చూశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా తండ్రీ కుమారులకు నచ్చింది. 

‘రంగమార్తాండ’ సినిమాలో పద్మశ్రీ పురస్కార గ్రహీత, డాక్టర్ బ్రహ్మానందం నటనకు సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. ఇప్పుడు ఆయన నటనకు మెగా ప్రశంసలు లభించాయి. ఆయన నటనకు మెగాస్టార్, గ్లోబల్ స్టార్ ముగ్ధులయ్యారు. అంతే కాదు, బ్రహ్మానందాన్ని చిరంజీవి, రామ్ చరణ్ ప్రత్యేకంగా సత్కరించారు. ‘రంగమార్తాండ’ సినిమాలో కనబరిచిన నటనను ప్రశంసించారు. సాధారణంగా బ్రహ్మానందం అంటే అందరికీ ఆయన చేసిన కామెడీ పాత్రలే గుర్తుకు వస్తాయి. అయితే ఆయన ఎమోషనల్ పాత్రల్లోనూ అద్భుతంగా నటించారు. గతంలోనూ ఆయన యాక్ట్ చేసిన బాబాయ్ హోటల్ అందుకు ఓ బెస్ట్ ఎగ్జాంపుల్. చాలా గ్యాప్ తర్వాత బ్రహ్మానందం సీరియస్ అండ్ ఎమోషనల్ పాత్రను రంగ మార్తాండ చిత్రంలో పోషించారు.

ప్రకాష్ రాజ్ స్నేహితుడి పాత్రలో బ్రహ్మానందం చేసిన నటనకు, క్యారీ చేసిన ఎమోషన్స్ చూసిన వారందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. తాజాగా ఆ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరారు. నిజంగా కామెడీతో నవ్విస్తూ వచ్చిన ఆయన చాలా కాలం తర్వాత ఇంత హెవీ ఎమోషనల్ రోల్ చేయటం ఆయనకు ఛాలెంజింగ్ అనే చెప్పాలి.

‘రంగమార్తాండ’కు కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మికా రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ, ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన తారాగణం. టైటిల్స్ సమయంలో వినిపించిన పవర్ ఫుల్ షాయరీ ‘నేనొక నటుడ్ని’కి మెగాస్టార్ చిరంజీవి గళం అందించారు. మార్చి 22న విడుదలైన చిత్రం పాజిటివ్ టాక్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. మరాఠీ చిత్రం నట సామ్రాట్‌కి ఇది రీమేక్.

ఓటీటీలో ‘బలగం’.. ఎందులోనంటే?.. ఈవారం సినిమాలు, సిరీస్‌లు ఇవే..
for more updates follow this link:-bigtv

Related News

అరె ఏంట్రా ఇది.. స్టేజ్ పైనే ముద్దులు.. షాక్ లో ప్రదీప్…

నారా దేవాన్ష్ ‘డినో డైమెన్షన్స్’ ఎపిసోడ్ 1 వచ్చేసింది.. ఇండియాలోని ‘రాజాసారస్’ విశేషాలు!

యూట్యూబ్‌‌లోకి నారా లోకేష్ కుమారుడు.. ‘డైనో డీట్స్’ పాడ్‌కాస్ట్‌తో సరికొత్త ప్రయాణం!

Big TV Kissik Talks: పటాస్ ప్రవీణ్ జీవితంలో కష్టాలు.. ఆ ఒక్కటే నాకు బాధ.. వర్ష ఎమోషనల్..

యూట్యూబర్ అన్వేష్ పై మాధవిలత కామెంట్స్.. ఖర్మ అనుభవించక తప్పదు..

మణికంఠపై బూతులు.. రెచ్చిపోయిన రోహిణి.. రీతూ కొత్త అవతారం..రచ్చ రచ్చే..

ఫెమినా మిస్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్న గోవా సుందరి సాధ్వి.. భారత్‌కు కొత్త గ్లామర్ ఐకాన్!

కుమారి ఆంటీ నెల సంపాదన ఎంతో తెలుసా.. లక్షల్లోనే సంపాదిస్తోందిగా ?

Big Stories

×