EPAPER

Actress Tabu : అందాల తార టబు కు పుట్టినరోజు శుభాకాంక్షలు..

Actress Tabu : అందాల తార టబు కు పుట్టినరోజు శుభాకాంక్షలు..
Actress Tabu

Actress Tabu : నిన్నే పెళ్ళాడుతా చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసిన అందాల భామ టబు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చింది అని అందరూ అనుకునే టబు పుట్టింది హైదరాబాద్ అన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ హైదరాబాద్ అమ్మాయి అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ. 1971 వ సంవత్సరం నవంబర్ 4వ తారీఖున హైదరాబాదులోని జమాల్ హష్మీ,రిజ్వానా దంపతులకు టబు జన్మించింది. 


టబు అత్త షబానా అజ్మీ.. బాలీవుడ్ లో ప్రముఖ నటి. ఆమె అక్క ఫరా నాజ్ హష్మీ కూడా బాలీవుడ్ లో మంచి యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంది.1980 లో బజార్ అనే మూవీలో టబూ యాక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 14 సంవత్సరాల వయసులో హమ్ నవ జవాన్ అనే చిత్రంలో దేవానంద్ కుమార్తెగా టబు నటించింది. దివ్యభారతి టబు ను  ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ రాఘవేంద్రరావు  కి పరిచయం చేయడంతో ఆమెకు కూలి నెంబర్ వన్ మూవీలో ఆఫర్ వచ్చింది. అలా వెంకటేష్ తో కలిసి కూలి నెంబర్ వన్ చిత్రంలో నటించిన టబు తెలుగు సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది.

బోనీ కపూర్ సంస్థ నిర్మిస్తున్న ‘రూప్‌కీ రాణీ చోరోంకా రాజా’, ‘ప్రేమ్’చిత్రాల కోసం టబు ను హీరోయిన్ గా ఎంచుకున్నారు. ఇందులో ప్రేమ్ మూవీ లో సంజయ్ కపూర్ హీరోగా నటించారు. అయితే ఈ చిత్రం పూర్తి కావడానికి అప్పట్లో 8 సంవత్సరాలు పట్టింది. హిందీలో అజయ్ దేవగన్ తో నటించిన విజయ్‌పథ్ మూవీ ఆమెకు బాలీవుడ్ లో తొలి విజయాన్ని అందించింది. ఇక ఆ తర్వాత అటు తెలుగులో ఇటు హిందీలో టబు ఫుల్ బిజీ అయిపోయింది.


మాచీస్ అనే హిందీ మూవీ కి గాను టబు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. ప్రియదర్శన్ దర్శకత్వంలో ఆమె నటించిన కాలాపానీ చిత్రం తమిళ్లో కూడా టబు కు మాంచి క్రేజ్ తెచ్చి పెట్టింది.ఇక టబు తమిళ్ లో నటించిన కాదల్ దేశమ్ అదే మన తెలుగులో ప్రేమదేశం.. యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చింది. తెలుగులో టబు ‘చెన్నకేశవరెడ్డి’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘అందరివాడు’, ‘పాండురంగడు’, ‘ఇదీ సంగతి ‘లాంటి చిత్రాలలో నటించింది. చేసినవి కొన్ని సినిమాలైనా తెలుగు సినీ ఇండస్ట్రీ పై టబు చెరగని ముద్ర వేసింది.

ముఖ్యంగా నాగార్జున, టబు కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది అని టాక్. పైగా అప్పట్లో వీళ్ళిద్దరి పై టాలీవుడ్ లో చాలా గాసిప్స్ వినిపించాయి. అయితే ఇద్దరూ తాము మంచి స్నేహితులం అని పలు సందర్భాలలో స్పష్టం చేయడం కూడా జరిగింది. మరోపక్క బాలీవుడ్ యాక్టర్ అజయ్ దేవగన్ తో కూడా టబూ చాలా క్లోజ్ గా ఉంటుంది అని టాక్. అవకాశాలు తగ్గడంతో కాస్త బ్రేక్ తీసుకున్న టబు తిరిగి అల వైకుంఠపురం మూవీలో అల్లు అర్జున్ తల్లి పాత్రతో తెలుగు ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక మళ్లీ మెల్లగా తనకు తగిన పాత్రలు చేస్తూ మంచి గ్లామర్ షో తో దూసుకుపోతోంది టబు.

ఐదు పదుల వయసు దాటుతున్న ఇంకా అరేబియన్ గుర్రంలా అందంగా ఉన్న ఈ హైదరాబాద్ బ్యూటీ బర్త్డే ఈరోజు.ఈ సందర్భంగా బిగ్ టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×