EPAPER

Call Me Bae Review: లైగర్ బ్యూటీ మొట్ట మొదటి వెబ్ సిరీస్.. ఎలా ఉందంటే.. ?

Call Me Bae Review: లైగర్ బ్యూటీ మొట్ట మొదటి వెబ్ సిరీస్.. ఎలా ఉందంటే.. ?

Call Me Bae Review: ప్రస్తుతం థియేటర్ లో కన్నా ఓటీటీలోనే ఎక్కువ కంటెంట్ దొరుకుతుంది అంటే అతిశయోక్తి కాదు.  ముఖ్యంగా స్టార్ హీరో, హీరోయిన్స్ సైతం ఓటీటీలోకి అడుగుపెట్టి  మంచి విజయాలను అందుకుంటున్నారు.  టాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే .. బాలీవుడ్ లో సగానికి సగం స్టార్స్ అందరూ ఓటీటీలోనే కనిపిస్తున్నారు. తాజాగా  బాలీవుడ్ హాట్ బ్యూటీ అనన్య పాండే తన మొట్ట మొదటి ఓటీటీ డెబ్యూ ఇచ్చేసింది. స్టూడెంట్  ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్  ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే  మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు అవార్డులను అందుకొని  స్టార్ హీరోయిన్  గా మారింది.


ఇక తెలుగులో లైగర్ సినిమాతో అనన్య ఎంట్రీ ఇచ్చింది. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఎంతటి డిజాస్టర్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాత  అనన్య తెలుగులో కనిపించలేదు. బాలీవుడ్ లో పలు సినిమాలలో నటించినా ఆశించిన ఫలితాన్ని మాత్రం అందుకోలేకపోయింది.ఈ నేపథ్యంలోనే  అనన్య.. కాల్ మీ బే అనే సిరీస్ తో  అమెజాన్ లోకి అడుగుపెట్టింది. కోలిన్ డి’కున్హా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ను  కరణ్ జోహార్ నిర్మించాడు.  సెప్టెంబర్  6 న రిలీజ్ అయిన ఈ సిరీస్ ఎలా ఉంది.. ? ఏంటి.. ? అనేది తెలుసుకుందాం.

కథ: బెల్లా( అనన్య పాండే) రాజవంశానికి చెందిన ఒక్కగానొక్క వారసురాలు. ఆమె తల్లిదండ్రులు ఆమెను ఎంతో అపురూపంగా పెంచుతారు. తనకు నచ్చింది చేయనివ్వకుండా.. ఆమెకు ఏది మంచిదో అదే చేయాలనీ చూస్తూ ఉంటారు. బెల్లాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు ఉండరు. దీంతో ఆమె సోషల్ మీడియాలోని తన ఫాలోవర్స్ నే తన ఫ్యామిలీగా భావిస్తూ ఉంటుంది. కాల్ మీ బే అనే పేరుతో ఒక అకౌంట్ ఓపెన్ చేసి.. రోజు తన జీవితంలో జరిగే విషయాలను అందులో పంచుకుంటుంది. ఇక బే.. ఎంబీఏ చేద్దాం అనే టైమ్ లో ఆమె తల్లి.. అగస్త్య చౌదరీ(విహాన్ సమత్) అనే మరో ధనవంతుడుకు ఇచ్చి పెళ్లి చేస్తుంది. మూడేళ్ల వారి వివాహ జీవితంలో అగస్త్య బిజినెస్ లు అంటూ తిరుగుతూ ఉండడంతో బే ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడే  ఆమె జీవితంలోక్లి జిమ్ కోచ్ ప్రిన్స్ (వరుణ్ సూద్) అడుగుపెడతాడు. వీరిద్దరూ ఒక పార్టీలో కిస్ చేసుకుంటూ భర్త అగస్త్యతో పాటు రెండు కుటుంబాల కంట పడతారు. దీంతో బేను ఇంట్లో నుంచి గెంటేస్తారు. చిన్నప్పటి నుంచి గోల్డ్ స్పూన్ తో పెరిగిన బే.. రోడ్డు మీదకు వచ్చేస్తుంది. తల్లి, అన్న, ఫ్రెండ్స్ ఎవరు  ఆమెను దగ్గరకు రానివ్వరు. దీంతో ఢిల్లీ నుంచి ముంబై చేరుకున్న బే ప్రయాణం ఎక్కడకు చేరింది. ఆ ప్రయాణంలో ఆమెకు ఎదురైనా మనుషులు ఎవరు.. ? చివరకు బే.. తాను అనుకున్నది సాధించిందా.. ? బే లైఫ్ లోకి వచ్చి నీల్ నాయర్ ఎవరు.. ? వారిద్దరూ కలిసి సత్యజిత్ జీవితాన్ని ఎలా నాశనం చేశారు.. అనేది సిరీస్ లో చూసి తెలుసుకోవాల్సిందే. 


విశ్లేషణ:  రాజ కుటుంబీకులు, ధనవంతులు.. బయట ఎలా ఉన్నా .. ఇంట్లో ఎలా ఉంటారు అనేది చాలా మందికి తెలియదు. డబ్బు కోసం కష్టపడుతూ కుటుంబాలను పట్టించుకోరు. ఇది నమ్మదగ్గ సత్యం. ఈ విషయాన్నీ ఈ సిరీస్ లో ఎంతో బాగా చూపించారు. ప్రిన్సెస్ గా పుట్టిన బెల్లా.. చుట్టూ  కోటలు ఉన్నా ఒంటరి పక్షిగా ఉంటుంది. ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటుంది. చివరికి తాను ఏం తినాలో కూడా తనకు తెలియదు. పుట్టింట్లోనే కాకుండా.. మెట్టింటికి వెళ్లినా కూడా ఆ ఒంటరితనం ఆమెను అలానే వెంటాడుతుంది. భర్త బిజినెస్ లు అంటూ తిరగడం, కనీసం ఫిజికల్ గా కూడా కలవకపోవడంతో ఆమె మనసు వేరొక అబ్బాయి మీదకు మళ్లుతుంది. నిజం  చెప్పాలంటే ఆమె అలా చేయడం తప్పే  కాదని కన్విన్స్ చేసిన విధానం బావుంది.

సిరీస్ మొత్తాన్ని డ్రామాలా కాకుండా .. కామెడీతో నింపడంతో.. ఎక్కడా బోర్ కొట్టినట్లు కానీ, విసిగించినట్లు కానీ కనిపించదు. ఇక డబ్బున్న వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీడియాతో వారు డీల్ చేసే విధానాన్ని చాలా చక్కగా చూపించారు. ఇక బే బయటకు వచ్చాకా పడే కష్టాలను కూడా కామెడీగా చూపించడంతో ఆమెపై మనకు సింపతీ రాదు.. ఆమె ఎలా సర్వైవల్ అవుతుందా అనే క్యూరియాసిటీ పెరుగుతుంది.  ఈ ప్రయాణంలో బెల్లా.. మంచి స్నేహితులను కలుసుకుంటుంది. తనకు నచ్చిన అబ్బాయిని కలుస్తుంది.  ఇక వీటితో పాటు తనలో ఉన్న ధైర్యాన్ని  చూపించి స్టార్ గా ఎదగడం అనేది  ఆకట్టుకుంటుంది. గతంలో చేసిన  తప్పులను ఒప్పుకుంటూనే.. వాటిని అధిగమించడానికి బెల్లా చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. మొత్తం 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ను ఫ్యామిలీ తో కలిసి చూడొచ్చు.

నటీనటులు: బెల్లా అనే పాత్రలో అనన్య అదరగొట్టేసింది.  ప్రిన్సెస్ గా పుట్టిన బెల్లా.. ఎటు తేల్చుకొని నిర్ణయాలు, అమాయకంగా పెట్టే ముఖం,  ఎమోషనల్ అవ్వడం, ముఖ్యంగా ఆమె ఫ్యాషన్ సెన్స్ హైలైట్ గా నిలిచాయి. ఇక బెల్లా తరువాత సిరీస్ మొత్తం నడిచే పాత్ర అంటే.. బెల్లాను కాపాడి.. తన సొంత సిస్టర్ గా చూసుకున్న సైరా ఆలీ (ముస్కాన్ జాఫేరి). తనకు హెల్ప్ చేసింది అన్న ఒకే ఒక్క కారణంతో బెల్లాను ఆశ్రయమిచ్చి.. ఉద్యోగం వచ్చేలా చేస్తుంది. ఇక మిగతావారందరూ తమ పాత్రల్లో తమ పరిధిమేరకు నటించారు.  ఇక ఈ సిరీస్ లో   మెహరీన్ తమ్ముడు గుర్ఫతే పిర్జాదా సెకండ్ హీరోగా కనిపించాడు. మీడియా అంటే.. వల్గారిటీ కాదు అని, దానికంటూ కొన్ని విలువలు ఉన్నాయని నమ్మే నీల్ పాత్రలో అతడి నటన అద్భుతం.  

ఎట్టకేలకు ఈ సిరీస్ అమెజాన్ లో మంచి విజయవంతంగా కొనసాగుతోంది. అనన్య ఈ సిరీస్ తో ఒక మంచి హిట్ ను అందుకున్నదనే చెప్పాలి.  త్వరలోనే ఈ సిరీస్ కు సెకండ్ సీజన్ కూడా ఉందని మేకర్స్ హింట్ ఇచ్చారు. మరి ఆ సిరీస్ వచ్చేవరకు ఈ చిన్నది.. సినిమాలతో మళ్ళీ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

ట్యాగ్ లైన్: కాల్ మీ బే..  పర్ఫెక్ట్ వీకెండ్ సిరీస్

Related News

Johnny Master : మాస్టారు క్రిమినల్ హిస్టరీ… నెలలపాటు జైల్లోనే…

Singer Chinmayi : మైనర్ పై జానీ మాస్టర్ అత్యాచారం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన చిన్మయి..!

Rajamouli : ఏంటి జక్కన్న.. తెలుగు హీరోలను వదిలేశావా?

Johnny Master Case : కిరాచక భార్యాభర్తలు… సాటి మహిళ కూడా కనికరించలే..

Political Celebrities: నష్ట జాతకులుగా మారిన సెలబ్రిటీస్.. మొన్న పృథ్వీ.. నేడు జానీ..!

Siddarth -Aditi Rao Hydari: మరీ ఇంత మోసమా… కాస్త ఆలోచించాల్సింది లవ్ బర్డ్స్

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Big Stories

×