EPAPER

C 202: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘సీ 202’.. హారర్ కథ, నైట్ ఎఫెక్ట్‌ కాంబినేషన్ అదుర్స్

C 202: డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘సీ 202’.. హారర్ కథ, నైట్ ఎఫెక్ట్‌ కాంబినేషన్ అదుర్స్

C 202 Movie: డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను, కంటెంట్‌ను ఎంకరేజ్ చేయడంలో తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ముందుంటారు. ఏ భాష సినిమా అయినా అది తెలుగు ఆడియన్స్‌కు నచ్చిందంటే బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వాల్సిందే. అలాగే తెలుగులో ఒక కొత్త కంటెంట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. అదే ‘సీ 202’. టైటిల్‌లోనే కొత్తదనాన్ని యాడ్ చేసి, అసలు ఈ సినిమాలో కంటెంట్ ఏంటి అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో క్రియేట్ చేయగలిగారు మేకర్స్. సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలోనే థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్.


సీనియర్ నటీనటులు

మైటీ ఓక్ పిక్చర్స్ బ్యానర్‌పై మనోహరి కేఏ నిర్మాతగా వ్యవహరించిన చిత్రమే ‘సీ 202’. మున్నా కాశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా హీరోగా కూడా నటించారు. మొదటి సినిమానే హారర్ థ్రిల్లర్ జోనర్‌ను ఎంచుకొని ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడానికి సిద్ధమయ్యారు మున్నా కాశీ. ఈ మూవీ మొత్తం నైట్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కించడం విశేషం. ఇందులో తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, షఫీ, చిత్రం శీను, వై విజయ, అర్చన కూడా ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సీ 202’లో మున్నా కాశీ సరసన గోవా బ్యూటీ షారోన్ రియా ఫెర్నాండెజ్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే మూవీ నుండి రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి.


Also Read: ‘క’మాస్ జాతర.. కిరణ్ అన్న డ్యాన్స్ కు పూనకాలు రావడం గ్యారెంటీ

అంతా సైలెన్స్

‘సీ 202’ సినిమా ట్రైలర్‌ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రాగా అందులో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించే అంశాన్ని యాడ్ చేశారు మేకర్స్. ఆ ట్రైలర్‌లో ఒక్క డైలాగ్ కూడా లేకుండా.. కేవలం నటీనటుల హావభావాలతోనే అందరినీ ఆకట్టుకున్నారు. సౌండ్ ఎఫెక్ట్స్, కెమెరా వర్క్ ఈ చిత్రానికి పెద్ద పాజిటివ్‌గా మారనుందని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. డైలాగ్స్ లేకుండా ఆడియన్స్‌ను కట్టిపడేయడం అంత ఈజీ కాదు. కానీ ‘సీ 202’ ట్రైలర్‌ను సైలెంట్‌గా డిజైన్ చేసి ఈ విషయంలో సక్సెస్ సాధించింది మూవీ టీమ్. ఇక ఈ మూవీని అక్టోబర్ 25న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. భారీ ఎత్తున ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయాలని వారు భావిస్తున్నారు.

మల్టీ టాలెంటెడ్ మున్నా

ఇక ‘సీ 202’ టెక్నికల్ టీమ్ విషయానికొస్తే.. ఈ సినిమాను మనోహరి కేఏ నిర్మిస్తుండగా.. చిన్నయ్య కొప్పుల, అలివేణి వొల్లేటి కో ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. ఎగ్జిక్యూటివ్‌గా ప్రొడ్యూసర్‌గా దత్తు ఎమ్ వ్యవహరించారు. కెమెరా బాధ్యతలను సీతారామరాజు ఉప్పుతాల్లా తీసుకున్నారు. ఇక మున్నా కాశీనే చాలావరకు అన్ని కీలకమైన టెక్నికల్ డిపార్ట్మెంట్స్ బాధ్యతలను తీసుకున్నారు. దర్శకత్వం చేయడం, హీరోగా నటించడం మాత్రమే కాకుండా కథ, స్క్రీన్ ప్లే అందించడం, మాటలు రాయడం, ఎడిటింగ్ చేయడం, సంగీతం లాంటి బాధ్యతలను కూడా మున్నా కాశీనే తీసుకొని తను మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నారు.

Related News

Euphoria Glimpse: డ్రగ్స్, రేప్స్.. యో గుణశేఖర్.. నువ్వేనా..

Emraan Hashmi: బ్రేకింగ్.. షూటింగ్ లో గాయాల పాలైన ఓజీ విలన్

Ka Mass Jathara: ‘క’మాస్ జాతర.. కిరణ్ అన్న డ్యాన్స్ కు పూనకాలు రావడం గ్యారెంటీ

Natty Kumar: పవన్ కాలి గోటికి కూడా ప్రకాశ్ రాజ్ సరిపోడు, మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఖండించలేదే.. నట్టి కుమార్ వ్యాఖ్యలు

Rashmika Mandanna: రష్మిక ఫస్ట్ ఆడిషన్ వీడియో.. ఇంతవరకు చూడని సరికొత్త లుక్!

NTR: రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్.. ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే.. ?

×