EPAPER

Brinda Web Series Review: పోలీస్ గా త్రిష .. అదిరిపోయిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వద్దు

Brinda Web Series Review: పోలీస్ గా త్రిష .. అదిరిపోయిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. అస్సలు మిస్ అవ్వద్దు

Brinda Web Series Review(Today tollywood news): ఈ మధ్య సినిమాల కన్నా వెబ్ సిరీస్ లకే ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు అభిమానులు. కొత్త కొత్త కథలతో డైరెక్టర్స్.. ప్రేక్షకులను ఓటీటీల ముందు కూర్చునేలా చేస్తున్నారు. ముఖ్యంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్.. ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. తాజాగా అలా ప్రేక్షకులను కట్టిపడేసే సిరీస్ ల లిస్ట్ లో బృంద కూడా ఒకటి. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ కు సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించాడు. ఈ సిరీస్ లో ఇంద్ర‌జిత్ సుకుమారన్, జ‌య ప్ర‌కాశ్, ఆమ‌ని, ర‌వీంద్ర విజ‌య్, ఆనంద్ సామి, రాకేందు మౌళి త‌దితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సిరీస్ నేటి నుంచి సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.  పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా త్రిష నటించిన ఈ సిరీస్ ఎలా ఉంది.. ? అసలు కథ ఏంటి.. ? అనేది చూద్దాం.


కథ: బృంద( త్రిష) ఒక పోలీస్ ఆఫీసర్. అమ్మాయి కావడంతో స్టేషన్ లో ఆమెకు ఎవరు మర్యాద ఇవ్వరు. చిన్నతనం నుంచి బృందకు తన గతం తాలూకు గుర్తులు వెంటాడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కాలువలో ఒక శవం దొరుకుతుంది. ఈ హత్య కేసును బృంద సీరియస్ గా తీసుకుంటుంది. పై అధికారులు వదిలేయ్ అని చెప్పినా.. బృంద వినకుండా కేసును సాల్వ్ చేయడానికి చూస్తుంది. అది ఒక హత్య మాత్రమే కాదు అని, ఒక సీరియల్ కిల్లర్ అని గుర్తిస్తుంది. అతను ఒకటి కాదు రెండు కాదు మొత్తం 16 మందిని చంపినట్లు తెలుసుకుంటుంది. అయితే అసలు ఈ మరణాల వలన ఉన్నది ఎవరు.. ? ఎందుకు ఆ కిల్లర్ అంతమందిని చంపుతూ వస్తున్నాడు..? అసలు కిల్లర్ మోటివ్ ఏంటి.. ? కిల్లర్ కు.. బృందకు ఉన్న సంబంధం ఏంటి.. ? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ: కంప్యూటర్ యుగంలో కూడా ఎక్కడో ఒక చోట మూఢ నమ్మకాలు ఇంకా బతికే ఉన్నాయని, దేవుడు పేరు చెప్పి కొందరు రాక్షస కాండ చేస్తున్నారని డైరెక్టర్ ఈ సిరీస్ ద్వారా తెలిపాడు. ఇక సూర్య చేసిన అటెంప్ట్ చాలా బావుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మొదటి సీన్ లోనే మూఢ నమ్మకంతో చిన్న పిల్లను బలి ఇవ్వడం చూపించి కథలోకి తీసుకెళ్లాడు.


ఒకపక్క బృంద ప్రస్తుత కథను చూపిస్తూనే.. ఇంకోపక్క ఆమె గతాన్ని కొంచెం కొంచెం రివీల్ చేస్తూ ఆసక్తి రేకెత్తించాడు. అసలు దేవుడే లేడు అన్న ఒక వ్యక్తి.. దేవుడిని నమ్మేవారందరిని చంపించడం అనేది ఒక కొత్త లైన్. దాన్ని పర్ఫెక్ట్ గా చూపించాడు డైరెక్టర్. ఒక్కో వ్యక్తిని చంపడం.. గుండు గీయంచడం.. పక్షితో పొడిపించి చంపడం.. ఇలా కొత్తగా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

8 ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ లో ఎక్కడా బోర్ కొట్టనీయకుండా కుర్చోపెట్టాడు అని చెప్పలేం కానీ, కొంతవరకు స్కిప్ చేయకుండా చూడగలిగేలా చేసాడు అని చెప్పొచ్చు. పోలీస్ గా బృంద ఇన్వెస్టిగేషన్ నెక్ట్స్ లెవెల్లో చూపించారు. స్క్రీన్ ప్లేను బలంగా చూపించడంలో కూడా సూర్య సక్సెస్ అయ్యాడు. ఇక చివర్లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కిల్లర్ చేసే హత్యలకు మోటివ్ ను చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. ఆ సన్నివేశాలు చూస్తే.. విలన్ చేస్తున్న దాంట్లో తప్పే లేదని అనిపిస్తుంది.

నటీనటులు: బృందగా త్రిష నటన పర్ఫెక్ట్ ఛాయిస్. ఫుల్ గా యాక్షన్ లేకపోయినా.. ఇన్వెస్టిగేషన్ చేసే సన్నివేశాల్లో ఆమె ఎంతో పరిణితీగా నటించింది. ఇక త్రిష తరువాత అంత పెద్ద రోల్ చేసింది అంటే మరో పోలీస్ గా రవీంద్ర విజయ్ నటన ఆకట్టుకుంటుంది. ఇక సిరీస్ మొత్తానికి హైలైట్ క్యారెక్టర్ అంటే ఆనంద్ సామి. అమాయకత్వం, క్రూరత్వం కలగలిపిన ఠాకూర్ పాత్రలో అతడు ఎంతో బాగా నటించాడు. ఇక సత్య పాత్రలో నటించిన ఇంద్రజిత్ సుకుమారన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో అద్భుతంగా ఆ పాత్రను డిజైన్ చేశారు. జ‌య ప్ర‌కాశ్, ఆమ‌ని, రాకేందు మౌళి వారి పరిధికి తగ్గ పాత్రల్లో నటించారు.

సిరీస్ మొత్తం బాగానే ఎంగేజ్ చేసినా.. 8 ఎపిసోడ్స్ అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది. విలన్ ను మధ్యలోనే రివీల్ చేయడంతో.. అతని మోటివ్ ఏంటి అనేది ప్రేక్షకులకు ముందే తెలిసిపోతుంది. చెల్లి, తల్లిని మూఢ నమ్మకంతో చంపేశారన్న కోపంతో ఒక వ్యక్తి చేసిన మారణకాండ బాగానే ఉన్నా.. కానీ, కొన్ని కొన్ని హింసాత్మకమైన సీన్స్, చనిపోయిన శవాలను జూమ్ చేసి చూపించడం కొంచెం ఎబెట్టుగా అనిపిస్తాయి. కొద్దిగా నిడివి తగ్గించి, అనవసరమైన సీన్స్ తీసేస్తే సిరీస్ మొత్తం అద్భుతంగా ఉందని చెప్పాలి. వీకెండ్ కు పర్ఫెక్ట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చూడాలనుకొనేవారు.. బృందను తప్పకుండ చూడొచ్చు.

ట్యాగ్ లైన్: బృంద.. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ కాకపోయినా ఎంగేజ్ చేస్తుంది.

Related News

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Big Stories

×