EPAPER

Bramayugam Review: మమ్ముట్టి నటించిన హారర్‌ థ్రిల్లర్‌ భ్రమయుగం.. ఎలా ఉందంటే..?

Bramayugam Review: మమ్ముట్టి నటించిన హారర్‌ థ్రిల్లర్‌ భ్రమయుగం.. ఎలా ఉందంటే..?

టైటిల్ : భ్రమయుగం
నటీనటులు: మమ్ముట్టి, అర్జున్ అశోకన్, సిధ్ధార్థ్ భరతన్
నిర్మాతలు: చక్రవర్తి రామచంద్ర & ఎస్. శశికాంత్
తెలుగు విడుదల: సితార ఎంటర్ టైన్ మెంట్స్
దర్శకత్వం: రాహుల్ సదాశివన్
సంగీతం: క్రిస్టో జేవియర్
సినిమాటోగ్రఫీ: షఫీక్ మహమ్మద్ అలీ
విడుదల తేది: 23 ఫిబ్రవరి 2024


భ్రమయుగం కథేంటంటే..

ఈ సినిమా భిన్నమైన డార్క్ ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌. తక్కవ కులానికి చెందిన దేవన్ (అర్జున్ అశోకన్) మంచి గాయకుడు. తన స్నేహితుడితో కలిసి అడవిలో ప్రయాణిస్తూ తప్పిపోతాడు.


అదే సమయంలో తన మిత్రుడిని యక్షి (అమల్డా లిజ్) తినేస్తుంది. ఒంటరి అయిపోయిన దేవన్ ఆ అడవిలో ఆహారం వెతుక్కుంటూ.. అటు ఇటు తిరిగి ఓ పాడుబడ్డ భవనంలోకి వెళ్తాడు. అందులో ఇద్దరు మాత్రమే ఉంటారు. ఒకరు వంటవాడు (సిధ్ధార్థ్ భరతన్), మరొకరు యజమాని కుడుమన్ పొట్టి(మమ్ముట్టి).

చాలా కాలం తర్వాత తన ఇంటికి ఓ అథిది వచ్చాడని చెప్పి దేవన్ ను కొడుమన్ ఇంట్లోకి సాదరంగా ఆహ్వానిస్తాడు. అయితే ఆ ఇంట్లోకి ప్రవేశించాక దేవన్ కు చిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. కొద్ది రోజుల్లోనే తను ఆ ఇంట్లో బందీ అయినట్లు తెలుసుకుంటాడు. దీంతో అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తాడు.

కానీ అతని ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయి. అసలు కుడిమన్ పొట్టి ఎవరు? పాడుబడ్డ భవనంలో ఎందుకు ఉంటాడు. అతని గురించి అన్ని తెలిసినా వంటమనిషి ఆ ఇంట్లోనే ఎందుకు ఉంటాడు? దేవన్ ని బందీగా ఎందుకు మార్చారు ? చివరకు ఆ ఇంటి నుంచి దేవన్ తప్పించుకున్నాడా లేదా ? అనేది తెలియాలంటే థియేటర్స్ లో భ్రమయుగం చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
ప్రయోగాలు చేయడంలో మమ్ముట్టి ఎప్పుడూ ముందుటారు. మెగస్టార్ అనే ఇమేజ్ ని పక్కకి పెట్టి కంటంట్ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటాడు. భ్రమయుగం కూడా మరో ప్రయోగాత్మక చిత్రమే. ఇదొక భిన్నమైన డార్క్ ఫాంటసీ హారర్ త్రిల్లర్.

ఒక్క చిన్న పాయంట్ తో రెండున్నర గంటల పాటు కథను నడిపించడం మామూలు విషయం కాదు. దర్శకుడు రాహుల్ సదాశివన్ ఆ విషయంలో వందశాతం సక్సెస్ అయ్యాడు. సినిమా మొత్తం మూడు పాత్రల చుట్టే తిప్పుతూ ఆడియన్స్ ని సీట్ల నుంచి కదలకుండా చేశాడు. సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో తెరకెక్కించి మెప్పించాడు. మమ్ముట్టి నటన.. క్రిస్టో జేవియర్ బీజియం సినిమా స్థాయిని పెంచింది.

Read more: షణ్ముఖ్ జస్వంత్ కు ఊరట.. డ్రగ్స్ కేసులో బెయిల్

కథ పరంగా చూస్తే కొత్తగా ఏమి ఉండదు. పాడుబడ్డ భవంతిలో ఓ మాంత్రికుడు.. అతని చేతిలో బందీ అయిన ఓ ఇద్దరు వ్యక్తుల కథే ఇది. పాయింట్ చిన్నదే అయిన .. దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు.. వాటిని మలిచిన తీరు అద్భుతంగా ఉంది. తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని సినిమా చివరి వరకు కొనసాగించాడు.

సినిమాలో హార్రర్ ఎలిమెంట్స్ ఉన్నా అంతగా భయపెట్టవు. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తోనే కథనాన్ని ఆశక్తికరంగా సాగించాడు. సినిమా ప్రారంభం నెమ్మదిగా ఉంటుంది. పాత్రల పరిచయం వరకు కథ స్లోగా సాగుతుంది. పాడుబడ్డ భవన్ లోకి దేవన్ అడుగు పెట్డడం అక్కడ జరిగే కొన్ని సన్నివేశాలు ఉత్కంఠకు గురి చేస్తాయి.

ఫస్టాఫ్ కొంచెం నెమ్మదిగా సాగిన .. కొన్ని సీన్స్ మాత్రం థ్రిల్లింగా అనిపిస్తాయి. విరామానాకి ముందు అసలు ట్విస్ట్ బయటకొస్తుంది. అప్పుడే కొడుమన్ లోని మరో రూపం ప్రేక్షకులకు పరిచయం అవుతుంది. దాన్ని చూపించిన తీరు ఆసక్తిరేకెత్తిస్తుంది.

అలాగే అది ద్వితియార్ధంపై అంచనాలు పెంచేలా చేస్తుంది. కొడుమన్ పొట్టి నేపథ్యం.. ఈ క్రమంలో వచ్చే చుడలన్ పొట్టి.. చేతన్ ల కథ.. అన్నీ ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక క్లైమాక్స్ అయితే అదిరిపోతుంది. సినిమా మొత్తం కాస్త నెమ్మదిగా సాగినా .. భ్రమయుగం ఓ థ్రిల్లర్ మూవీ.

ఎవరెలా చేసారంటే..
ఈ మూవీ కి ప్రధాన ఆకర్షణ మమ్ముట్టి నటనే. కొడుమన్ పాత్రలో ఆయన తీరు ఆహార్యం.. పలికించిన హావాభావాలు.. నటన అన్ని ప్రేక్షకులను మురిపిస్తాయి. దేనన్ పాత్రకు అర్జున్ అశోకన్ పూర్తి న్యాయం చేశాడు. సెకెండాఫ్ లో అయితే మమ్ముట్టితో పోటీపడి నటించాడు.

వంట మనిషిగా సిద్ధార్ధ్ భరత్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యక్షి పాత్ర ఆసక్తి రేకేత్తించిన .. ఆపాత్ర ప్రాధాన్యత ఏంటో తెరపై సరిగ్గా చూపించలేక పోయారు. టెక్నికల్ పరంగా సినిమా అదిరిపోయింది. అందులోని పాత్రలు అన్నీ ప్రేక్షకుల్ని ఓ ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.

ఓ కొత్త అనుభూతిని అందిస్తాయి. ఇక క్రిస్టో స్వరపరిచిన ప్రతి పాట.. కథలో భాగంగా చాలా అర్ధవంతంగా ఉంటాయి. నేపథ్య సంగీతం ప్రేక్షకుల్ని లీనం చేసేలే చేస్తుంది. సినిమా మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో సాగినా.. తెరపై ప్రతి సీన్ చాలా అందంగా కనిపించేలా చేసాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.

Tags

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×