EPAPER

Boycott Pushpa 2 : ‘పుష్ప’రాజ్ పై కన్నడిగులు ఆగ్రహం.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్.. ఏమైందంటే..?

Boycott Pushpa 2 : ‘పుష్ప’రాజ్ పై కన్నడిగులు ఆగ్రహం.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్.. ఏమైందంటే..?

Boycott Pushpa 2: సాధారణంగా కొన్ని భాషా ఇండస్ట్రీలలో ఆడియన్స్ ఎలా ఉంటారంటే.. చిన్నా చితకా విషయాలకే బాయ్ కాట్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా తమ సినిమాలు ఇంకొక భాష ఇండస్ట్రీలో విడుదల కాకపోయినా… ఏదైనా కారణాల వల్ల అడ్డుపడినా సరే ఆ ఇండస్ట్రీల సినిమాలను తమ ఇండస్ట్రీలో విడుదల చేయడాన్ని అడ్డుపడుతూ ఉంటారు. సరిగ్గా ఇప్పుడు పుష్ప 2 (Pushpa 2) సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. కన్నడ సినీ పరిశ్రమలో ఈ సినిమాను బాయికాట్ చేయాలి అంటూ అక్కడి ఆడియన్స్ కామెంట్లు చేయడం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది.


కన్నడలో పుష్ప -2 బాయ్ కాట్ అంటూ ట్రెండింగ్..

అసలు విషయంలోకెళితే.. గత కొన్ని రోజుల క్రితం దీపావళి సందర్భంగా కన్నడ మూవీ బఘీర (Bagheera )తెలుగులో కూడా విడుదలయ్యింది. అయితే ఈ సినిమాకి తెలుగులో తక్కువ థియేటర్స్ ఇచ్చారని,ఇప్పుడు ఆ సంఖ్యను మరింత తగ్గించారని కన్నడిగులు ఫీల్ అవుతున్నారు. అంతేకాదు ఈ కన్నడ సినిమాపై తెలుగు వాళ్ళు ట్రోల్స్ ఎక్కువ చేశారనేది వారి వాదన. అందుకే కన్నడ ఆడియన్స్ హార్ట్ అయ్యారు. అందుకే డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘ పుష్ప-2 ‘ సినిమాను కన్నడ ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.


బఘీర సినిమాకి అందుకే థియేటర్లు తగ్గింపు..

ఇకపోతే తెలుగులో బఘీర సినిమాకి తక్కువ థియేటర్ లు ఇవ్వడానికి కూడా కారణం ఉంది. అదేమిటంటే దీపావళి సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అమరన్ (Amaran), లక్కీ భాస్కర్(Lucky bhaskar), క (Ka) సినిమాలతో పాటు ఈ బఘీర సినిమా విడుదలయ్యింది. తమిళ సినిమా అమరన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఈ సినిమాకి తెలుగులో మంచి థియేటర్స్ లభించాయి. దీనికి తోడు లక్కీ భాస్కర్ చిత్రాలకి కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాండ్ రావడంతో ఇక్కడ ఈ సినిమాలకు థియేటర్లు ఎక్కువ కేటాయించడం జరిగింది. అయితే బఘీర సినిమా మొదటి నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఈ సినిమాకి థియేటర్లు చాలా తక్కువ కేటాయించారు. దీనికి తోడు మిగతా చిత్రాలకు ఆడియన్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో థియేటర్లు తక్కువ వస్తున్న కారణంగా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న బఘీర సినిమాకు తగ్గించి ఈ సినిమాలకు థియేటర్లు కేటాయించడం జరిగింది. ఇది ఇక్కడే కాదు ఎక్కడైనా జరిగే పరిస్థితి . ఒక సినిమా బాగా ఆడుతోంది అంటే ఆ సినిమాను ఇంకో థియేటర్లో ప్రదర్శించడానికి కూడా థియేటర్ యజమానులు వెనకాడరు. అలాంటిది బఘీర సినిమా అట్టర్ ప్లాప్ అయితే దానికి ఇంకా కొన్ని థియేటర్లు పెంచి ఆదాయాన్ని కోల్పోవడం ఇష్టం లేకే థియేటర్లు తగ్గించారు అనే ఒక వార్త బలంగా వినిపిస్తోంది.

కన్నడ ఆడియన్స్ కు అర్థం కాదా .

మరి కన్నడిగులకు ఈ విషయం అర్థం కాలేదో.. లేక కావాలనే తెలుగు సినిమాను బాయ్ కాట్ చేయాలని కామెంట్ చేస్తున్నారో తెలియదు కానీ మొత్తానికైతే పుష్ప రాజ్ పై ఆగ్రహం చూపిస్తూ ఉండడం బన్నీ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.మరి ఈ విషయంపై కన్నీడిగులు ఇటు తెలుగు వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Related News

Unstoppable with NBK : అన్ స్టాపబుల్ ఈ సారి ప్లాప్ ?… ఏ మాత్రం లేని ఆదరణ..

Jai Hanuman: రానా రాముడిగా మారితే జరిగేది ఇదే… ప్రశాంత్ వర్మ ప్లాన్ బెడిసికొట్టనుందా?

Salman Khan Receives another Threat : భిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరోసారి బెదరింపులు… ఈ సారి రెండు ఆఫర్స్..!

Game Changer Movie Teaser: మెగా ఫ్యాన్స్ సిద్ధం కండమ్మా.. టీజర్ లాంచ్ కి సర్వం సిద్ధం..!

Chandini Chowdary : తీవ్ర గాయం… సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన హీరోయిన్… మరి బాలయ్యతో సినిమా?

Director Krish Second Marriage: రెండో పెళ్లికి సిద్ధమైన డైరెక్టర్ క్రిష్.. వధువు ఎవరంటే..?

War 2 : ‘వార్ 2 ‘ లో ఎన్టీఆర్ చనిపోతాడా? స్టోరీలో ఇన్ని ట్విస్ట్ లా…!

Big Stories

×