EPAPER

Kumar Sahani: బాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి..

Kumar Sahani: బాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి..


Kumar Sahani: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, సినిమా స్క్రీన్ ప్లే రచయిత కుమార్ షహాని తాజాగా తుదిశ్వాస విడిచారు. కోల్‌కతాలోని తన నివాసంలో కుమార్ షహాని మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. 83 ఏళ్ల వయసులో కుమార్ షహాని ప్రపంచానికి వీడ్కోలు పలికారు.

దర్శకుడి మరణవార్తతో సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుమార్ షహాని మాయ దర్పణ్, తరంగ్, ఖ్యాల్ గాథ, కస్బా వంటి అనేక బడా చిత్రాలను నిర్మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.


దర్శకుడిగానే కాకుండా రచయిత, అలాగే ఉపాధ్యాయుడిగా కూడా ప్రశంసలు అందుకున్నారు. అలాంటి ఈ దర్శకుడు హఠాన్మరణం చెందారనే వార్తతో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. కుమార్ షహాని డిసెంబర్ 7, 1940న పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని లర్కానాలో జన్మించారు.

READ MORE: డ్రగ్స్ కేసులో సంచలనం.. గంజాయి తీసుకున్నట్లు ఒప్పుకున్న షణ్ముఖ్

అతను పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో చదువుకున్నారు. తరువాత ఫ్రాన్స్‌కు వెళ్లారు. అక్కడ ఫిల్మ్ మేకర్ రాబర్ట్ బ్రెస్సన్‌కి ‘ఉనే డామ్ డౌస్’ మూవీ తెరకెక్కించడంలో సహాయం చేశారు.

అలాగే కుమార్ షహాని నిర్మల్ వర్మ కథ ఆధారంగా ‘మాయ దర్పణ్’(1972) సినిమా తీసి ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రం ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో జాతీయ చలనచిత్ర అవార్డును సొంతం చేసుకుంది. ఇది కాకుండా.. అతను తరంగ్, ఖాయల్ గాథ, కస్బా, చార్ అధ్యాయ్ వంటి అనేక చిత్రాలను రూపొందించాడు. ఈ చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయి.

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×