EPAPER
Kirrak Couples Episode 1

Devara Ban : ‘దేవర’ సునామీకి ఎదురుదెబ్బ… మూవీని బ్యాన్ చేయాల్సిందేనా…?

Devara Ban : ‘దేవర’ సునామీకి ఎదురుదెబ్బ… మూవీని బ్యాన్ చేయాల్సిందేనా…?

Devara Ban : ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ దేవర మేనియా కొనసాగుతుంది. ఈ సినిమా నిన్న భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది. త్రిపుల్ ఆర్ తర్వాత ఆరేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా రావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందులోనూ కొరటాలా శివ ఆచార్య ఫ్లాప్ తర్వాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ముందుగా అనుకున్న విధంగానే ఈ మూవీ థియేటర్లలోకి వచ్చి భారీ ప్రభంజనాన్ని సృష్టించింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ సినిమా బాగా నచ్చేసిందని అర్థమవుతుంది. కానీ కొందరికి సినిమా నచ్చలేదని వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాను బ్యాన్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని టాక్. ఇందులో నిజమేంత ఉందో తెలియదు కానీ నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది.


‘దేవర’ మూవీని బ్యాన్ చేయనున్న బీజేపీ ప్రభుత్వం ?

ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన భారీ బడ్జెట్ మూవీ దేవర.. నిన్న రిలీజై పాజిటివ్ టాక్ ను అందుకుంది. ప్రేక్షకులను అలరించిందని పబ్లిక్ టాక్ వింటే అర్థమవుతుంది. కానీ నార్త్ లో ఈ సినిమాను బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు, ఆ దిశగా రాజకీయ వేత్తలు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అందుకు కారణాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. దేవర సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలైంది . ఈ సినిమాను నార్త్ లో కూడా రిలీజ్ చేశారు. అక్కడ ప్రమోషన్స్ తెలుగు కన్నా ఎక్కువగానే చేశారు. ఓసారి ముంబైలో ప్రమోషన్స్ చేశారు దేవర టీమ్. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రాజకీయాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. సైఫ్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ గురించి ప్రశంసలు కురిపించారు.


తన అభిమాన నాయకుడు అని ఆయన పై తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ మాటలు బీజేపి ప్రభుత్వానికి నచ్చలేదని తెలుస్తుంది. అతని మాటలు రాజకీయాల్లో దుమారం రేపాయి. నిజానికి ఉత్తర భారతదేశంలో బీజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది. అతని మాటలు వారిని నొప్పించాయని అందుకే సినిమాను బ్యాన్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతేకాదు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సినిమాను బ్యాన్ చెయ్యాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరి దేవర టీమ్ దీనిపై స్పందించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇకపోతే గతంలో కంగనా రానౌత్ కూడా సినిమా ప్రమోషన్స్ టైంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నారు. మరి ఈ వివాదం ఎంతవరకు వెళుతుందో తెలియదు కానీ. ఈ వార్త నిజమైతే మాత్రం దేవరకు నష్టం కలిగే పరిస్థితి కనిపిస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 172 కోట్లు రాబట్టిందని దేవర టీమ్ ప్రకటించారు. ఈ వీకెండ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది . సినిమాకు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Related News

Nandamuri Balakrishna: నందమూరి వారసులు వారే.. తేల్చి చెప్పిన బాలయ్య

Balakrishna: అందరికీ లిమిట్స్ ఉంటాయి.. ఐఫా వేడుకల్లో మీడియాపై బాలకృష్ణ ఫైర్

Ajith : సినిమాలకు అజిత్ గుడ్ బై..? ఆ ఒక్కటే కారణమా?

Devara 2: తారక్ ఫ్యాన్స్‌కి దీనికంటే గుడ్ న్యూస్ ఉండదు.. పార్ట్ 2కి కొరటాల ప్లాన్ ఇదే.!

Devara: దేవర.. ఆ సెంటిమెంట్ కలిసొస్తే.. రికార్డులు బ్రేకే..?

Tollywood: ముదురుతున్న లడ్డూ వివాదం.. సెలబ్రిటీలకు సంకటంగా మారిందా..?

Big Stories

×