EPAPER

Syed Sohel: అంద‌రూ నెగిటివ్‌నే కోరుకుంటున్నారు – హీరో సోహైల్‌

Syed Sohel: అంద‌రూ నెగిటివ్‌నే కోరుకుంటున్నారు – హీరో సోహైల్‌

Syed Sohel:బిగ్ బాస్ ఫేమ్ స‌య్య‌ద్ సోహైల్‌, మోక్ష హీరో హీరోయిన్లుగా న‌టించి చిత్రం ‘లక్కీ లక్ష్మ‌ణ్’. ద‌త్తాత్రేయ మీడియా గ్యారంటీడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ బ్యాన‌ర్‌పై ఎ.ఆర్‌.అభి దర్శ‌క‌త్వంలో హ‌రిత గోగినేని ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 30న సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్బంగా హీరో సోహైల్ మీడియాతో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించారు. ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు.


  • నెగ‌టివ్‌గా తీసుకుంటున్నారు..
  • ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడితే కొంత మంది నెగటివ్‌గా తీసుకుంటున్నారు. 100 మందిలో 20 మంది నెగిటివ్‌గా తీసుకుంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ ముందు కామెంట్స్ చూసుకుని డిలీట్ చేస్తున్నాను. ఆ స‌మ‌యంలో కొంత మంది నా ఇంట్లో వాళ్ల‌ని టార్గెట్ చేస్తున్న‌ట్లు మెసేజెస్ పెడుతున్నారు. మేము కూడా మ‌నుషుల‌మే మాకు కూడా ఎమోష‌న్స్ ఉంటాయి. నేను నా కోపాన్ని బ‌య‌ట‌కు చూపించేస్తుంటాను. ఇంట్లోని వాళ్ల‌ని కామెంట్ చేసే కామ‌న్ పీపుల్ ఎవ‌రైనా స‌రే! ఇచ్చిప‌డేసుడే. అదే విష‌యాన్ని నేను ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేశాను. కానీ దాన్ని కొంద‌రు మ‌రోలా తీసుకున్నారు. కోట్ల రూపాయ‌లు పెట్టి సినిమా తీసిన‌ప్పుడు కింద కామెంట్స్ పాజిటివ్‌గా వ‌స్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. కావాల‌నే నెగిటివ్ కామెంట్ పెడితే బాగోదు.
  • ఇంట్లో వాళ్ల‌ని తిడితే ఊరుకోవాలా..
  • సోష‌ల్ మీడియాలో నెగిటివిటీ ఎందుకు ఉంటుందో అర్థం కావ‌టం లేదు. ఉదాహ‌ర‌ణ‌కు ఇండియా గ్లిజ్డ్స్ వెబ్ సైట్‌లో నా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటల్లో నా స‌క్సెస్‌కు మా నాన్నే కార‌ణం అని పెడితే దానికి 500 వ్యూస్ మాత్ర‌మే వ‌చ్చాయి. అదే ఇచ్చిప‌డేస్తా కొడ‌క‌ల్లారా అని అన్న మాట‌ల‌కు ల‌క్షా ఇర‌వై వేలు వ్యూస్ 700 కామెంట్స్‌, షేర్స్ వ‌చ్చాయి. చిరంజీవిగారి వాల్తేరు వీర‌య్య వీడియోల‌కు 10..20..40 వేలు వ్యూస్ ఉన్నాయి. దీనికి మాత్రం ల‌క్షా ఇర‌వై వేలున్నాయి. అస‌లు నెగిటివ్ చూడాల‌ని ఎంతగా చూస్తున్నారో అర్థం కావ‌టం లేదు. మ‌న ఇంట్లోని వాళ్ల‌ను ఎవ‌రైనా తిడితే మ‌నం ఎలా రియాక్ట్ అవుతామో అలా రియాక్ట్ అయ్యాను.. అలా అవ‌టం నాకు ప్రాబ్లెమ్ అవుతుంది. ఇక కెమెరా ముందు కూడా న‌టించ‌టం ప్రాక్టీస్ చేయాలి.
  • మా నాన్నగారి సపోర్ట్ వల్లే
  • మా నాన్న‌గారు నా స‌క్సెస్‌లో ఎంతో కీ రోల్ పోషించారు. మా కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. హార్ట్ ఆప‌రేష‌న్‌.. ఒక‌టే కిడ్నీ. బ్రెయిన్‌లో బ్ల‌డ్ క్లాట్ ఇన్ని స‌మ‌స్య‌లు ఓ వైపు.. మ‌రో వైపు మేం ఐదుగురు ఫ్యామిలీ మెంబ‌ర్స్‌. అంద‌రికీ క‌ష్ట‌ప‌డి పెంచాడాయ‌న‌. మా ఇంట్లో నాకు సినిమాల్లోకి వెళ‌తానంటే ఎవ‌రూ స‌పోర్ట్ చేయ‌లేదు. నాన్న‌గారు మాత్ర‌మే స‌పోర్ట్ చేశారు. నిజానికి నాన్న‌గారి ఉద్యోగం చేయ‌టానికి రెడీ అయిపోయాను. మ‌రో రెండు రోజుల్లో సంత‌కం చేయాల్సి ఉన్న స‌మ‌యంలో నాకెందుకు క‌రెక్ట్ కాద‌నిపించి సీరియ‌ల్స్ న‌టించ‌టానికి హైద‌రాబాద్ వ‌చ్చేశాను. సీరియ‌ల్స్‌లో న‌టిస్తూ 40-50 వేలు వ‌చ్చేవి. అందులో స‌గం ఇంటికి పంపేవాడిని. అదే స‌మ‌యంలో లాక్‌డౌన్ రావ‌టంతో షూటింగ్స్ క‌ష్ట‌మ‌య్యాయి. అప్పుడు మా నాన్న‌గారు నీపై నీకు న‌మ్మ‌కం ఉందా? అనే ప్ర‌శ్న వేశారు. దానికి నేను ఉంద‌ని స‌మాధానం చెప్పారు. సరే! అయితే కంటిన్యూ చెయ్య‌మ‌ని నాన్న అన్నారు. ఏం కాదులే నేను చూసుకుంటాలే అన్నారు. ఆరోజు ఆయ‌న నన్ను టెన్ష‌న్ పెట్టుంటే నేను కూడా ఉద్యోగంలో జాయిన్ అయ్యేవాడినేమో. కానీ ఆయ‌న స‌పోర్ట్ చేశారు. ఇప్ప‌టికీ నేను టెన్ష‌న్ ప‌డుతుంటే .. ఎందుకు టెన్ష‌న్ ప‌డుతున్నావ‌ని ధైర్యం చెబుతుంటారు.


Tags

Related News

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Big Stories

×