EPAPER

Bigg Boss 8 Telugu live updates: బిగ్ బాస్ మొదలయ్యింది.. ఎవరెవరు వెళ్ళారంటే..

Bigg Boss 8 Telugu live updates: బిగ్ బాస్ మొదలయ్యింది.. ఎవరెవరు వెళ్ళారంటే..

Bigg Boss 8 Telugu live updates: ఎట్టకేలకు బిగ్ బాస్ నేటి నుంచి మొదలుకాబోతుంది. ఎప్పటినుంచో బిగ్ బాస్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అయితే ఈసారి  7 సీజన్స్ కు మించి 8 వ సీజన్ ఉండనున్నట్లు ప్రోమోలను బట్టి అర్ధమవుతుంది.


ఇక ఈసారి బిగ్ బాస్ లోకి కపుల్స్ ఎంటర్ అవుతున్నారని తెలుస్తోంది. కపుల్స్  అంటే ఒరిజినల్ కాదు.. ఒక సీనియర్.. ఒక జూనియర్. అంటే. బిగ్ బాస్ సీజన్ 8 లో ఒక కొత్త కంటెస్టెంట్ ను.. అంతకుముందు సీజన్స్ లో ఉన్న ఒక కంటెస్టెంట్ ను జోడిగా తీసుకున్నారు. వీరి మధ్య పోటీ పెట్టడం జరుగుతుంది.న ఈసారి గేమ్స్ కూడా సీనియర్స్, జూనియర్స్ మధ్య జరగనున్నాయి.

మరి ఈసారి హౌస్ లో అడుగుపెట్టిన కొత్త కంటెస్టెంట్స్ ఎవరంటే.. హీరో ఆదిత్య ఓం, నటుడు అభయ్ నవీన్, యాంకర్ విష్ణుప్రియ, సీరియల్ నటి యష్మీ గౌడ, కృష్ణ ముకుంద మురారి హీరోయిన్ ప్రేరణ కంబం, సీరియల్ హీరో నిఖిల్ మలియక్కల్ ఉన్నారు. ఇక వీరితో పాటు ఎప్పటినుంచో వినిపిస్తున్న పేర్లు కూడా ఉన్నాయి.


ఆర్జే శేఖర్ బాషా, డ్యాన్సర్ నైనిక అనరుసు, యూట్యూబర్ బెజవాడ బేబక్క, నాగ మణికంఠ, కిర్రాక్ సీత, నటి సోనియా ఆకుల, దొరసాని సీరియల్ యాక్టర్ పృథ్వీరాజ్‌ తో పాటు యాక్టర్, డైరెక్టర్ నబీల్ అఫ్రిది ఉన్నాడు. ఇక ఈసారి బిగ్ బాస్ చాలా రసవత్తరంగా సాగనుందని తెలుస్తోంది. మరి వీరిలో ఉండేది ఎవరు.. వెళ్ళేది ఎవరో చూడాలంటే ఆట చూడాల్సిందే.

యష్మీ (Yashmi)- నిఖిల్(Nikhil):

‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఫస్ట్ కంటెస్ట్‌గా సీరియల్ నటి యష్మి ఎంట్రీ ఇచ్చింది. ఆమె బిర్యానీ ఇష్టమని చెప్పడంతో.. నాగ్ కొన్ని రకాల బిర్యానీలను కళ్లు మూసుకుని రుచి చూసి కనిపెట్టాలని చెప్పారు. అయితే, ఆమె కరెక్టుగా చెప్పలేదు. ఫస్ట్ కంటెస్ట్‌గా ఆమె వచ్చినా.. హౌస్‌లోకి పంపలేదు. ఈ సారి కంటెస్టెంట్స్ తమ బెస్ట్ బడ్డీతో కలిసి హౌస్‌లోకి అడుగుపెట్టాలని చెప్పారు. అంటే.. అంతా జంటగా హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారన్నమాట. ఇక యష్మితో పాటు నిఖిల్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. వీరిద్దరూ జంటగా హౌస్ లోకి అడుగుపెట్టారు. నిఖిల్ గురించి  సోషల్ మీడియాలో మంచి ఫార్మ్ లో ఉన్నాడు.

అభయ్ నవీన్(Abhinav Naveen)-ప్రేరణ(Prerana):

పెళ్లి చూపులు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన నటుడు విష్ణు. విజయ్ దేవరకొండ, ప్రియదర్శి పక్కన ఫ్రెండ్ గా నటించి మెప్పించాడు. అందులో నేమ్ తోనే ఫేమస్ అయ్యాడు. అతని అసలు పేరు అభయ్ నవీన్. ఎన్నో స్టార్ హీరో సినిమాల్లో నటించిన అభయ్.. మూడో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టాడు. తనకు డైరెక్టర్ అవ్వాలని కోరిక ఉన్నట్లు తెలిపాడు. తండ్రి లేకపోయినా తాను ఎంతోకష్టపడి పైకి వచ్చినట్లు తెలిపాడు. బిగ్ బాస్ కు ఎందుకు వచ్చానంటే.. అది బతకడం నేర్పించింది అని చెప్పుకొచ్చాడు.  ఇక అభయ్ సెలెక్ట్ చేసుకున్న బడ్డీ ఎవరు అంటే.. కృష్ణ ముకుంద మురారి సీరియల్ తో బుల్లితెరపై కు పరిచయమైన ప్రేరణ. ఈ మధ్యనే పెళ్లి అయిన ఈ చిన్నది అభయ్ తో కలిసి హౌస్ లోకి అడుగుపెట్టింది.

ఆదిత్య ఓమ్(Aditya om)- సోనియా(Sonia): 

లాహిరిలాహిరి లాహిరిలో సినిమా గుర్తుందా.. అందులో అంకితకు బాయ్ ఫ్రెండ్ గా నటించాడు ఆదిత్య ఓం. ఈ సినిమా అతనికి ఒక మైలురాయిగా మారింది. ఈ సినిమా తరువాత నటుడిగా,  డైరెక్టర్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు. మధ్యలో ఆర్థిక ఇబ్బందులు వలన సినిమాలకు గ్యాప్ ఇచ్చాడు. ఇక అయినా అప్పుడప్పుడు సినిమాల్లో కనిపిస్తూ వస్తున్న ఆదిత్య.. తన కెరీర్ లో రీ బర్త్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఇక ఆదిత్య కూడా ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకోవడంతో… తెగింపు ఉన్న సోనియా వచ్చింది. ఈ చిన్నదాని గురుంచి చెప్పాలంటే.. జార్జ్ రెడ్డి అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక వర్మ స్కూల్ నుంచి వచ్చిన సోనియా.. ఆదిత్యతో హౌస్ లోకి అడుగుపెట్టింది.

బేబక్క(Madhu Nekkanti)- ఆర్జే శేఖర్ భాషా(Rj Sekher Basha):

సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెర్ గా బెజవాడ బేబక్క పేరుతో మంచి మంచి కామెడీ వీడియోలతో ప్రేక్షకులను అలరించిన ఆమె.. 7 వ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అమెరికా వెళ్లి అక్కడ వీడియోలు చేయడం,  సీరియస్  విషయాలను వెటకారంగా మాట్లాడుతూ నవ్వించే ఆమె.. ఇప్పుడు స్టేజిమీదకు వచ్చేసింది. ఆమె అసలు పేరు మధు నెక్కంటి. ఇక మధు రెడ్ కలర్ ను సెలెక్ట్ చేసుకోవడంతో హ్యూమరస్, వైరల్ అయినా ఆర్జే శేఖర్ భాషా ఎంటర్ అయ్యాడు. ఈ మధ్యనే రాజ్ తరుణ్ వివాదంలో మధ్యవర్తిగా ఇరుక్కొని.. లావణ్యతో చెప్పు దెబ్బ తిన్న ఆర్జే.. తన జీవితాన్ని గురించి చెప్తూ.. రాజ్ తరుణ్ వివాదాన్ని కూడా చెప్పుకొచ్చాడు. ఇక మధు- భాషా జంటగా హూస్ లోకి ఎంటర్ అయ్యారు.

కిర్రాక్ సీత(Kirrak Seetha)- నాగ మణికంఠ(Naga manikanta)

బేబీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి కిర్రాక్ సీత. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన బేబీ సినిమాలో.. వైష్ణవిని చెడగొట్టే సీత పాత్రలో నటించి మెప్పించింది. ఎన్నో సినిమాలు చేసినా.. ఆమెకు బేబీ సినిమా గుర్తింపు తీసుకొచ్చింది. ఇక తన జీవితం గురించి చెప్పుకొచ్చిన సీత.. కిర్రాక్ గా 9 వ కంటెస్టెంట్ గా బిగ్ బాస్ స్టేజి మీద అడుగుపెట్టింది. ఇక కిర్రాక్ సీతకు పెయిర్ గా మరో సీరియల్ నటుడు నాగ మణికంఠ వచ్చాడు. ఇక తన జీవితంలో బాధలను తెలుపుతూ ఎంట్రీ ఇచ్చాడు. కొన్ని సీరియల్స్ లో కీలక పాత్రల్లో నటించిన నాగ మణికంఠ.. బిగ్ బాస్ హౌస్ లోకి 10 వ  కంటెస్టెంట్ గా ఎంటర్ అయ్యాడు. అలా సీత – మణికంఠ  జంటగా హౌస్ లోకి ఎంటర్ అయ్యారు.

పృథ్వీ రాజ్( Pruthvi Raj)- విష్ణు ప్రియ(Vishnu Priya)

నాగపంచమి సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన పృథ్వీ రాజ్.. 11 వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. వైట్ సూట్ లో చాలా స్టైలిష్ లుక్ లో క్లాస్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చాడు. ఇక పృథ్వీకి జంటగా హాట్ బ్యూటీ విష్ణు ప్రియ వచ్చేసింది. నిజం చెప్పాలంటే ఈ సీజన్ కు హైలైట్ అంటే విష్ణు ప్రియనే అని చెప్పాలి. ఇక 12 వ కంటెస్టెంట్ గా విష్ణు.. మాస్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది. ఇక పృథ్వీ- విష్ణు జంటగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

నైనికా(Nainika)- నబీల్ అఫ్రిది (Nabeel Afridi)

బిగ్ బాస్ సీజన్ 8 లో 13 వ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది డ్యాన్స్ కొరియోగ్రాఫర్ నైనికా. ఢీ షో తో ఆమె తెలుగువారికి పరిచయం. ఇక తన డ్యాన్స్ మూవ్స్ తో స్టేజిని ఊపేసిన నైనికా.. డ్యాన్స్ కాకపోతే యాక్టింగ్ చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఇక హౌస్ లో చివరి కంటెస్టెంట్ గా వరంగల్ యూట్యూబర్ గా పేరు తెచ్చుకున్న నబీల్ అఫ్రిది అడుగుపెట్టాడు. వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానెల్‌లోతన మీద జోక్ లు వేసుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నాడు. తన ఛానెల్‌కు సుమారుగా 1.62 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇక అలా యూట్యూబ్ నుంచి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు.

Related News

Bigg Boss 8 Telugu: సోనియా చేతిలో నిఖిల్ కీలుబొమ్మ.. అమ్మాయిలాగా ఏడుస్తున్నావంటూ మణికంఠపై పర్సనల్ అటాక్, ప్రేరణకు అన్యాయం

Bigg Boss Sonia : సోనియా లవర్ గురించి బయట పడ్డ నిజం.. ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా?

Bigg Boss 8 Telugu Promo: మనిషి పుట్టుక పుట్టారా లేదా.. వారిపై అభయ్ సీరియస్, హౌస్‌మేట్స్ మధ్య మరోసారి గుడ్ల లొల్లి

Bigg Boss 8 Telugu: సిగ్గు.. సిగ్గు.. ఆ ముద్దులేంటీ? ఆ హగ్గులేంటీ? బిగ్ బాస్.. ఫ్యామిలీస్ చూస్తున్నారు

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Bigg Boss 8 Telugu: విష్ణుప్రియాతో ప్రేరణ ‘దోశ’ గొడవ.. మణికంఠ తలకు గాయం

Bigg Boss8 Day 17 Promo: కొట్టుకు చస్తున్న కంటెస్టెంట్స్.. ఇదెక్కడి గేమ్ రా బాబూ..!

Big Stories

×