EPAPER

Gangavva : పల్లె నుంచి దుబాయ్ దాకా.. తన స్టైల్ లో ఆగమాగం చేస్తున్న గంగవ్వ..

Gangavva : పల్లె నుంచి దుబాయ్ దాకా.. తన స్టైల్ లో ఆగమాగం చేస్తున్న గంగవ్వ..

Gangavva : ఒకప్పుడు ఎవరి లైఫ్ లో ఏం జరుగుతుంది అన్న విషయం.. వాళ్లు చెబితే తప్ప తెలిసేది కాదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఏం జరిగినా అందరికీ క్షణాల్లో తెలిసిపోతుంది. అంతేకాకుండా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎంతోమంది మామూలు వ్యక్తులు కూడా సెలబ్రిటీలుగా మారుతున్నారు. టాలెంట్ ఉంటే చాలు ఏ వయసులో అయినా గుర్తింపు తెచ్చుకోవడం ఏమంత కష్టం కాదు అని నిరూపించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు.


నెటిజన్లు కూడా ప్రతిభ ఉన్నవాళ్లను ఎంతగానో ఆదరిస్తున్నారు. అందుకే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ని ఉపయోగించుకొని ప్రతి ఒక్కరూ తమలో దాగి ఉన్న ప్రతిభకు పదును పెట్టడమే కాకుండా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంటున్నారు. యూట్యూబ్ ,ఇన్ స్టా గ్రామ్, ఫేస్ బుక్, ట్విట్టర్.. ఇలా అనేక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ఎంతోమంది కంటెంట్ క్రియేటర్స్ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీగా మారిన వ్యక్తులలో గంగవ్వ ఒకరు. ఈమె కేవలం జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందింది.

స్వచ్ఛమైన తెలంగాణ యాస.. తెలుగుతనం ఉట్టిపడే కట్టుబొట్టు.. ఆప్యాయంగా పలకరించే తీరు.. గంగవ్వ ను సోషల్ మీడియాలో బాగా పాపులర్ చేశాయి. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి మై విలేజ్ షో అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆమె అందరికీ దగ్గరయింది. ఇక ఆ తర్వాత క్రమంగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సినీ తారల ఇంటర్వ్యూలు కూడా చేస్తూ సెలబ్రిటీల దగ్గర కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 60 ఏళ్ల వయసులో సోషల్ మీడియా స్టార్ గా ఎదిగి వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే తప్ప ఎదుగుదలకి అడ్డు కాదు అని నిరూపించింది.


అమాయకంగా ,ఎటువంటి కల్మషం లేకుండా ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడి అందరిని ఆకట్టుకుంది గంగవ్వ . ఇక ఆ తర్వాత బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా ఎంటర్ అయ్యి మరింత గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు మన గంగవ్వ దుబాయ్ లో సందడి చేస్తోంది. తన కుటుంబ సభ్యులు ,టీమ్ మెంబర్స్ తో కలిసి దుబాయ్ లో ఎంజాయ్ చేస్తూ గంగవ్వ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం గా పేరు పొందిన బుర్జ్ ఖలీఫా భవనంపై చేయి వేసి నిలబడినట్టు తమాషాగా ఫోటో దిగి గంగవ్వ తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పాటు నెటిజన్లు ఆమె పోస్ట్ పై భారీగా కామెంట్లు పెట్టి స్పందిస్తున్నారు. మారుమూల పల్లెటూరిలో లంబాడి పిల్లగా ఉన్న గంగవ్వ ఎక్కడ.. దుబాయ్ ఎక్కడ.. అని ఆశ్చర్యపోతున్నారు. మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు అని నిరూపించిన గంగవ్వకు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. మరికొంతమంది ఎక్కడికి వెళ్ళినా మన సంస్కృతిని వదలకుండా , సంప్రదాయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే నీకు దండాలు తల్లి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×