E-Paper
Advertisement

Bhumi Pednekar: మ‌హేష్ సినిమాలో బాలీవుడ్ గ్లామ‌ర్ డాల్‌

Bhumi Pednekar: మ‌హేష్ సినిమాలో బాలీవుడ్ గ్లామ‌ర్ డాల్‌
Advertisement

Bhumi Pednekar:ఇంత‌కు ముందు చేసిన రెండు సినిమాలు పెద్ద‌గా రాణించ‌లేదు క‌దా! ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నారు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్‌. వీరిద్ద‌రి కల‌యిక‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. SSMB 28గా రూపొందుతోన్న తాజా షెడ్యూల్ హైద‌రాబాద్ శివారు ప్రాంతంలో వేసిన భారీ సెట్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు SSMB 28లో ముచ్చ‌ట‌గా మూడో హీరోయిన్ కూడా జాయిన్ కానుంది.

త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టీన‌టులు స్టార్సే క‌నిపిస్తారు. ఆ కోవ‌లో SSMB 28 కోసం ఏకంగా బాలీవుడ్ గ్లామ‌ర్ డాల్‌ను న‌టింప చేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట మ‌హేష్ బాబు. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు.. భూమి పెడ్నేక‌ర్‌. ల‌స్ట్ స్టోరీస్ స‌హా ఎన్నో వైవిధ్య‌మైన సినిమాల్లో న‌టించి మెప్పించిన భూమి పెడ్నేక‌ర్‌ నటిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటి వరకు ఆమె సౌత్ సినిమాల్లో నటించలేదు. అయితే SSMB 28తో తొలిసారి టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌నుంది. మ‌రి ఆమె పాత్ర‌కు త్రివిక్ర‌మ్ ఎలాంటి ప్రాధాన్య‌త ఇస్తారోన‌నేది సినిమా రిలీజ్ అయితే కానీ చెప్ప‌లేం.

Advertisement

ఇప్ప‌టికే ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. వీరితో పాటు ఇప్పుడు భూమి పెడ్నేక‌ర్ కూడా జాయిన్ అయితే మ‌రింత క‌ల‌ర్‌ఫుల్‌గా సినిమా ఉంటుంద‌న‌టంలో సందేహ‌మే అక్క‌ర్లేదు. భారీ అంచ‌నాలతో SSMB 28 సినిమాను త్రివిక్ర‌మ్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మ‌హేష్ సిక్స్ ప్యాక్ లుక్‌తో కనిపించ‌నున్నార‌నేది ఓ టాక్‌. రీసెంట్‌గా విడుద‌లైన మ‌హేష్ లుక్స్ చూస్తుంటే అది నిజ‌మేన‌నిపిస్తుంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి SSMB 28ను ఆగ‌స్ట్ 11న రిలీజ్ చేస్తామ‌ని మేక‌ర్స్ ఇప్ప‌టికే తెలిపారు.

Astrologer Venu Swamy:తార‌క‌ర‌త్న చ‌నిపోతాడ‌ని ఆస్ట్రాల‌జ‌ర్ వేణుస్వామికి ముందే తెలుసా?

Advertisement

Prabhu: కోలీవుడ్ న‌టుడు ప్ర‌భుకి అస్వ‌స్థ‌త‌.. టెన్ష‌న్‌లో ఫ్యాన్స్‌

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×