EPAPER

Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్ డే స్పెషల్.. కెరీర్ విశేషాలివే..!

Bellamkonda Sai Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ బర్త్ డే స్పెషల్.. కెరీర్ విశేషాలివే..!

Bellamkonda Sai Sreenivas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సమంత, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే వంటి అగ్రహీరోయిన్లతో సినిమాలు చేశారు. ఈ రోజు శ్రీనివాస్ బర్త్ డే సందర్భంగా ఆయన కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు తీసిన సినిమాలు, మరికొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.


బెల్లంకొండ శ్రీనివాస్ జనవరి 3 1993న గుంటూరులో జన్మించాడు. స్కూల్, కాలేజ్ చదువులను హైదరాబాద్‌లోనే పూర్తిచేశాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత కాలిఫోర్నియాలోని లీస్టస్ బర్గ్ ఇన్స్టిట్యూట్‌లో యాక్టింగ్‌లో శిక్షణ పొంది.. తిరిగి ఇండియాకు వచ్చారు. అనంతరం తన తండ్రి నిర్మాత బెల్లంకొండ సురేష్ ఎంతో గ్రాండ్‌గా అతనిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

శ్రీనివాస్ మొదటిగా 2014లో వి.వి.వినాయక్ దర్శకత్వం వహించిన ‘అల్లుడు శీను’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యాడు. సమంత హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను స్వయంగా సురేష్ నిర్మించారు. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు బెల్లంకొండ.


ఆ తర్వాత.. 2016లో భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో ‘స్పీడున్నోడు’ సినిమా చేశారు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. మంచి అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది.

ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో.. 2017లో మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో ‘జయ జానకి నాయక’ మూవీ చేశారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే అలరించింది. ఇందులో బోయపాటి మార్క్ కనిపించింది. అలాగే బెల్లంకొండ మాస్ లుక్‌ కూడా అద్భుతంగా ఆకట్టుకున్నాయి.

2018లో సాక్ష్యం ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించగా.. పూజా హెగ్డే కథానాయిక. అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శ్రీనివాస్‌కు పెద్ద హిట్ ఇవ్వలేకపోయింది.

ఇక 2018లోనే మరో చిత్రానికి శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో ‘కవచం’ మూవీ చేశారు. ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ చిత్రం కూడా ప్రేక్షకులను నిరాశ పరిచింది.

అనంతరం.. 2019లో తేజ దర్శకత్వంలో ‘సీత’ సినిమా చేశారు. ఇందులో కాజల్ హీరోయిన్. ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో అదే ఏడాదిలో రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘రాక్షసుడు’ సినిమా చేసి మంచి హిట్ అందుకున్నాడు.

2020లో అల్లుడు అదుర్స్ సినిమా చేశారు. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించుకుంది.

ఇక తెలుగులో సినిమాలు చేస్తూ.. ఇక్కడికన్నా నార్త్ ఇండియాలో ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఇటీవల వి.వి వినాయక దర్శకత్వం వహించిన ‘ఛత్రపతి’(హిందీ) మే 12న థియేటర్లలో విడుదలై ఫ్లాప్ టాక్ మూటగట్టుకుంది. ఇలా బెల్లంకొండ శ్రీనివాస్ ఇండస్ట్రీ లైఫ్ మూడు పువ్వులు.. ఆరు కాయలుగా ఉంది. వరుస ఫ్లాప్ లతో ఉన్న ఈ యంగ్ హీరో.. భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో #BSS10 వర్కింగ్ టైటిల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా బెల్లంకొండకు.. బంగారుకొండ కావాలని అభిమానులు ఆశిస్తూ.. సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెబుతున్నారు.

ఇక ఆయన వ్యక్తిగత విషయానికొస్తే.. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఉండే ఓ యంగ్ హీరోయిన్‌ని శ్రీనివాస్ ప్రేమిస్తున్నాడని.. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులతో చెప్పి పెళ్లికి కూడా ఒప్పించాడని సమాచారం.

ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించబోతున్నారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ స్పందించే వరకూ ఆగాల్సిందే.

Related News

Tollywood Heroine: రహస్యంగా తల్లికి ఇష్టం లేని పెళ్లి.. కట్ చేస్తే..!

Madhavi Latha: నాగబాబుకి కూడా కూతురు ఉంది మర్చిపోయారా.. ట్రోలర్స్ పై గట్టి కౌంటర్..?

Jani Master : జానీ మాస్టర్ కు అన్యాయం? బన్నీ పై నెటిజన్స్ ఆగ్రహం..

Jani Master Case : అంతటికీ కారణం విశ్వక్ సేన్… జానీ రిమాండ్ తర్వాత బయటకు వచ్చిన సంచలన నిజం..

Jani Master case : జానీ పై కేసుకు ఆ సినిమానే కారణం.. ఇన్నాళ్లకు వెలుగులోకి నిజం..

Sreeleela : శ్రీలీలకు గాయం.. అసలు మ్యాటర్ వింటే షాక్ అవుతారు?

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Big Stories

×