EPAPER

Jai Balayya: గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్.. సందడే.. సందడి

Jai Balayya: గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్.. సందడే.. సందడి

NBK 50 Years Celebrations: నందమూరు బాలకృష్ణ నటుడిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సినీ ఇండస్ట్రీ, ఆయన అభిమానులు కలిసి సినీ స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ ఆడిటోరియంలో ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులు బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ సెలెబ్రేషన్స్‌కు హాజరయ్యారు. చాలా మంది జై బాలయ్య అంటూ మాట్లాడారు. అంతటా బాలకృష్ణ ముచ్చట్లే వినిపించాయి. సినీ తారల సంభాషణలు, జోకులతో వాతావరణమంతా సందడి సందడిగా మారింది.


బాలకృష్ణతో పని చేసిన దర్శకులు, సినీనటుడు, ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో ఈ ఈవెంట్‌లో స్టార్‌ల సందడి నెలకొంది. చిరంజీవి, వెంకటేశ్, శ్రీకాంత్, అల్లు అర్జున్, రాణా, గోపీచంద్, నాని, శివ రాజ్ కుమార్, ఉపేంద్రలు హాజరయ్యారు. రాఘవేంద్ర రావు, మోహన్ బాబు, విజయేంద్ర ప్రసాద్, అశ్వినీదత్, మురళీమోహన్, మంచు విష్ణఉ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, బోయపాటి శ్రీను, పి వాసు, జయసుధ కుటుంబం, విశ్వక్ సేన్, సుహాసిని, టి సుబ్బరామిరెడ్డి సహా పలువురు ప్రముఖులు వచ్చారు. బాలకృష్ణను సత్కరించారు. ఈ వేడుకకు ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరు కావాల్సింది. కానీ, భీకర వర్షంతో రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున సమీక్ష, ఇతర కార్యక్రమాల దృష్ట్యా వారు హాజరు కాలేకపోయారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ బాలకృష్ణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.


ఈ వేడుకలో బాలకృష్ణ, చిరంజీవి కలిసికట్టుగా అతిథులను పలకరించడం, సరదాగా కామెంట్ చేయడం హైలైట్‌గా నిలిచింది. ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజును చిరంజీవి ఆర్ఆర్ఆర్ అంటూ పలుకరించి నవ్వించారు. ఇక దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు.. జై బాలయ్య పాటకు స్టేజీపై స్టెప్పులు వేసి ఈవెంట్ ఎనర్జీని డబుల్ చేశారు.

Also Read: Heavy Rainfall: తెలంగాణలో వర్షాల వల్ల ఇప్పటివరకు ఎంతమంది మృతిచెందారంటే..?

దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ అంతా బాలయ్య బాబు ఫంక్షన్‌కు రావడం సంతోషంగా ఉన్నదని, వచ్చినవారందరినీ అభినందిస్తున్నట్టు పేర్కొన్నారు. 110 సినిమాలు చేయడం మామూలు విషయం కాదని, అది చాలా కష్టంతో కూడుకున్న పని అని తెలిపారు. 50 సంవత్సరాలు సినిమాల్లో ఉండటం అభినందనీయం అని బాలకృష్ణను పొగిడారు. మీకు ఓపిక, ఊపిరి ఉన్నంత వరక సినిమాలు చేయాలని కోరారు. జై బాలయ్య అనేది ఒక మంత్రం అని, అందులో ఉన్నంత ఎనర్జీ ఎక్కడా ఉండదన్నారు. అందరికీ వయసు పెరిగితే వణుకు వస్తుందని, కానీ, బాలయ్యకు పవర్ వస్తుందని డైలాగ్ వదిలారు.

బాలయ్య బాబు గురించి మాట్లాడటం అదృష్టం అనుకోవాలని, డైలాగ్స్ రాయాలంటే.. బాలయ్య గారి నుంచే పుట్టేస్తాయని, ఆయన బాడీ లాంగ్వేజ్ నుంచి వచ్చేస్తాయని తెలిపారు. ఈ రోజు జై బలాయ్య అే మాట కంటే మంచి మాట, మించిన మాట మరోటి ఉండదని బుచ్చి బాబు అన్నారు. అఖండ, వీర నరసింహారెడ్డి వంటి సినిమాలకు తనకు అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నదని, జై బాలయ్య అని అన్నారు సంగీత దర్శకుడు తమన్.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×