EPAPER

Yellamma: నాని వదులుకున్న ‘ఎల్లమ్మ’కు ఆ కుర్రహీరో గ్రీన్ సిగ్నల్..!

Yellamma: నాని వదులుకున్న ‘ఎల్లమ్మ’కు ఆ కుర్రహీరో గ్రీన్ సిగ్నల్..!

Nithiin: వేణు యెల్దండి ఎన్నో సినిమాల్లో తన కామెడీతో సినీ ప్రేక్షకుల్ని అలరించాడు. నితిన్, ఉదయ్ కిరణ్, తరుణ్ తదితర హీరోల సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ప్రముఖ బుల్లితెర కామెడీ షో జబర్దస్త్‌లో తన కామెడీతో మరింత గుర్తింపు పొందాడు. పలు స్క్రిప్టులు చేసి కడుపుబ్బా నవ్వించాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు దర్శకుడిగా దూసుకుపోతున్నాడు. గతేడాది ‘బలగం’ మూవీకి దర్శకత్వం వహించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.


ఒక చిన్న సినిమాగా వచ్చిన ‘బలగం’ ఎన్నో రికార్డులను సైతం కొల్లగొట్టింది. అదే సమయంలో ఎన్నో కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అంతేకాకుండా ఎన్నో విభేదాలున్న కుటుంబాలను సైతం కలిపిందనే చెప్పాలి. తన తొలి సినిమాతోనే వేణు ఊహించని ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కలెక్షన్ల పరంగా బలగం బాక్సాఫీసును బద్దలు కొట్టింది. అంతేకాకుండా మరెన్నో అవార్డులను కైవసం చేసుకుంది. దీంతో తొలి అడుగులోనే వేణు సక్సెస్ కావడంతో అందరి దృష్టి అతడిపై పడింది. ఈ క్రమంలో తన రెండో సినిమాకు వేణు రంగం సిద్ధం చేశాడు.

అయితే ఈ సారి చిన్న హీరోతో కాకుండా పెద్ద హీరోని హ్యాండిల్ చేసేందుకు సిద్ధమయ్యాడు. పలు హిట్లతో ఫుల్ జోష్‌లో ఉన్న నేచురల్ స్టార్ నానితో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. బలగం సూపర్ డూపర్ హిట్ కొట్టిన వేణు టాలెంట్ చూసి నాని ఫిదా అయ్యాడు. ఇందులో భాగంగానే వేణుతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ‘బలగం’ మూవీకి నిర్మాణ బాధ్యతలు వహించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. వేణు- నాని కాంబోకి కూడా నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు.


Also Read: నాని నుంచి ఆ కుర్ర హీరో చేతికి చిక్కిన ఎల్లమ్మ.. బలగం వేణుకు ఇది కూడా మంచి ఆఫరే

దీంతో ఈ మూవీ భారీ బడ్జెట్‌తో పట్టాలెక్కడానికి సిద్ధమైంది. ఈ చిత్రానికి ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే మరి ఏమైందో ఏమో కానీ.. ఉన్నట్టుండి నాని ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలిసింది. అందుకు కారణం.. వేణు చెప్పిన ఎల్లమ్మ లైన్ నచ్చింది కానీ ఫైనల్ స్టోరీ నచ్చలేదని అందువల్లనే నాని తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ లేదని అంతా అనుకున్నారు. కానీ ఈ నేపథ్యంలో ఈ చిత్రం కథ మరో హీరోకి చిక్కినట్లు తెలిసింది. క్లాసిక్ హీరో శర్వానంద్ ‘ఎల్లమ్మ’ స్టోరీకి ఫిదా అయ్యాడని వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు ఈ హీరో కూడా హ్యాండ్ ఇచ్చాడని అంటున్నారు. కారణమేంటో తెలియదు కాని సైలెంట్‌గా తప్పుకున్నాడని ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో హీరోను ఒప్పించేందుకు దర్శకుడు వేణు, నిర్మాత దిల్ రాజు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ హీరో మరెవరో కాదు నితిన్. ఇప్పుడు ఈ హీరో కూడా ఒక మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. కానీ ఏ ఒక్కటి సెట్ అవ్వడం లేదు. ఈ నేపథ్యంలోనే నితిన్ ఇప్పుడు ‘తమ్ముడు’ మూవీ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు అతడితో ‘ఎల్లమ్మ’ మూవీ చేసేందుకు వేణు, దిల్ రాజు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై నితిన్ కూడా ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. ఎక్కువ శాతం నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి ఏమవుతుందో.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×