EPAPER

Bagheera Movie Review : ‘బఘీర’ మూవీ రివ్యూ

Bagheera Movie Review : ‘బఘీర’ మూవీ రివ్యూ

చిత్రం – బఘీర
విడుదల తేదీ – 31 అక్టోబర్ 2024
నటీనటులు – శ్రీ మురళి, రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్‌తో పాటు తదితరులు
దర్శకులు – డి.ఆర్. సూరి
కథ – ప్రశాంత్ నీల్
నిర్మాత – విజయ్ కిరగందూర్
సంగీతం – బి. అజనీష్ లోక్‌నాథ్


Bagheera Movie Review and Rating – 2/5

Bagheera Movie Review : కన్నడ డబ్బింగ్ సినిమాలకి కొన్నాళ్ల నుండి ఆదరణ పెరిగింది. ‘కేజీఎఫ్’ ‘కాంతార’ వంటి సినిమాలు కన్నడ సినిమాల్లో కొత్త మార్పులు తీసుకొచ్చాయి. ఇక ఈ దీపావళికి ‘బఘీర’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కేజీఎఫ్’ ‘కాంతార’ చిత్రాలని నిర్మించిన విజయ్ కిరంగధూర్ నిర్మించిన సినిమా కావడం, ప్రశాంత్ నీల్ కథ అందించడంతో దీనిపై కొద్దిపాటి అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :


కథ:
తన తల్లి చెప్పిన సూపర్ హీరో కథలు విని తానూ సూపర్ హీరో కావాలనుకుంటారు వేదాంత్ (శ్రీమురళి). ఈ క్రమంలో పోలీస్ కి మించిన సూపర్ హీరో సమాజంలో లేడని భావించి… అతని తండ్రి (అచ్యుత్ ప్రసాద్) లానే పోలీస్ అవుతాడు.అయితే డ్యూటీ ఎక్కిన వెంటనే క్రిమినల్స్‌ను వేటాడటం మొదలుపెడతాడు. అయితే ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి రావడంతో అతని తండ్రి రూ.50 లక్షలు లంచం వేదాంత్ ను సొంత ఊరుకి ట్రాన్స్ఫర్ చేయిస్తాడు. తర్వాత ఈ విషయం తెలుసుకున్న వేదాంత్ కుంగిపోతాడు. ఆ డిప్రెషన్లో ఊళ్లో జరిగే నేరాలను పట్టించుకోవడం మానేస్తాడు. అయితే రౌడీలు మానభంగం చేసిన ఓ అమ్మాయి.. న్యాయం కోసం వస్తే అతను పట్టించుకోడు. దీంతో ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది. దీంతో వేదాంత్ పశ్చాతాపంతో రగిలిపోతాడు. అలాంటి టైంలో అతను ఓ నిర్ణయానికి వస్తాడు. పోలీస్ స్టేషన్లో లంచగొండిగా పేరుతెచ్చుకుని రాత్రి పూట ‘బఘీర’ అనే అవతారంలో నేరస్తుల్ని మర్డర్లు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి ఎదురైనా సవాళ్లు ఏంటి? క్రిమినల్ రానా( గరుడ రామ్) వల్ల వేదాంత్ కి ఎలాంటి సమస్యలు వచ్చాయి అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :
జనాలకి మంచి చేయడానికి హీరో ముసుకు వేసుకుని పోరాడటం అనే కాన్సెప్ట్ ఈనాటిది కాదు. చిరంజీవి ‘మంచి దొంగ’ సినిమా నుండి ఉంది. ఆ తర్వాత చాలా మంది హీరోలు ఇదే ఫార్ములాతో సినిమాలు చేశారు. శ్రీహరి ‘శ్రీమహాలక్ష్మీ’ కావచ్చు, విక్రమ్ ‘మల్లన్న’ కావచ్చు, హృతిక్ రోషన్ ‘క్రిష్’ కావచ్చు, శివకార్తికేయన్ ‘శక్తి'(తమిళంలో హీరో) కావచ్చు.. ఇలా చాలా సినిమాలు వచ్చాయి.మహేష్ బాబు ‘ఆగడు’ కొంచెం ఇలాగే ఉంటుంది. కానీ శ్రీను వైట్ల మార్క్ కామెడీ దానిని పొల్యూట్ చేసింది. అంతేకాదు ‘స్పైడర్’ కూడా అలాంటి కథే.

ఇదిలా ఉంటే.. ‘కెజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ పెన్ నుండి కూడా ఇలాంటి పాత ఐడియాలు రావడం.. విషాదకరం. సూరి డైరెక్షన్లో కూడా కొత్త మెరుపులు ఏమీ లేవు. ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా సాగుతుంది. హీరో ట్రాన్స్ఫర్మేషన్ కొత్తగా ఏమీ అనిపించదు. చాలా సీన్లు ‘బ్యాట్ మ్యాన్’ అంటున్నారు కానీ.. అంతకు ముందే చాలా సినిమాలు అలాంటి థీమ్ తో వచ్చాయి. సెకండాఫ్ లో హీరో, విలన్.. క్యాట్ అండ్ మౌస్ గేమ్ కాసేపు మెప్పిస్తుంది. తర్వాత నీరసం తెప్పిస్తుంది. టెక్నికల్ గా చూసుకుంటే.. హై స్టాండర్డ్స్ లో ఉన్న సినిమా ఇది. అజనీష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా పర్వాలేదు. సినిమాటోగ్రఫీ పెద్ద హైలెట్ కాలేదు. ఎందుకంటే ఎక్కువ శాతం నైట్ టైం షూట్లు చేయడం వల్ల అనుకోవచ్చు.

నటీనటుల విషయానికి.. శ్రీమురళి యాక్షన్ సీన్స్ లో అలరించాడు. అతని లుక్స్ ‘ఉగ్రం’ లో కంటే ఇందులో బెటర్ గా ఉన్నాయి. రుక్మిణి వసంత్ ఇలా కనిపించి అలా మాయమై పోయే పాత్ర వంటిదే. పాటల్లో తప్ప ఈమె పెద్దగా కనిపించదు. కానీ ఆమె లుక్స్ మాత్రం బాగున్నాయి. గరుడ రామ్ విలనిజం మెప్పిస్తుంది. రంగాయణ రఘుకు వంటి ఇతర తారాగణం ఓకే.

ప్లస్ పాయింట్స్ :

యాక్షన్ సీన్స్
ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ
స్క్రీన్ ప్లే లో కొత్తదనం లేకపోవడం
పాటలు

మొత్తంగా ‘బఘీర’ రొటీన్ రొట్టకొట్టుడు యాక్షన్ మూవీ అని చెప్పాలి. ప్రశాంత్ నీల్ కథ వీక్ గా ఉంటాయి.. ‘హోంబలే ఫిలిమ్స్’ వల్ల ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉంటాయి.

Bagheera Movie Review and Rating – 2/5

Related News

Spirit: పండగపూట ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. వాటిని మొదలెట్టేశారు

Game Changer: లుంగీకట్టిన గ్లోబల్ స్టార్.. గేమ్ ఛేంజర్ టీజర్ కు ముహూర్తం ఫిక్స్

Sara Ali Khan: బాలీవుడ్‌లో మరో లవ్ స్టోరీ.. బీజేపీ లీడర్ కొడుకుతో సారా అలీ ఖాన్ ప్రేమాయణం

Vettaiyan Movie OTT: ఓటీటీలోకి వేట్టయాన్.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే..!

Dulquer Salmaan: సూపర్ స్టార్లు మాత్రమే అలాంటి పని చేయాలి, నేను చేస్తే ఒప్పుకోరు.. దుల్కర్ ఆసక్తికర కామెంట్స్

Hero Darshan Apology: ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన దర్శన్..!

×