EPAPER

Avatar 2 Movie Review : అవతార్‌ -2 మూవీ రివ్యూ

Avatar 2 Movie Review : అవతార్‌ -2 మూవీ రివ్యూ

Avatar 2 Movie Review : చిత్రం: అవతార్‌ – ది వే ఆఫ్‌ వాటర్‌
తారాగణం: సామ్‌ వర్తింగ్టన్‌, జోయా సాల్డానా, స్టీఫెన్‌లాంగ్‌, సిగర్నీ వీవర్‌, కేట్‌ విన్‌స్లెట్, క్లిఫ్ కర్టిస్, జోయెల్ డేవిడ్ మూర్ తదితరులు సినిమాటోగ్రఫీ: రస్సెల్‌ కర్పెంటర్‌
ఎడిటింగ్‌: స్టీఫెన్‌ ఈ. రివ్కిన్‌, డేవిడ్‌ బ్రెన్నర్‌, జాన్‌ రెఫౌవా
సంగీతం: సైమన్ ఫ్రాంగ్లెన్‌
నిర్మాణ సంస్థ: లైట్‌స్ట్రోమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నిర్మాతలు: జేమ్స్‌ కామెరూన్‌, జోన్ లాండౌ
కథ, కథనం, దర్శకత్వం: జేమ్స్‌ కామెరూన్‌


13 ఏళ్ల క్రితం జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్’ విజువల్‌ వండర్‌గా భారీ విజయాన్ని అందుకుంది. దీనికి సీక్వెల్‌ ప్రకటించగానే ఈసారి కామెరూన్‌ ఎలాంటి మ్యాజిక్‌ చేస్తారా? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. తొలి భాగంలో ‘పండోరా’ అందాలను అద్బుతంగా ఆవిష్కరించిన కామెరూన్‌.. ఇప్పుడు నీటి అడుగున అందాలు, భారీ జలచరాలతో సంభ్రమాశ్చర్యాలకు గురి చేసేందుకు సన్నద్ధమయ్యారు. ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ పేరుతో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అవతార్2’ ఎలా ఉంది? విజువల్స్‌ పరంగా సినిమా ఎంతగా ఆకట్టుకుంది అనేది తెలుసుకోవాలంటే కథలోకి వెళ్దాం..

కథ :


అవతార్ -1లో భూమి నుంచి పండోరా గ్ర‌హానికి వెళ్లిన జేక్ (సామ్ వ‌ర్తింగ్‌ట‌న్‌) అక్క‌డే ఓ తెగ‌కి చెందిన నేతిరి (జో స‌ల్దానా)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. నేతిరి తండ్రి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకున్న జేక్ ఆ తెగ‌కి నాయ‌కుడ‌వుతాడు. ప‌దేళ్ల కాలంలో లోక్, నేటియం, టూక్ అనే ముగ్గురు పిల్ల‌ల్ని క‌న్న జేక్‌, నేత్రి దంపతులు… ద‌త్త పుత్రిక కిరీ, స్పైడ‌ర్ అనే మ‌రో బాలుడితో క‌లిసి జీవిస్తుంటారు.

ఇంత‌లో భూ ప్ర‌పంచం అంత‌రించిపోతుంద‌ని, ఎలాగైనా పండోరాని ఆక్ర‌మించి అక్క‌డున్న నావీ తెగ‌ని అంతం చేయాల‌ని మ‌నుషులు(స్కై పీపుల్ ) దండెత్తుతారు. జేక్ త‌న కుటుంబాన్ని ర‌క్షించుకోవ‌డం కోసం ఈసారి మెట్క‌యినా అనే దీవికి వెళ‌తాడు. సముద్రమే ప్రపంచంగా అక్కడి ప్రజలు బ‌తుకుతుంటారు. జేక్ ఫ్యామిలీ తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం కష్టమైనా అక్క‌డ జీవించ‌డం నేర్చుకుంటుంది. అయితే భూమి నుంచి వ‌చ్చిన ప్ర‌ధాన శ‌త్రువు మైల్స్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్‌).. జేక్ కుటుంబాన్ని ఎలా కనిపెట్టాడు? అత‌డి బారి నుండి జేక్ తన ఫ్యామిలీని ఎలా రక్షించు కున్నాడు అన్నది థియేటర్ లో చూడాల్సిందే…

విశ్లేషణ :

తొలి భాగం పండోరా గ్ర‌హంలోని అద్భుతమైన ప్ర‌పంచం చుట్టూ సాగుతుంది. అయితే ఈసారి క‌థ‌ని ‘ది వే ఆఫ్ వాట‌ర్’ అంటూ నీటి ప్ర‌పంచంలోకి తీసుకెళ్లాడు జేమ్స్ కామెరూన్‌. మ‌నం పుట్ట‌క‌ముందు, మ‌నం పోయాక స‌ముద్ర‌మే మ‌న నివాసం అంటూ తాత్విక‌త‌ని జోడిస్తూ మ‌రో దృశ్య‌కావ్యాన్ని తెర‌పై ఆవిష్క‌రించారు. జేక్ అత‌డి కుటుంబం మెట్క‌యినా ప్రాంతానికి వెళ్లేంత‌వ‌ర‌కు తొలి సినిమానే గుర్తుకొచ్చినా.. అక్క‌డికి చేరుకున్నాక మాత్రం పూర్తిగా ప్రేక్ష‌కుల్ని సరికొత్త నీటి ప్ర‌పంచంలో లీనం చేస్తుంది.

స‌ముద్ర గర్భంలో అంద‌మైన ప్ర‌పంచాన్ని క్రియేట్ చేశాడు. జ‌ల‌చ‌రాలు, వాటితో అనుబందాన్ని ఆవిష్క‌రించే స‌న్నివేశాలు బాగున్నాయి. తొలి భాగం సినిమాలో క‌థపై ప్రధానంగా దృష్టి పెట్టిన కామెరూన్ ఈసారి క‌థ కంటే కూడా విజువ‌ల్స్‌పైనే ఎక్కువ‌గా దృష్టిపెట్టారు. స‌ముద్ర నేప‌థ్యంలో కొత్త ప్ర‌పంచాన్ని చూపించారు.

అలాగే కుటుంబాన్ని సంర‌క్షించ‌డంలో తండ్రి పాత్ర క‌ర్త‌వ్యాన్ని, భావోద్వేగాల్ని కూడా చక్కగా ఆవిష్క‌రించారు. ఇక జేక్స్ త‌న‌యుడు భారీ తిమింగళంతో పోరాటం చేసే స‌న్నివేశం, పాయ‌కాన్ స‌ముద్ర‌జీవి జేక్స్‌కి సాయం చేయ‌డం వంటి సన్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయి. రన్ టైం ఎక్కువ ఉండడం.. అక్కడక్కడా సాగదీసినట్టు ఉండే సీన్స్ మాత్రం సినిమాకు మైనస్ అని చెప్పొచ్చు.

నటీనటుల విశ్లేషణ :

మోష‌న్ కాప్చ‌ర్ టెక్నాల‌జీతో రూపొందిన ఈ సినిమాలో సామ్ వ‌ర్తింగ్‌ట‌న్ క‌థానాయ‌కుడిగా క‌నిపిస్తాడు. తండ్రిగా, నాయ‌కుడిగా చ‌క్క‌టి భావోద్వేగాల్ని ప‌లికించాడు. స్టీఫెన్ లాంగ్ భూమి నుంచి వ‌చ్చిన శ‌త్రువుగా, పండోరా గ్ర‌హం రాక్ష‌స‌సైన్యం అధిప‌తిగా క‌నిపిస్తాడు. జో స‌ల్దానా, సిగోర్నీ వీవ‌ర్‌, జోయ‌ల్, క్లిఫ్‌తోపాటు, కేట్ విన్‌స్లెట్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో మెప్పించారు.

సాంకేతిక నిపుణుల విశ్లేషణ :

సాంకేతిక విభాగాల్లో ప్ర‌తి విభాగం అద్భుత‌మైన ప‌నితీరు క‌న‌బ‌రిచిందని చెప్పాలి. సంగీతం, ఛాయాగ్ర‌హ‌ణంతోపాటు, విజువ‌ల్ ఎఫెక్ట్స్ విభాగాలు సినిమాపై ప్ర‌త్యేక‌మైన ప్ర‌భావం చూపించాయి. ద‌ర్శ‌కుడు జేమ్స్ కామెరూన్ త‌న బృందంతో క‌లిసి తీర్చిదిద్దిన స్క్రీన్‌ప్లే, మ‌లిచిన పాత్ర‌లు ఒకెత్తయితే.. ఆయ‌న సృష్టించిన పండోరా గ్ర‌హం మ‌రో అద్భుతం. నీటి ప్ర‌పంచాన్ని ఇంత అందంగా మ‌రెవ్వ‌రూ ఆవిష్క‌రించలేరేమో అనేలా స‌న్నివేశాల్ని తీర్చిదిద్దారు. నిర్మాణ విలువలు సినిమాకు ప్రధాన బలం అని చెప్పొచ్చు

Tags

Related News

Ritika Singh: వెంకటేష్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ గా చూపిస్తే.. కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే

Devara: కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలంటే ఇదేనేమో.. ఇదెక్కడి అరాచకంరా బాబు

Mirnalini Ravi: ఎట్టకేలకు ఒక ఇంటిదైన హాట్ బ్యూటీ.. తల్లిదండ్రులతో కలిసి..

Akkineni Family: అక్కినేని ఫ్యామిలీ ఫోటోలో ఆ స్టార్ హీరోయిన్ కూతురు.. ఎందుకు ఉన్నట్టు.. ?

Niharika Konidela: ఇంట గెలవలేక రచ్చ గెలవడానికి రెడీ అయిన మెగా డాటర్

Jani Master Case : కాపాడిన కల్తీ లడ్డూ… కొరియోగ్రాఫర్ జానీ సేఫ్..

ANR Award: మెగాస్టార్ కి అవార్డ్.. ఆ రోజే ప్రధానోత్సవం అంటూ ప్రకటించిన నాగ్..!

Big Stories

×