EPAPER

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్  కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Ramnagar Bunny Movie Teaser: బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ వారసుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు చంద్రహాస్. ఇక మొదటి సినిమా ఈవెంట్ లోనే యాటిట్యూడ్ చూపించి.. యాటిట్యూడ్ స్టార్ గా మారాడు. ఇక తాజాగా  చంద్రహాస్  హీరోగా తెరకెక్కిన చిత్రం రామ్ నగర్ బన్నీ. శ్రీనివాస్ మహత్ (వెలిగొండ శ్రీనివాస్) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. రామ్ నగర్ బన్నీ అనే పాత్రలో చంద్రహాస్ కనిపించాడు. కథ ఏంటి అనేది చూపించలేదు కానీ, గల్లీ పోరడుగా రామ్ నగర్ బన్నీ .. కాలేజ్ లో ప్రేమ కథను చూపించారు.. ఇక చివర్లో పెళ్ళి గెటప్ లో కనిపించి ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్లు ట్విస్ట్ ఇచ్చారు.  ఈ టీజర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.


ఇక ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో చంద్రహాస్, హీరోయిన్ విస్మయ, రిచా జోషి, అంబికా వాణితో పాటు మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ లో  ప్రభాకర్ మాట్లాడుతూ.. ” నన్ను బుల్లితెర మీద నా సోదరీమణులు ఆదరించారు. కుటుంబ ప్రేక్షకులు చూడటం వల్లే నా సీరియల్స్ సక్సెస్ అయ్యాయి. మా అబ్బాయిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నప్పుడు నాకున్న ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకున్నాం. చంద్రహాస్ మొదటి సినిమా సకుటుంబంగా ప్రేక్షకులు చూడాలని అనుకున్నాం. అందుకే మరో రెండు సినిమాలు ఉన్నా..ఈ సినిమానే ఫస్ట్ రిలీజ్ చేస్తున్నాం.

చంద్రహాస్ మీద ట్రోలింగ్స్ వచ్చినప్పుడు మేమంతా బాధపడిన మాట వాస్తవమే. అయితే ఆ ట్రోలింగ్స్ ను చంద్రహాస్ పాజిటివ్ గా తీసుకున్నాడు. తనలో ఏవైనా లోపాలు ఉంటే సరిచేసుకుంటూ తనకు తాను ఎక్సీపిరియన్స్ చేసి ఎదుగుతున్నాడు. రీసెంట్ గా వరద బాధితుల కోసం తన వంతుగా సాయం చేశాడు. ఖమ్మం జిల్లా వెళ్లి నిత్యావసర వస్తువులు అందించాడు. రామ్ నగర్ బన్నీ లాంటి సినిమాను మాకు ఇచ్చిన డైరెక్టర్ శ్రీనివాస్ మహత్ కు థ్యాంక్స్ చెబుతున్నా. అతను మా అబ్బాయితో మరో సినిమా కూడా చేయాలని కోరుకుంటున్నా. నేను ఇండస్ట్రీలో సంపాదించిందిన డబ్బుతో రామ్ నగర్ బన్నీ చేశా. నటుడిగా నా కొడుకులోని ప్యాషన్ చూసే సినిమా నిర్మాణానికి ముందుకొచ్చా. అతను గొప్ప స్థాయికి వెళ్తాడని నమ్మకం ఉంది. రామ్ నగర్ బన్నీ సినిమా చూసి మీ ఆదరణ చూపించండి. చంద్రహాస్ ఏం చేయగలడు అనేది ఈ సినిమా చూపిస్తుంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అయితే ఎక్కడా వల్గారిటీ ఉండదు. కుటుంబ ప్రేక్షకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా సినిమా చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. అక్టోబర్ 4న థియేటర్స్ కు వెళ్లి మా మూవీ చూడండి” అని చెప్పుకొచ్చాడు.


Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

హీరో చంద్రహాస్ మాట్లాడుతూ .. ” రామ్ నగర్ బన్నీ సినిమా టీజర్ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా. నాకు ఇంత మంచి మూవీ చేసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్. నన్ను స్క్రీన్ మీద బాగా ప్రెజెంట్ చేశాడు. ఈ సినిమాకు ప్రతి ఒక్కరం టీమ్ వర్క్ చేశాం. హీరోయిన్స్ అద్భుతంగా నటించారు. నలుగురు హీరోయిన్స్ పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. నేను డ్యాన్స్ లు బాగా చేశానని అంటున్నారు. ముందుగా బాగా ప్రాక్టీస్ చేయడమే స్క్రీన్ మీద మంచి ఔట్ పుట్ తీసుకొచ్చింది. మ్యూజిక్ మా మూవీకి మరో ఆకర్షణ అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ అశ్విన్ హేమంత్ హిట్ సాంగ్స్ చేశాడు. ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ గారికి, డ్యాన్స్ మాస్టర్స్ కు, సినిమాటోగ్రాఫర్ అష్కర్ అలీకి అందరికీ థ్యాంక్స్. నాకు రామ్ చరణ్, అల్లు అర్జున్ , ఎన్టీఆర్..ఇలా హీరోలంతా ఇష్టమే. ఎన్నో గొప్ప క్వాలిటీస్ వారిలో ఉన్నాయి. వాళ్లను స్ఫూర్తిగా తీసుకుని నటిస్తా. రామ్ నగర్ బన్నీ సినిమా కంప్లీట్ ఎంటర్ టైనర్. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాను ఏ భాషలో చూసినా సబ్ టైటిల్స్ వేస్తే చాలు ఎంజాయ్ చేస్తారు” అని చెప్పుకొచ్చాడు.

దర్శకుడు శ్రీనివాస్ మహత్ మాట్లాడుతూ “ప్రభాకర్ నాకు మంచి మిత్రుడు. నా దగ్గర ఉన్న ఒక కథ గురించి తెలిసి ఆయన వింటా అన్నారు. కథ నచ్చడంతో వాళ్ల అబ్బాయి చంద్రహాస్ తో చేయాలని ముందుకొచ్చాడు. కథను అనుకున్న ప్రకారం రావాలంటే తనే ప్రొడ్యూసర్ గా ఉండాలని నిర్ణయం తీసుకుని సినిమా చేశాడు. చంద్రహాస్ దర్శకుల హీరో. సినిమాకు నాకంటే ఎక్కువ కష్టపడ్డాడు చంద్రహాస్. స్టంట్ గానీ, సీన్ గాని చెప్పేలోపే రంగంలోకి దూకేస్తాడు. అంత ఎనర్జీ ఉన్న హీరో. చంద్రహాస్ ను దగ్గరగా చూసి చెబుతున్నా అతను హీరోగా పెద్ద స్థాయికి వెళ్తాడు. ప్రభాకర్ గారు సినిమాను నేను అనుకున్న దానికంటే పెద్ద బడ్జెట్ తో నిర్మించారు. ఆయన నాతో ఒకటే చెప్పారు బాగా నవ్వుకోవాలి. ఫ్యామిలీ అంతా కలిసి చూడాలి. చంద్రహాస్ ఏదైనా పర్ ఫార్మ్ చేయగలడు అనే పేరు తీసుకొచ్చే సినిమా కావాలి అన్నారు. అలా అన్ని ఎలిమెంట్స్ తో ప్రేక్షకులందరికీ నచ్చేలా చేశాం. అక్టోబర్ 4న థియేటర్స్ లోకి వస్తున్నాం. మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం” అని ముగించాడు. మరి ఈ సినిమాతో చంద్రహాస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Game Changer: అల్లు అర్జున్ తో పోటీ.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Tollywood: జానీ మాస్టర్ కన్నా ముందు టాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా.. ?

Niharika Konidela: తమిళ తంబీల మనసు దోచేస్తున్న నిహారిక.. డ్యాన్స్, రొమాన్స్ అదరగొట్టేసిందిగా!

Naga Chaithanya – Sobhitha Dulipala : సీక్రెట్ గా మ్యారేజ్ ప్లాన్ చేస్తున్న చై – శోభిత.. ఇదేం ట్విస్ట్ బాబు..

Comedian Ali: పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆలీ..

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ వీక్‌నెస్ అదే, అక్షయ్ కుమార్‌కు అలా చెప్తేనే వింటాడు.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

Adithi Rao – Siddarth : అప్పుడే భర్తకు చుక్కలు చూపిస్తున్న అదితి.. కన్నీళ్లు పెట్టుకున్న సిద్దార్థ్..

Big Stories

×