EPAPER

Atharva Movie Review : అథ‌ర్వ అదరగొట్టాడా? .. మూవీ ఎలా ఉందంటే ..?

Atharva Movie Review : అథ‌ర్వ అదరగొట్టాడా? .. మూవీ ఎలా ఉందంటే ..?
Atharva Movie Review

Atharva Movie Review : పెద్ద సినిమాల సందడితోపాటు.. ఈరోజు థియేటర్లలో తన ప్రతాపం చూపించడానికి వచ్చిన చిత్రమే అథర్వ. పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అని కలలుగానే వ్యక్తి జీవితంలో చోటు చేసుకున్న కొన్ని అనుకోని సంఘటనలను అతను ఎలా ఎదుర్కొన్నాడు అనే ఆసక్తికరమైన అంశంతో తెరకెక్కిన మూవీ ఇది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం.


కథ:

దేవ్ అథర్వ కర్ణ (కార్తీక్ రాజు).. పోలీస్ అవ్వాలి అని కలలుకనే ఒక మామూలు కుర్రవాడు. అయితే అతనికి ఆస్తమా ఉన్న కారణంగా సెలక్షన్స్ లో ఫెయిల్ అవుతాడు. ఎలాగైనా తన కల నెరవేర్చుకోవాలి అని తాపత్రయ పడుతున్న అతనికి క్లూస్ టీం గురించి తెలుస్తుంది. వెంటనే దానికి సంబంధించిన పరీక్షలు రాసి అందులో జాయిన్ అవుతాడు. అయితే కొన్ని రోజుల పాటు అతనికి ఎలాంటి కేసులు రావు.. ఇదేంటి అబ్బా అని ఆలోచిస్తున్న సమయంలో సడన్ గా ఒక రాబరీ కేసు అతని వద్దకు వస్తుంది.


కర్ణ తన తెలివితేటలు ఉపయోగించి ఆ కేసును క్షణాల మీద సాల్వ్ చేస్తాడు. ఈ నేపథ్యంలో అతనికి ఎదురుపడిన క్రైమ్ రిపోర్టర్ నిత్య (సిమ్రన్ చౌదరి) ను చూసి అతను తన ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తాడు. కాలేజీ డేస్ లో తన జూనియర్ అయిన నిత్యను కర్ణ ఎంతగానో ఇష్టపడతాడు. కానీ చెప్పే ధైర్యం లేక కామ్ గా ఉంటాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి కలిసిన వీళ్ళ ఇద్దరి మధ్య స్నేహం మళ్లీ చిగురిస్తుంది. ఈ నేపథ్యంలో నిత్య తన ఫ్రెండ్ జోష్ని (ఐరా)ని కర్ణకు పరిచయం చేస్తుంది. 

ఒకరోజు ఆమె ఇంటికి వెళ్లిన ఇద్దరూ.. అక్కడ శవాలుగా పడి ఉన్న జోష్ని, ఆమె ప్రియుడు శివ ను చూసి షాక్ అవుతారు. ఈ మిస్టరీ హత్య కేసును కర్ణ సాల్వ్ చేయాలి అనుకుంటాడు. ఈ నేపథ్యంలో అతను ఎదుర్కొన్న పరిస్థితులు ఎటువంటివి? అసలు ఆ ఇద్దరిని ఎవరు హత్య చేశారు? తెలియాలి అంటే మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ మూవీ స్టోరీ కాస్త రొటీన్ గా అనిపించినా స్టోరీ మెయిన్ పాయింట్ మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. మూవీ కాస్త గ్రిప్ంగా ఉన్నప్పటికీ అక్కడక్కడ కాస్త బోరింగ్ అనిపిస్తోంది. వరుసగా ట్విస్టుల మీద ట్విస్టులు వస్తూనే ఉంటాయి.. ఇక వాటిని హీరో తన చాకచక్యంతో సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలా ఆసక్తిగా సాగుతున్న మూవీలో డెడ్ అండ్ ఎప్పుడు వస్తుందో అర్థం కాదు. ఇక ఎటు వెళ్లిన ఒక్క క్లూ కూడా ఉండదు. హీరో ఏం చేస్తాడు అన్న టెన్షన్ ప్రేక్షకులలో బాగా బిల్డ్ అప్ అవుతుంది. ఇలా మనం చూసే ఆ సినిమాలో ఒక రకంగా మనం లీనం అయిపోతాం అని చెప్పవచ్చు.

మొత్తానికి డైరెక్టర్ ఈ మూవీతో ప్రమాదాలు ఎలాగైనా జరగొచ్చు.. ఎప్పుడైనా జరగొచ్చు అనే కాన్సెప్ట్ ని బాగా టచ్ చేసాడు. అక్కడక్కడ చిన్నచిన్న లాజిక్కులు మిస్ అయిన మొత్తానికి సినిమా అద్భుతంగా ఉంది. స్టార్టింగ్ కాస్త డల్ గా ఉన్న మూవీ స్లోగా ఎంగేజింగ్ గా మారుతుంది. ఇక ఇంటర్వెల్ సీన్ వచ్చేసరికి సెకండ్ హాఫ్ పై విపరీతమైన యాంగ్జైటీ కలుగుతుంది. టెక్నికల్ గా కూడా ఈ మూవీ అద్భుతంగా ఉంది. యాక్టర్స్ ఎంతో నేచురల్ గా తమ పరిధికి తగినట్టు తాము బాగా నటించారు.

చివరి మాట:

ఇది ఒక మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ అనడంలో డౌటే లేదు. అక్కడక్కడ లాజిక్స్ అటు ఇటు అయినా.. కచ్చితంగా చూడదగిన సినిమా.

Related News

Fear Teaser: సస్పెన్స్ థ్రిల్లర్ గా ఫియర్ టీజర్.. అద్భుతమైన పర్ఫామెన్స్ తో హైప్ పెంచేసిన వేదిక.!

Jani Master : లీగల్ గా పోరాడుతా… ఫస్ట్ టైం రెస్పాండ్ అయిన జానీ మాస్టర్

Jani Master : ‘మాస్టర్ అమాయకుడు’ రోజురోజుకు పెరుగుతున్న మద్దతు… ఎంత మంది సపొర్ట్ చేశారంటే..?

Bhanumathi: ఉన్నతంగా బ్రతికిన భానుమతి.. చరమాంకంలో దీనస్థితికి చేరుకోవడానికి కారణం..?

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Big Stories

×