EPAPER
Kirrak Couples Episode 1

Arshad Warsi: అప్పుడలా ఇప్పుడలా.. ప్రభాస్‌ విషయంలో ప్లేట్ మార్చిన బాలీవుడ్ నటుడు

Arshad Warsi: అప్పుడలా ఇప్పుడలా.. ప్రభాస్‌ విషయంలో ప్లేట్ మార్చిన బాలీవుడ్ నటుడు

Arshad Warsi: ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌కు ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగిపోయింది. దానివల్లే ఇతర హీరోల అభిమానులతో ఫ్యాన్ వార్స్ కూడా మొదలయ్యాయి. ప్రభాస్‌ను ఎవరూ ఒక మాట అన్నా కూడా ఫ్యాన్స్ అంతా వాటిని ఖండించడంతో పాటు సోషల్ మీడియాలో రచ్చ చేయడం చాలా కామన్‌గా మారిపోయింది. అలాగే కొన్నాళ్ల క్రితం ఒక బాలీవుడ్ నటుడు కూడా ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ గురించి తక్కువ చేసి మాట్లాడగా.. తనపై విపరీతమైన ట్రోల్స్ జరిగాయి. అయినా కూడా ఆ నటుడు తన మాటలను వెనక్కి తీసుకోలేదు. ఇన్నాళ్లకు ప్రభాస్‌పై తాను చేసిన వ్యాఖ్యలపై మరోసారి స్పందించాడు ఆ నటుడు.


తను ఒక జోకర్

బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, పలు సినిమాల్లో విలన్‌గా నటించిన సీనియర్ యాక్టర్ అర్షద్ వార్సీ. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా విడుదలయిన కొత్తలో అందులో ప్రభాస్ క్యారెక్టర్ జోకర్‌లాగా ఉందని స్టేట్‌మెంట్ ఇచ్చారు అర్షద్. దీంతో ఒక్కసారిగా ఈ స్టేట్‌మెంట్ వైరల్ అయ్యింది. అంతే కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ అంతా తమ ఫేవరెట్ హీరోని జోకర్ అని ఎలా అంటాడంటూ సోషల్ మీడియాలో అర్షద్‌పై సీరియస్ అయ్యారు. దీంతో అసలు ఆ మాటల వెనుక ఉద్దేశ్యం ఏంటో చెప్పడానికి అర్షద్ వార్సీ ముందుకొచ్చారు. అసలు తాను ప్రభాస్ గురించి పర్సనల్‌గా మాట్లాడలేదని చెప్పుకొచ్చారు.


Also Read: జాన్వీ కపూర్ కు ఘోర అవమానం.. ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది?

ఆడియన్స్ ఒప్పుకోరు

‘‘ప్రతీ విషయంలో ఎవరి దృష్టికోణం వాళ్లకు ఉంటుంది. నేను కేవలం కల్కి 2898 ఏడీలో ప్రభాస్ చేసిన పాత్ర గురించి మాత్రమే మాట్లాడాను. ప్రభాస్ గురించి పర్సనల్‌గా మాట్లాడలేదు. తను చాలా మంచి యాక్టర్. ఆ విషయాన్ని తనే చాలాసార్లు నిరూపించాడు. కానీ తమ అభిమాన నటులకు మంచి పాత్రలు ఇవ్వకపోతే ఆడియన్స్ కూడా ఒప్పుకోరు’’ అన్నారు అర్షద్ వార్సీ. కానీ ఇప్పటికీ ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ప్రభాస్ పాత్ర గురించి తాను చెప్పింది కరెక్ట్ కాదని మాత్రం ఒప్పుకోలేదు. దీంతో అర్షద్ ఇప్పుడు ఇచ్చిన క్లారిటీ కూడా తన అభిమానులను అంతగా కూల్ చేయలేకపోయింది.

క్లైమాక్సే హైలెట్

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో భైరవ అనే పాత్రలో కనిపించాడు ప్రభాస్. తను ఈ సినిమా కోసం చాలాకాలం తర్వాత కామెడీ జోనర్‌లోకి ఎంటర్ అయ్యాడు. ‘కల్కి’లో పలుచోట్ల కామెడీ చేస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేశాడు. ఇందులో ఏ బాధ్యత లేకుండా సరదాగా ప్రయోగాలు చేస్తూ ఉండే పాత్ర కావడంతో ఆడియన్స్ కూడా ప్రభాస్ పాత్రను యాక్సెప్ట్ చేశారు. కానీ అర్షద్ వార్సీ మాత్రం తన పాత్రే కామెడీ అని, జోకర్ అని వ్యాఖ్యలు చేశారు. కానీ ‘కల్కి 2898 ఏడీ’ క్లైమాక్స్‌లో మాత్రం ప్రభాస్‌ను దేవుడిగా చూపించి, కర్ణుడి పాత్రలో చూపించడం వల్ల పార్ట్ 2పై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాడు నాగ్ అశ్విన్.

Related News

Kamal Haasan: ప్యాన్ ఇండియా మల్టీ స్టారర్‌కు రూట్ క్లియర్.. కమల్ హాసన్‌తో ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా

Jr NTR: పొలిటికల్ ఎంట్రీ పై తారక్ కామెంట్… మళ్లీ హీట్ పెంచాడు..

Ram Charan: మెగా కుటుంబంలో ఆనందమే ఆనందం.. మొన్న చిరు.. నేడు చెర్రీకి అరుదైన గౌరవం

Sai Dharam Tej: మహేష్ బాటలో సాయిధరమ్ తేజ్.. ఫ్యాన్స్ ప్రశంసల జల్లు..!

Janvikapoor : జాన్వీ కపూర్ కు ఘోర అవమానం.. ఇంత పెద్ద తప్పు ఎలా జరిగింది?

Balakrishna: బాబీ – బాలయ్య కాంబోలో మూవీ.. సినిమాకి అదే హైలెట్.. మాస్ జాతరే..!

Big Stories

×