EPAPER
Kirrak Couples Episode 1

AR Rahman : సంగీత సామ్రాట్ ఏఆర్ రెహమాన్ .. రెండు ఆస్కార్ లు అందుకున్న తొలి భారతీయుడు

AR Rahman : సంగీత సామ్రాట్ ఏఆర్ రెహమాన్ .. రెండు ఆస్కార్ లు అందుకున్న తొలి భారతీయుడు
AR Rahman

AR Rahman : భారతీయ సినీ సంగీతాన్ని ఉర్రూతలూగించిన సంగీత సామ్రాట్ ఏఆర్ రెహమాన్ . ట్రెడిషనల్ క్లాసిక్స్ నుంచి పాప్ వరకు అన్ని రకాల ముజిక్స్ ను మిక్స్ చేసే లివింగ్ లెజెండ్ . భారతీయ సంగీత ప్రపంచంలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్.. ఆయన పాటల్లో మనసును తాకే మధురమైన సంగీతమే కాకుండా హుషారెత్తించే ఫాస్ట్ బీట్స్ కూడా వుంటాయి. జనవరి 6 న ఈ స్వర మాంత్రికుడు పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ స్టోరీ మీకోసం..


రెహమాన్ 1967 జనవరి 6 న ఆర్.కె .శేఖర్, కస్తూరి దంపతులకు జన్మించాడు. రెహమాన్ మొదటి పేరు దిలీప్ కుమార్. 1989 లో ఫ్యామిలీ తో పాటు ఇస్లాం స్వీకరించాడు రెహమాన్. చెల్లిలి ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకున్నాడు . అతని కోరిక నెరవేరడంతో ఇస్లాం పై విశ్వాసం పెరిగింది. కుటుంబంలోని అందరి పేర్లు మారిపోయాయి . దిలీప్ కుమార్ అల్లారఖా రెహమాన్ గా మారిపోయాడు .

నాలుగేళ్ళ వయసు నుంచే తండ్రి దగ్గర పియానో నేర్చుకున్నాడు . రెహ్మాన్ తండ్రి ఆర్ .కె .శేఖర్ కూడా మ్యూజిక్ కంపోజరే. తమిళ్, మలయాళీ చిత్రాలకు కంపోజ్ చేసేవాడు. అతనితో పాటు రెహమాన్ కూడా రికార్డింగ్స్ కు వెళ్ళేవాడు. కీబోర్డ్ ప్లే చేయడం అప్పుడే నేర్చుకున్నాడు. రెహమాన్ కు 9 ఏళ్ళ వయసువున్నప్పుడు తండ్రి మరణించాడు. దాంతో రెహమాన్ కుటుంబ భాద్యతలు తీసుకొని 11 ఏళ్ళ నుంచే అసిస్టెంట్ గా పనిచేయడం మొదలుపెట్టాడు. రమేష్ నాయుడు, ఇళయరాజా , రాజ్ – కోటి మొదలైన మ్యూజిక్ డైరక్టర్ల వద్ద కీబోర్డ్ ప్లేయర్ గా పనిచేస్తూనే జీవితం ప్రారంభించాడు. ముఖ్యంగా రెహ్మాన్ స్వరపరిచిన ఎయిర్ టెల్ వాణిజ్య ప్రకటన ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలుసు .


1992 లో మణిరత్నం రోజా సినిమాతో అవకాశం ఇవ్వడం తో రెహమాన్ ఒక్కసారిగా బిజీ అయ్యాడు . ఆ తర్వాత ప్రేమ దేశం , బాంబే , జెంటిల్మెన్, సఖి , జీన్స్ , ఏ మాయ చేసావే , ఒకే ఒక్కడు, సఖి , మిస్టర్ రోమియో , నరసింహ, ప్రేమికుడు వంటి వరుస హిట్స్ తో తన స్థాయిని పెంచుకున్నాడు. హిందీలో ఆర్జీవి రాంగీల కూడా మంచి హిట్ గా నిలిచింది. పాట వినగానే ఇది రెహమాన్ పాటే అనేంత పాపులారిటీ సంపాదించుకున్నాడు . తెలుగు తో పాటు , పలు భాషల్లో సంగీతాన్ని అందించాడు . తొలి చిత్రం రోజా తో పాటు మెరుపు కళలు , లగాన్ , అమృత.. సినిమాలకు ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నాడు . రెహమాన్ నిర్మాతగా తొలిసారి “99 సాంగ్స్” అనే చిత్రాన్ని నిర్మించారు .

దాదాపు రెండు దశాబ్దాలుగా పైగా కొనసాగిన రెహమాన్ సంగీత ప్రస్తానంలో .. ఏ భారతీయ సంగీత దర్శకుడు చేరుకోలేని ఉన్నత శిఖరాల్ని అందుకున్నాడు . నాలుగు జాతీయ చలన చిత్ర పురస్కారాలు, పదిహేను ఫిల్మి ఫేర్ అవార్డులు ,19 ఫిల్మి ఫేర్ సౌత్ పురస్కారాలు వంటి ఎన్నో అవార్డులతో పాటు రివార్డులు రెహమాన్ సొంతం చేసుకున్నాడు. వందేళ్ళకు పైగా కొనసాగుతున్న భారతీయ చిత్ర పరిశ్రమకు .. ప్రతిష్టాత్మక అకాడమి అవార్డు ఒక కల. ఆ లోటును రెహమాన్ తీర్చాడు రెహమాన్ మ్యూజిక్ అందించిన “స్లమ్ డాగ్” మిలియనీర్ చిత్రంలో కంపోజ్ చేసిన “జయహో” పాటకు రెండు ఆస్కార్ అవార్డులు వచ్చాయి . రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకొని భారతీయ సినిమాలను అంతర్జాతీయ వేదిక పైకి సగర్వంగా తీసుకెళ్ళిన ఘనత రెహమాన్ కె దక్కుతుంది.

టైమ్ మ్యాగజైన్ రెహమాన్ కు మొజార్ట్ ఆఫ్ మద్రాస్ బిరుదు ఇచ్చింది. రెహమాన్ మంచి ఆర్టిస్ట్ మాత్రమే కాదు .. నాలో దేశభక్తి కూడా ఎక్కువే అని నిరూపించాడు రెహమాన్. అందుకు వందేమాతర గీతానికి అతనిచ్చిన ట్యూన్ మంచి ఉదాహరణ . తన మ్యూజిక్ గిఫ్ట్ గా అందించాడతను. ఇది ఒక ఆల్బమ్ . ఆల్ టైమ్ లాంగెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్ గా రికార్డ్ సెట్ చేసింది. 2010 లో కేంద్రం పద్మభూషణ్ పురస్కారాన్ని అందించింది. పేదపిల్లలకు సంగీతం లో శిక్షణ , వసతి కల్పించేదుకు వీలుగా చెన్నై లో “కెఎమ్ మ్యూజిక్ కాలేజ్ అండ్ టెక్నాలజీ” ఏర్పాటు చేసారు రెహమాన్. ఎంత ఎదిగినా ఒదిగే స్వభావం . ఆస్కార్ అవార్డులు అందుకున్న తర్వాత .. ఆ విజయం వందకోట్ల భారతీయులదని చెప్పి దేశాభిమానాన్ని చాటుకున్న గొప్ప వ్యక్తిత్వం అతని సొంతం . రాబోయే రోజుల్లో ఉన్నత శిఖరం అధిరోహించాలని కోరుకుంటూ .. బిగ్ టీవీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతుంది.

Related News

Telugu Producer : సెటిల్మెంట్ @ 5 కోట్లు… ఇక DNA టెస్ట్ అవసరం లేదు

Actress Pragathi: అలర్ట్ అయిన ప్రగతి.. తన నంబర్ కాదంటూ కంప్లైంట్..!

Mrunal thakur: అతడిని పరిచయం చేసిన మృణాల్.. ఆగలేకపోతున్న అంటూ పోస్ట్..!

Jani Master Case : అసిస్టెంట్ ని ట్రాప్ చేసింది ఇక్కడి నుంచే…

Jani Master Case : నేరాన్ని అంగీకరించాడా… అంగీకరించాల్సి వచ్చింది..?

Jani Master Case : బిగ్ బాస్ హౌస్ నుంచి విష్ణుప్రియ అవుట్… జానీ కేసుతో ఆమె లింక్ ఇదే..

Tollywood Heroine: రహస్యంగా తల్లికి ఇష్టం లేని పెళ్లి.. కట్ చేస్తే..!

Big Stories

×