EPAPER

Allu Arjun : అల్లు అర్జున్ గారు కావొచ్చునా…? ఇదేం ట్విస్ట్ డీసీఎం గారు…?

Allu Arjun : అల్లు అర్జున్ గారు కావొచ్చునా…? ఇదేం ట్విస్ట్ డీసీఎం గారు…?

Allu Arjun : ఇండస్ట్రీలో ఎవరి మధ్య గొడవలు జరుగుతున్నాయి..? ఎవరి మధ్య ఎఫైర్ కొనసాగుతుంది..? ఇలాంటి న్యూస్ అన్నా… గాసిప్స్ అన్నా… ఎక్కడ లేని ఇంట్రెస్ట్ ఉంటుంది కొంతమందికి. అందుకే గాసిప్ రాయుళ్లు ఇష్టం వచ్చినట్టు న్యూస్ వడ్డించేసి… ఇండస్ట్రీని గందరగోళానికి గురి చేస్తారు.


ఇటీవల కాలంలో అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అనేది చాలా ట్రెండ్ అయిన టాపిక్. అల్లు అర్జున్ ఏదీ మాట్లాడినా… ఆ మాటలకు మెగా ఫ్యామిలీకి లింక్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గానీ, ఇతర మెగా హీరోలు మాట్లాడినా.. దాన్ని అల్లు అర్జున్‌కు అల్లు ఫ్యామిలీకి లింక్ చేశారు. వాళ్ల మధ్య గొడవలు ఉన్నాయా లేవా అనేది పక్కన పెడితే, ఆ రెండు ఫ్యామిలీస్ కి చెందిన ఫ్యాన్స్ మధ్య మాత్రం పెద్ద గొడవ క్రియేట్ చేసి పెట్టారు.

ఇదింత పక్కన పెడితే, రీసెంట్‌గా పవర్ స్టార్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఓ పబ్లీక్ మీటింగ్‌లో చేసిన వ్యాఖ్యలు ఓ వర్గం వాళ్లను తెగ ఆలోచింపజేస్తుంది. నిజానికి ఆ పబ్లీక్ మీటింగ్‌లో జనాలు ఆలోచించడానికి చాలా మాటలు చెప్పారు ఆయన. కానీ, ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ మాత్రం అన్నీ పక్కన పెట్టి… ఆ ఒక్క ఓ మాటనే పట్టుకుని తెగ ఆలోచిస్తున్నారు. ఆ వర్డ్ ఏంటంటే… “అల్లు అర్జున్ గారు”


నిజానికి ఈ చిన్న వర్డ్ కు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ, అల్లు అర్జున్ “చెప్పను బ్రదర్” అని ఓ సినిమా ఈవెంట్‌లో చెప్పాడు కదా.. అందుకోసమే అంతలా ఆలోచిస్తున్నారు.

ఆ డైలాగ్ నుంచే అల్లు అర్జున్‌పై మెగా ఫ్యాన్స్ పగ పెట్టుకున్నారు.
ఆ డైలాగ్ నుంచే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే వార్ నడుస్తుందని గాసిప్ స్టార్ట్ అయింది.
ఆ డైలాగ్ నుంచే నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఫ్యాన్స్ వార్స్ స్టార్ట్ అయ్యాయి.
ఇప్పుడు ఆ డైలాగ్ వల్లే పవన్ కళ్యాణ్ చెప్పిన ఆ చిన్న వర్డ్ గురించి అంతలా ఆలోచిస్తున్నారు.

అంతే కాదు.. ఇటీవల ఆటోనగర్ సుబ్రహ్మణ్యం అనే మూవీ ఈవెంట్‌లో కూడా బన్నీ మాటలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు కోపం వచ్చేలా చేశాయి. ఈ మాటల తర్వాత కూడా పవన్ కళ్యాణ్… అల్లు అర్జున్ గారు అనే మాట్లాడటం చాలా మంది ఊహించలేదు. నిజానికి తట్టుకోవడం లేదు. అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాన్ లా ఉండాలి కానీ, పవన్ ఏంటి ఇలా గౌరవం ఇస్తున్నాడు ఏంటి..? అనే ఆలోచించే వాళ్లు ఉన్నారు.

నిజానికి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నప్పుడు హూందాగా ఉండాలి. ఎవరు ఎన్ని మాట్లాడినా… ఆ స్థాయి తగినట్టు రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే చేశాడు. ఎక్కడా కూడా డీసీఎం స్థాయిని మరిచి మాట్లడలేదు. అంతే కాదు, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల వల్ల అల్లు వర్సెస్ మెగా అంటూ వస్తున్న వార్తలు కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ఒక వేళ నిజంగా అదే జరిగితే, సంతోషించే పవన్, మెగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు.

Related News

Sankranti 2025: సంక్రాంతి బరిలో దిగుతున్న పెద్ద సినిమాలు ఇవే.. ఎవరిది పై చేయి..?

Srivani: సీరియల్ నటి శ్రీవాణికి యాక్సిడెంట్… రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు

Mahendragiri Varahi: సంక్రాంతి బరిలోకి అక్కినేని హీరో.. పోటీని తట్టుకునేరా..?

Prabahs: డార్లింగ్ లైఫ్ పై డాక్యుమెంటరీ… నిర్మాతలకు ప్రభాస్ షాకింగ్ రూల్

Salman Khan : సల్లూ భాయ్ మాత్రమే కాదు… డేంజర్‌‌ జోన్‌లో ఉన్న బీ టౌన్ స్టార్స్ వీళ్లే

Kamal Haasan: కమల్ హాసన్ కొత్త లుక్, ఇదేంటి ఇంత మారిపోయారు.. దానికోసమేనా?

Ghatikachalam Teaser: మసూద కన్నా ఎక్కువ భయపెట్టేలా ఉందేంటి.. ?

Big Stories

×