BigTV English

The Kerala Story:- ‘ది కేర‌ళ స్టోరీ’కి మ‌రో షాక్‌.. !

The Kerala Story:- ‘ది కేర‌ళ స్టోరీ’కి మ‌రో షాక్‌.. !

The Kerala Story:- ఆదా శ‌ర్మ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘ది కేర‌ళ స్టోరీ’. సుదీప్తో సేన్ ద‌ర్శ‌క‌త్వంలో విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన ఈ సినిమా మే 5న విడుద‌లైంది. ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి సినిమా చుట్లూ వివాదం నెల‌కొనే ఉంది. తాజాగా సినిమా రిలీజైన‌ప్పుడు ఇదింకా ముదిరింద‌నే చెప్పాలి. ప‌లు ప్ర‌భుత్వాలు ‘ది కేర‌ళ స్టోరీ’ చిత్రాన్ని త‌మ రాష్ట్రాల్లో ప్ర‌ద‌ర్శించ రాదంటూ బ్యాన్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమాను బ్యాన్ చేసిన రాష్ట్రాల్లో ప‌శ్చిమ బెంగాల్ కూడా చేరింది. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి మమ‌తా బెన‌ర్జీ ప్ర‌క‌ట‌న‌ను రిలీజ్ చేశారు.


‘‘ది కేర‌ళ స్టోరీ’య చిత్రాన్ని పశ్చిమ బెంగాల్లో నిషేధించాలని నిర్ణయించుకున్నాం. అందుకు కారణం.. ద్వేషం, హింసాత్మక ఘటనలను నివారించటమే కారణం. కశ్మీర్ ఫైల్స్ చిత్రం ఓ వర్గాన్ని కించపరిచిందని, ఇప్పుడు ‘ది కేర‌ళ స్టోరీ’ కథను వక్రీకరించారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. అయితే మమతా బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై చిత్ర నిర్మాత విపుల్ అమృత్‌లాల్ షా స్పందిస్తూ చ‌ట్ట ప‌రంగా తాము పోరాటం చేస్తామ‌ని ఆయ‌న తెలిపారు.

వివాదాస్ప‌దంగా ఉన్న ‘ది కేర‌ళ స్టోరీ’ చిత్రాన్ని ప‌లు రాష్ట్రాల్లోని మ‌ల్టీ ప్లెక్స్ థియేటర్స్ బ్యాన్ చేశాయి. ఈ చిత్రంలో ఆదా శర్మ తో పాటు యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ఇతర ప్రధాన పాత్రల్లో న‌టించారు. . అయితే ఈ చిత్రాన్ని చాలా మంది ప్రచార చిత్రంగా పేర్కొంటున్నారు. కేరళ హైకోర్టు సైతం.. ఈ చిత్రం కల్పితమని, సంఘటనలన్నీ నాటకీయంగా అల్లుకున్నవని తెలియజేసే డిస్‌క్లైమర్‌తోనే సినిమా ప్రదర్శించాలని తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఈ సినిమా విడుదలపై స్టే విధించాలని ఉత్తర్వులు జారీ చేసేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది. ఈ చిత‌రం ఇప్ప‌టి వ‌ర‌కు విడుదలైన మూడు రోజున బాక్సాఫీస్ వద్ద రూ.16 కోట్లు కలెక్ట్ చేయగా.. ఇప్పటి వరకు మొత్తంగా రూ. 35 కోట్లు కలెక్ట్ చేసింది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×