Anil Ravipudi : టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)కి తాజాగా నిర్మాతలు కాస్ట్లీ గిఫ్ట్ ను బహుమతిగా ఇచ్చిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. అయితే సినిమా హిట్ అయిన ఏడాది తర్వాత నిర్మాతలు ఈ బహుమతిని ఇవ్వడం విశేషం. అంతేకాకుండా అనిల్ రావిపూడి సదరు నిర్మాతల నుంచి అందుకున్న సెకండ్ గిఫ్ట్ ఇది.
సినీ పరిశ్రమలో ప్రస్తుతం కొత్త ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఏదైనా సినిమా హిట్ అయింది అంటే దానికి సంబంధించిన డైరెక్టర్ కు కాస్ట్లీ బహుమతిని ఇస్తూ వస్తున్నారు నిర్మాతలు. తాజాగా ఇదే ట్రెండ్ ని ఫాలో అయ్యారు ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) మేకర్స్. తాజాగా అనిల్ రావిపూడి (Anil Ravipudi)కి ఇలాంటిదే ఒక పాష్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. కామెడీ కమర్షియల్ సినిమాలతో ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్ గా తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు అనిల్ రావిపూడి. ఇప్పటిదాకా ఈ డైరెక్టర్ తీసిన ఒక్క సినిమా కూడా ప్లాఫ్ కాకపోవడంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అనతి కాలంలోనే మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు.
ఈ డైరెక్టర్ బాలయ్య (Nandamuri Balakrishna)తో సినిమా చేస్తున్నాడు అనగానే బాలయ్యను ఇతను హ్యాండిల్ చేయగలడా? ప్రేక్షకులు ఆయన నుంచి ఆశించే కంటెంట్ ను ఇవ్వగలడా అని అనుమానపడ్డారు. ముఖ్యంగా యాక్షన్, ఫైట్ సీన్స్ ఉంటాయా అనే డౌట్ కలిగింది అందరికీ. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఒక మెసేజ్ ఓరియెంటెడ్ స్టోరీ తో “భగవంత్ కేసరి” సినిమాను రూపొందించి, బ్లాక్ బస్టర్ హీట్ కొట్టాడు అనిల్ రావిపూడి. ఇక అందులో బాలయ్యను డిఫరెంట్ గా చూపించడంతో పాటు మంచి కమర్షియల్ అంశాలతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా థియేటర్లలోనే కాకుండా ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. కాగా ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాను ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi)కి “భగవంత్ కేసరి” సినిమా నిర్మాతలు తాజాగా కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమాను నిర్మించారు. “భగవంత్ కేసరి” మూవీ రిలీజై ఏడాది దాటిన సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడికి ఈ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. గతేడాది దసరాకు ఈ మూవీ రిలీజ్ కాగా, ఇందులో బాలయ్య, శ్రీలీల తండ్రి కూతుర్ల పాత్రలో కనిపించారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా నిర్మాత అనిల్ కి టయోటా వెల్ ఫైర్ కారును గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ కారు ధర దాదాపు కోటిన్నరకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఏడాది క్రితం కూడా మూవీ హిట్ అయిన సందర్భంగా నిర్మాతలు అనిల్ రావిపూడి కి ఇదే మోడల్ కు సంబంధించిన కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాను చేస్తున్నారు. వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది.