EPAPER

Anchor Shyamala on Rave Party: నేను రేవ్ పార్టీలో లేను.. కొన్ని ఛానళ్లపై పరువు నష్టం దావా వేసాను: యాంకర్ శ్యామల!

Anchor Shyamala on Rave Party: నేను రేవ్ పార్టీలో లేను.. కొన్ని ఛానళ్లపై పరువు నష్టం దావా వేసాను: యాంకర్ శ్యామల!

Anchor Shyamala Clarified about Bangalore Rave Party: బెంగళూరులో ఇటీవల జరిగిన రేవ్ పార్టీలో పలువురు రాజకీయ నాయకులతో పాటు టాలీవుడ్‌కి చెందిన సినీ సెలబ్రెటీలు కూడా ఉన్నారంటూ వార్తలు జోరుగా సాగుతున్నాయి. అయితే అందులో నటి హేమ పేరు ముందుగా దర్శనమిచ్చింది. ఆమె ఆ రేవ్ పార్టీలో పాల్గొన్నారంటూ మొదట్లో వార్తలు రాగా.. దానిపై హేమ స్పందించి.. తాను ఆ రేవ్ పార్టీలో లేనని.. అసలు ఆ రేవ్ పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదని ఓ వీడియో రిలీజ్ చేసింది.


అయితే అంతా నిజమే అనుకున్నారు. కానీ బెంగళూరు పోలీసులు అసలు నిజం చెప్పినంత వరకు ఎవరికీ తెలియదు ఆమె ఆ పార్టీలో పాల్గొందని. ఈ మేరకు నటి హేమ బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొందని అక్కడి పోలీసులు తెలిపారు. అయితే ఆమెతో పాటు మరికొందరు నటీ నటుల పేర్లు కూడా వినిపించాయి. స్టార్ యాక్టర్, సినీ హీరో శ్రీకాంత్ కూడా ఆ రేవ్ పార్టీలో పాల్గొన్నాడంటూ.. ఆయన లాగానే ఓ వ్యక్తి ఉండటంతో వార్తలు ఊపందుకున్నాయి.

అయితే ఆ వార్తల్లో నిజం లేదని.. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి తాను కాదని నటుడు శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి తనలానే ఉన్నా.. అది మాత్రం తాను కాదని పేర్కొన్నాడు. ఇక ఇండస్ట్రీ నుంచి మరొకరి పేరు కూడా వినిపించింది. అతడే ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఈ రేవ్ పార్టీ వ్యవహారం బయటకు రావడంతో జానీ మాస్టర్ పేరు తాజాగా వెలుగులోకి వచ్చింది. అంతేకాకుండా యాంకర్ శ్యామల పేరు కూడా ఇప్పుడు గట్టిగానే వినిపిస్తుంది.


Also Read: రేవ్ పార్టీలో హీరో శ్రీకాంత్.. క్లారిటీ వచ్చేసింది..!

చాలా వరకు మీడియా సంస్థలు ఆమె రేవ్ పార్టీలో ఉందంటూ కథనాలు ప్రసారం చేయడంతో శ్యామల తాజాగా ఈ వార్తలపై స్పందించింది. ఈ మేరకు తనపై వస్తున్న వార్తలను ఖండించింది. ‘‘అసలు బెంగళూరు రేవ్ పార్టీ ఎప్పుడు జరిగిందో.. ఎక్కడ జరిగిందో.. ఆ పార్టీలో ఎవరెవరు పాల్గొన్నారో నాకు తెలియదు. అయితే ఆ పార్టీలో నేను కూడా ఉన్నానంటూ కొన్ని మీడియా ఛానెల్స్ నా పేరును దుష్ప్రచారం చేస్తున్నాయి.

ఇవి ఎంతటి దిగజారుడు రాజకీయాలంటే.. నేను ఓ పార్టీలో చేరడంతో.. మా పార్టీ మీద, మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అసత్య ప్రచారాన్ని అస్సలు ఊరుకునేది లేద. వాళ్ల మీద కచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. నాపై దుష్ప్రచారం చేస్తున్న ఛానెళ్లపై పరువు నష్టం దావా వేయడం జరిగింది. జర్నలిస్టులు అనేవాళ్లు నిజాన్ని ఎత్తిచూపించాలి. ఎలాంటి దాన్ని అయినా చెప్పగలిగేవాళ్లు అయిఉండాలి. అంతేకానీ అసత్య ప్రచారాలు చేయడం ఏ మాత్రం మంచి పద్దతి కాదు.’’ అంటూ చెప్పుకొచ్చింది.

Related News

జస్ట్ రూ.10 రెమ్యునరేషన్ తీసుకుని.. స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన నటి, ఇప్పుడు రాజకీయాల్లోనూ స్టారే!

Indraja: నేను సీఎం పెళ్ళాం అంటున్న ఇంద్రజ.. హీరోయిన్ గా రీఎంట్రీ

Jani Master: జానీ రాసలీలలు.. హైపర్ ఆది బట్టబయలు

Ramnagar Bunny Movie Teaser: యాటిట్యూడ్ స్టార్ కొత్త సినిమా టీజర్.. భలే ఉందే

Simbaa: ఓటీటీలో అనసూయ మూవీ అరాచకం.. పదిరోజులుగా

Ram Charan: గ్లోబల్ స్టార్.. మరో గేమ్ మొదలెట్టేశాడు

Comedian Satya: తెలుగు సినిమాకి దొరికిన ఆణిముత్యం.. మరో బ్రహ్మానందం..

Big Stories

×