Ananya Panday: ప్రముఖ బాలీవుడ్ స్టార్ కిడ్ అనన్య పాండే(Ananya pande)ఈరోజు తన 26వ పుట్టినరోజు జరుపుకుంటుంది. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి వచ్చినా.. తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది అనన్య. 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 అనే సినిమాతో బాలీవుడ్ కి పరిచయమైన అనన్య పాండే, తొలి సినిమాతోనే మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం సినిమాల సంఖ్య తగ్గించిన అనన్య , అయినప్పటికీ పలు వ్యక్తిగత కారణాల వల్ల ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంది.
అనన్య పాండే కు బాయ్ ఫ్రెండ్ బెస్ట్ విషెస్..
గతంలో తనకంటే వయసులో చాలా పెద్దవాడైన ఆదిత్య రాయ్ కపూర్ (Adithya Rai Kapoor) తో డేటింగ్ చేయడం మొదలు.. డ్రగ్స్ ఆరోపణలతో పాటు అనేక కారణాల వల్ల వార్తల్లో నిలిచింది. ఇక ఇప్పుడు మరో కొత్త బాయ్ ఫ్రెండ్ ను పట్టేసింది ఈ ముద్దుగుమ్మ. గత కొద్ది రోజులుగా అనన్య.. మోడల్ వాకర్ బ్లాంకో(Walker blanco ) తో రిలేషన్ షిప్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలకు బలం చేకూర్చేలా ఆమె బాయ్ ఫ్రెండ్ వాకర్ ఒక పోస్ట్ చేశారు. తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో.. ‘హ్యాపీ బర్తడే బ్యూటిఫుల్.. నువ్వెంతో స్పెషల్.. ఐ లవ్ యు ఆనీ’ అంటూ ఆమె ఫోటోని పోస్ట్ చేశారు వాకర్. ఈ ఒక్క పోస్టుతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు ఫ్యాన్స్ కూడా క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది.
అనన్య పాండే విద్యాభ్యాసం..
అనన్య విషయానికి వస్తే.. 1998 అక్టోబర్ 30న జన్మించిన అనన్య, ప్రముఖ నటుడు చుంకీ పాండే కూతురు. ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది.. 2017లో ప్యారిస్ లో వానిటీ ఫెయిర్ కి సంబంధించి లే బాల్ డెస్ డెబ్యూటాంటెస్ ఈవెంట్లో పాల్గొనింది. ఆ తర్వాత ఉన్నత చదువులు చదవకుండా తండ్రి సలహా మేరకు ఇండస్ట్రీలోకి వచ్చింది. అలా మొదటిసారి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తో బాలీవుడ్ రంగ ప్రవేశం చేసిన అనన్య పతి పత్నీ ఔర్ ఓ సినిమాతో ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించిన అనన్య చివరిగా సిటీఆర్ఎల్ లో నటించింది.
అనన్య పాండే ఆస్తుల వివరాలు..
వెండితెరపైనే కాదు బుల్లితెర రంగంపై కూడా అలరించింది ఈ ముద్దుగుమ్మ. మ్యూజిక్ వీడియోలో కూడా భాగం పంచుకుంది. ఇక అనన్య పాండే సినిమాల ద్వారా, పలు యాడ్స్ ద్వారా భారీగానే సంపాదించినట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ .3కోట్లు పారితోషకం తీసుకుంటుంది. వివిధ బ్రాండ్ల ప్రకటనల ద్వారా కోట్లు సంపాదిస్తున్నట్లు సమాచారం. టైమ్స్ నౌ డిజిటల్ నివేదిక ప్రకారం ఈమె 24 సంవత్సరాల వయసులోనే రూ.72 కోట్లు సంపాదించిందని, గత రెండేళ్ల క్రితం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ప్రస్తుత వయసు 26 సంవత్సరాలు కాగా.. ఇప్పుడు నికర ఆదాయం సుమారుగా రూ.80 కోట్లు దాటినట్లు సమాచారం. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో నటించింది.