Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఇదొక పేరు కాదు ఒక బ్రాండ్. ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవల గురించి ఎన్ని చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా ముందు ఆయనే ఉంటారు. ఇక ఆయన కు రానీ అవార్డు లేదు. నేషనల్, ఇంటర్నేషనల్.. పద్మభూషణ్, పద్మ విభూషణ్.. ఇలా ఎన్నో అరుదైన అవార్డులను చిరు దక్కించుకున్నారు. ఇక తాజాగా ఆ అవార్డుల లిస్ట్ లో ఇంకొక అవార్డు కూడా చేరింది. అదే ఏఎన్నార్ నేషనల్ అవార్డ్.
నేడు ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ 2024 వేడుకలు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా నిర్వహించిన విషయం విదితమే. ఈ ఏడాది ఏఎన్నార్ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డును ప్రదానం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అవార్డును అందుకున్న చిరు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ ఈవెంట్ కు మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వచ్చింది.
Ram Charan: అక్కినేని ఈవెంట్.. గ్లోబల్ స్టారే హైలైట్.. ఏం లుక్ రా బాబు.. మెంటల్ ఎక్కించేశాడు
చిరు తల్లి అంజనీదేవి, కొడుకు రామ్ చరణ్ హాజరయ్యారు. వీరితో పాటు టాలీవుడ్ స్టార్స్ వెంకటేష్, నాగఅశ్విన్, నాని, త్రివిక్రమ్ తదితరులు హాజరయ్యారు. ఇక దీంతో మెగా ఫ్యాన్స్ అందరూ .. చిరుకు శుభకాంక్షలు తెలుపుతున్నారు . ఏఎన్నార్ కు చిరంజీవికి మధ్య అవినాభావ సంబంధం గురించి టాలీవుడ్ మొత్తానికి తెలుసు.. వీరిద్దరూ కలిసి ఒక సినిమా కూడా చేశారు.
ఏఎన్నార్ ఎంత ఉన్నతమైన వ్యక్తినో చిరు ఎన్నోసార్లు అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన అవార్డునే చిరు అందుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక చిరు కెరీర్ గురించి చెప్పాలంటే.. ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న ఆయన మరో రెండు సినిమాలను లైన్లో పెట్టారని టాక్. మరి విశ్వంభర సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.
Big B @SrBachchan Ji honours Megastar @KChiruTweets Garu with #ANRNationalAward in this special centenary birth year of #ANR Garu
Watch #ANRNationalAward2024 ceremony live here!
▶️ https://t.co/ML4gQVgauf#ANRLivesOn #AnnapurnaStudios pic.twitter.com/puMCij0neY— Vamsi Kaka (@vamsikaka) October 28, 2024