EPAPER

Amitabh Bachchan: సినిమాలు కూడా చేయనవరం లేదు.. ఒక్క ఎపిసోడ్ కు అన్ని కోట్లా.. ?

Amitabh Bachchan: సినిమాలు కూడా చేయనవరం లేదు.. ఒక్క ఎపిసోడ్ కు అన్ని కోట్లా.. ?

Amitabh Bachchan: ఇప్పుడు రియాలిటీ షోలు, చిట్ చాట్ షోలు, ఇంటర్వ్యూలకు స్టార్ హీరోలకు హోస్ట్ గా వ్యవహరించడం ట్రెండ్ గా మారింది. కానీ, ఒక పెద్ద స్టార్ హీరో అయ్యి ఉండి.. ఓకే టీవీ షోకు హోస్ట్ గా వ్యవహరించిన మొట్ట మొదటి హీరో అమితాబ్ బచ్చన్. ఆ షోనే కౌన్ బనేగా కరోడ్ పతి.


ఇక ఈ షో అమితాబ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో ఆయన ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. సినిమాలు ప్లాప్ ల్లో ఉండి.. చేతిలో డబ్బులు లేని పరిస్థితిలో ఈ షో అమితాబ్ చేతికి వచ్చింది. ఆ సమయంలో ఎంతమంది చేయొద్దు అని చెప్పినా.. అమితాబ్ కు వేరే అప్షన్ లేక కౌన్ బనేగా కరోడ్ పతిని మొదలుపెట్టారు.

అప్పటినుంచి ఇప్పటివరకు.. ఎన్నో సీజన్స్ నడుస్తూనే ఉన్నాయి. కానీ, అమితాబ్ మాత్రం ఎప్పుడు ఈ షోను వదిలి వెళ్ళాలి అని అనుకోలేదట. ఫ్యాన్స్ కూడా అమితాబ్ ప్లేస్ లో మరో హోస్ట్ ను ఊహించుకోలేకపోయారు. ప్రస్తుతం అమితాబ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే.. ఇంకోపక్క కౌన్ బనేగా కరోడ్ పతి షో చేస్తూనే ఉన్నారు.


తాజాగా ఈ షోకు అమితాబ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ కూడా హాట్ టాపిక్ గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం.. అమితాబ్.. కౌన్ బనేగా కరోడ్ పతి ఒక్కో ఎపిసోడ్ కు రూ. 5 కోట్లు అందుకుంటున్నాడట.

ఏంటి నిజమా.. ఒక్క ఎపిసోడ్ కు అన్ని కోట్లా అని నోరు వెళ్ళబెట్టకండి. నిజమే.. ఒక్కో ఎపిసోడ్ కు రూ. 5 కోట్లు ఛార్జ్ చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు.. ఆయన ఈ ఒక్క షో చేసుకుంటే చాలు.. సినిమాలు కూడా చేయనవసరం లేదని కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Samantha : ఫైనల్‌గా కెమెరా ముందుకు వచ్చిన సామ్… ‘కల…’ అంటూ ఎమోషనల్ పోస్ట్

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Bollywood Actress : ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Telugu Actress: ఎన్టీఆర్, ఏఎన్నార్ లనే ఢీ కొట్టిన నటి.. కానీ చనిపోతే మాత్రం.. !

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Big Stories

×