EPAPER

Bigg Boss 7 Telugu : అమర్ దీప్ కు ఫిట్స్.. బిగ్ బాస్ హౌస్ లో టెన్షన్

Bigg Boss 7 Telugu  :  అమర్ దీప్ కు ఫిట్స్.. బిగ్ బాస్ హౌస్ లో టెన్షన్
Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu : అమర్ దీప్.. జానకి కలగనలేదు సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న ఈ యాక్టర్ బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. మొదట్లో అమర్ దీప్ ఆడే ఆట ఎవరికీ నచ్చేది కాదు. అయితే ఇప్పుడు.. మెల్లగా అతడిని విమర్శించిన వాళ్లు కూడా ప్రశంసిస్తున్నారు. ఈ సీజన్ ఫైనల్స్ వరకు వెళ్లగలిగే సత్తా ఉన్న కంటెస్టెంట్స్ లో అమరదీప్ కూడా ఒకడు అనడంలో డౌట్ లేదు. అలాంటి అమర్ దీప్ సడెన్ గా అస్వస్థతకు గురి అయ్యాడు. అతని ఆరోగ్య పరిస్థితి అభిమానుల్లో ఆందోళన కలిగిస్తుంది. ఇంతకీ బిగ్ బాస్ హౌస్ లో ఏం జరిగింది? అమర్ దీప్ అస్వస్థత వెనక కారణం ఏమిటి?


బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టంట్ గా ఉన్న అమర్ దీప్.. కొన్నివారాలుగా తన ఆటతో అందరినీ మెప్పిస్తూ టాస్కులలో కూడా అద్భుతంగా పాల్గొంటున్నాడు. తాజాగా జరిగిన టాస్క్ లో కూడా అతను అద్భుతమైన పర్ఫామెన్స్ మంచి మార్కులు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో నడుస్తున్న కిల్లర్ టాస్క్ లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్న అమర్ దీప్ ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యాడు. 80 రోజులపాటు హౌస్ లో ఓ రేంజ్ పర్ఫామెన్స్ తో దూసుకుపోతున్న అమర్.. టాప్ 5 లోకి వెళ్లే దమ్మున్న కంటెస్టెంట్ అని అతని ఫాన్స్ నమ్ముతున్నారు. మరి ఇప్పుడు ఇలా సడన్ గా అతనికి హెల్త్  బాగా లేకపోవడం .. పలు రకాల అనుమానాలకు దారితీస్తోంది.

ప్రస్తుతం అతను బిగ్ బాస్ హౌస్ లోని మెడికల్ రూమ్ లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. అబ్జర్వేషన్ లో ఉంచిన అమర్ దీప్ కు సెలైన్ కూడా ఎక్కిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో అతను ఆట కంటిన్యూ చేస్తాడా లేక హౌస్ నుంచి బయటకు వస్తాడా అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. కొందరు అతను త్వరగా కోలుకొని తిరిగి ఆట మొదలుపెట్టాలి అని ఆశపడుతుంటే.. మరికొందరు ఆడింది చాల్లే బయటికి వచ్చేస్తే పోలా.. అన్నట్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇంకా ఈ విషయం పై బిగ్ బాస్ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. అమర్ దీప్ కోలుకుని తిరిగి బిగ్ బాస్ హౌస్ లో తన ఆటతో అందరిని ఎంటర్టైన్ చేస్తాడని ఆశిద్దాం.


Related News

Comedian Sapthagiri: ఇండస్ట్రీకి దూరమయ్యారా లేక దూరం పెట్టారా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Pushpa 2: వార్నర్ మామ ఇండస్ట్రీ ఎంట్రీ,రీల్స్ నుంచి రియల్ సినిమాలోకి

Devara: ఒకవైపు రాజమౌళి హీరో, మరో వైపు త్రివిక్రమ్ చీఫ్ గెస్ట్ ఇక శివ ను ఆ శివయ్యే కాపాడాలి

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

Big Stories

×