EPAPER
Kirrak Couples Episode 1

Amala Akkineni: నా భర్తను అనడానికి సిగ్గు లేదా.. కొండా సురేఖపై అక్కినేని అమల ఫైర్

Amala Akkineni: నా భర్తను అనడానికి సిగ్గు లేదా.. కొండా సురేఖపై అక్కినేని అమల ఫైర్

Amala Akkineni: మామూలుగా సినిమాలకు, రాజకీయాలకు ప్రత్యక్షంగా కనెక్షన్ ఏముండదు. అయినా కూడా రాజకీయ విషయాల్లో సినిమాల గురించి, సినిమాల విషయంలో రాజకీయాల్లో గురించి ప్రస్తావన వస్తూనే ఉంటుంది. కానీ తాజాగా జరిగిన సంఘటన వల్ల సినీ పరిశ్రమ అంతా ఒక్కటయ్యి ఒక రాజకీయ నాయకురాలిని ఖండించడం మొదలుపెట్టింది. ఎందుకంటే తను చేసిన వ్యాఖ్యలు అలాంటివి. ఆ రాజకీయ నాయకురాలు మరెవరో కాదు.. కొండా సురేఖ. నాగచైతన్య, సమంత విడాకుల గురించి ప్రస్తావిస్తూ.. దానికి కారణం కేటీఆరే అని ఆరోపించారు. దీంతో అక్కినేని ఫ్యామిలీ దీనిని ఖండించారు. అమల కూడా ఈ విషయంపై స్పందించారు.


ఇది సిగ్గుచేటు

‘ఒక్క మహిళా మినిస్టర్ ఇలా రాక్షసిలాగా మారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, వారి రాజకీయ స్వలాభం కోసం ఇంత భయంకరమైన ఆరోపణలు చేయడం, మామూలు ప్రజలను వేటగా మార్చుకోవడం కూడా షాకింగ్‌గా అనిపిస్తోంది. మేడమ్ మినిస్టర్, మీరు అస్సలు నమ్మకం లేని మనుషులు చెప్పే కథలపై ఆధారపడి నా భర్తపై ఇలాంటి ఆరోపణలు చేయడానికి కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా అందులో నిజమెంత అని తెలుసుకోవాలని లేదా? ఇది నిజంగా సిగ్గుచేటు’ అంటూ మొదటిసారి సోషల్ మీడియా వేదికగా ఓపెన్‌గా ఫైర్ అయ్యారు అమల. నాగచైతన్య, సమంత విషయంకంటే నాగార్జునపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలే అమలను హర్ట్ చేశాయని స్పష్టమవుతోంది.


Also Read: చిన్నచూపు చూడొద్దు, రాజకీయ గొడవల్లోకి లాగొద్దు.. కొండా సురేఖ వ్యాఖ్యలకు సమంత కౌంటర్

రాహుల్ గాంధీకి రిక్వెస్ట్

‘నాయకులే దిగజారిపోయి క్రిమినల్స్‌లాగా ప్రవర్తిస్తే దేశం పరిస్థితి ఏమవుతుంది? మిస్టర్ రాహుల్ గాంధీ గారు, మీరు నిజంగా మానవత్వాన్ని నమ్మితే మీ నాయకులను ఆపండి. అలాగే మీ మినిస్టర్ చేసిన ఘోరమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మా కుటుంబానికి క్షమాపణలు చెప్పేలా చేయండి. ఈ దేశ ప్రజలను కాపాడండి’ అంటూ రాహుల్ గాంధీకి కూడా ఓపెన్‌గా రిక్వెస్ట్ పెట్టారు అమల. నాగచైతన్య, సమంత విడాకులకు కారణం కేటీఆర్ అని మాత్రమే చెప్పకుండా, సమంతను తన దగ్గరకు పంపించకపోతే ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేస్తానని కేటీఆర్ నాగార్జునను బెదింరించారని కూడా కొండా సురేఖ ఆరోపించారు. ఇక ఆయన బెదిరింపులకు భయపడి నాగార్జున.. సమంతను పంపడానికి ఒప్పుకున్నారని కూడా ఆమె అన్నారు.

ఒక్కటైన సినీ పరిశ్రమ

కేవలం అక్కినేని ఫ్యామిలీ మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలోని చాలామంది కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. వాటిని తీవ్రంగా ఖండించారు. ముందుగా ఈ విషయం నాగార్జున వరకు వెళ్లడంతో దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ప్రత్యర్థులను విమర్శించడం కోసం సినీ ప్రముఖుల జీవితాలను వాడుకోవద్దని రిక్వెస్ట్ చేశారు. ఇక సమంత సైతం ఈ విషయంపై స్పందిస్తూ నాగచైతన్యతో తన విడాకుల విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని చెప్పుకొచ్చింది. సినీ పరిశ్రమ అంతా కలిసికట్టుగా ఈ విషయాన్ని ఖండించడంతో పాటు కొండా సురేఖ క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

Related News

This Week Releases: సినీ లవర్స్‌కు పండగే.. అక్టోబర్ తొలి వారంలో అరడజను సినిమాలు వచ్చేస్తున్నాయ్!

Naga Chaitanya: అందుకే మౌనంగా ఉన్నాను, అడ్వాంటేజ్‌గా తీసుకోవద్దు.. కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగచైతన్య స్పందన

Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు.. విశాఖకు ఇండస్ట్రీ?

Roja Selvamani: కొండా సురేఖపై రోజా ఫైర్.. సమంతను అనడానికి నీకు మనసు ఎలా వచ్చింది.. ?

Karthi: ప్రభాస్ సాంగ్.. ఎంత అద్భుతంగా పాడావ్ కార్తీ అన్నా.. ఫిదా అంతే

Hasith Goli : భలే ప్లాన్ చేసాడు, ఈ ఒక్క సినిమాతో నాలుగు ఫ్రీక్వెల్స్ రాయొచ్చు

Big Stories

×