EPAPER
Kirrak Couples Episode 1

Allu Arjun Record : ఆ అవార్డు అందుకోనున్న తొలి టాలీవుడ్ యాక్టర్ .. ఢిల్లీలో ఐకాన్ స్టార్ సందడి..

Allu Arjun Record : ఆ అవార్డు అందుకోనున్న తొలి టాలీవుడ్ యాక్టర్ .. ఢిల్లీలో ఐకాన్ స్టార్ సందడి..

Allu Arjun Record : పుష్ప మూవీలో చేసిన పర్ఫామెన్స్ కు గాను టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం వరించింది. దేశ రాజధాని ఢిల్లీలో నేటి సాయంత్రం జాతీయ అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించనున్నారు. రాష్ట్రపతి భవన్ లో జరిగే ఈ కార్యక్రమంలో తన అవార్డు అందుకునేందుకు అల్లు అర్జున్ సతీసమేతంగా ఢిల్లీ చేరుకున్నారు.


సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమా రిలీజైన కొన్ని నెలల పాటు పాన్ ఇండియా లెవల్లో బన్నీపేరు మార్మోగిపోయింది. మళ్లీ జాతీయ అవార్డు ప్రకటనతో మరోసారి నేషనల్ లెవల్లో ఐకాన్ స్టార్ కోలాహలం నెలకొంది.

టాలీవుడ్‌.. ఎంతో ఘన చరిత్రకు కేరాఫ్‌. కానీ ఇప్పటి వరకు ఒక్క జాతీయ ఉత్తమ నటుడు అవార్డుకు మాత్రం దిక్కులేదు. 68 ఏళ్లుగా ఆశగా అనౌన్స్‌మెంట్‌ను వినడమే తప్ప.. అవార్డును మాత్రం దక్కించుకున్న దాఖలాలు లేవు. ప్రతి ఏడాది వందల కోట్ల బడ్జెట్‌ సినిమాలు తీసే టాలీవుడ్‌ ఇండస్ట్రీకి బెస్ట్ మేల్ యాక్టర్ ఇవ్వడానికి మాత్రం కేంద్రం మొఖం చాటేసింది. దీనికి చెప్పే కారణం మనది కేవలం మాస్‌ ఓరియేంటెడ్‌ సినిమాలు. మన సినిమాల్లో కథ, కథనం మనసుకు తాకేలా ఉండవని. కానీ దీనిని బద్ధలు కొట్టింది పుష్ప మూవీ. కమర్షియల్ వ్యాల్యూస్‌తో తీసిని సినిమాలోనే తన యాక్టింగ్‌తో అందరిని మెస్మరైజ్‌ చేశాడు బన్నీ. తగ్గేదేలే అంటూ థియేటర్లలో పూనకాలు తెప్పించిన ఈ స్టైలిష్‌ స్టార్‌ ముందు జాతీయ అవార్డు తలవంచక తప్పలేదు.


అల్లు అర్జున్.. సరదాగా నవ్విస్తాడు. అదే సమయంలో తన నటనతో గుండె బరువెక్కేలా చేస్తాడు. తన డాన్స్‌తో షేక్ చేస్తాడు. మేనరిజమ్‌తో కట్టిపడేస్తాడు. వాట్ నాట్.. సినిమా కోసం అస్సలు తగ్గేదేలే అంటాడు. అందుకే 68 ఏళ్లుగా టాలీవుడ్‌కు అందని ద్రాక్షగా మారిన జాతీయ ఉత్తమ నటుడు అవార్డును తీసుకొచ్చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. టాలీవుడ్‌ లోటును తీర్చేశాడు. దీని వెనుక అతనికున్న డెడికేషన్ అంతా ఇంతా కాదు. ఈ సినిమాలో తను మాట్లాడే చిత్తూరు యాస కోసం దాదాపు ఏడాది పాటు ప్రాక్టీస్‌ చేశాడు అల్లు అర్జున్.

20 ఏళ్ల కెరీర్, 22 సినిమాలు, 19 విజయాలు, 14 మంది వేర్వేరు దర్శకులతో సినిమాలు.. స్టైలిష్‌ స్టార్‌ సినీ లైఫ్‌లో ఇవి ఇంట్రెస్టింగ్‌ నంబర్లు మాత్రమే కాదు.. గంగోత్రి నుంచి పుష్ప వరకు బన్నీ యాక్టింగ్‌లో, డాన్స్‌లో, మ్యానరిజమ్‌లో వచ్చిన మార్పులు అన్ని ఇన్నీ కావు. ఈ అల్లు వారి నట వారసుడు క్లాస్, మాస్ అనే డిఫరెన్స్‌ లేకుండా అన్ని వర్గాలను తన బుట్టలో వేసుకునే అతి కొద్ది మంది తెలుగు యాక్టర్స్‌లో ఒకరు. సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అల్లు అర్జున్ మొదటి సినిమా గంగోత్రి 2003 మార్చిలో వచ్చింది. తన మూవీ ఎంట్రీకి తండ్రి అల్లు అరవింద్.. మామ మెగాస్టార్‌ అండదండలు ఉపయోగపడ్డా.. ఇండస్ట్రీలో తన జెండా పాతడానికి మాత్రం చాలా కష్టపడ్డాడు బన్నీ.

గంగోత్రిలో అమాయకంగా కనిపించిన కుర్రాడికి.. పుష్పలో కరడుగట్టిన స్మగ్లర్‌లా కన్పించిన నటుడికి ఎంత చేంజ్‌ ఉందో స్క్రీన్‌ చూస్తే అర్థమైపోతుంది. తనను తాను ప్రూవ్‌ చేసుకోవడానికి వచ్చిన ఏ ఛాన్స్‌ను కూడా ఈ స్టార్‌ వదులుకోలేదు. గంగోత్రిలో కనిపించిన కుర్రాడి యాక్టింగ్‌కు అంత ప్రశంసలు రాకపోగా.. విమర్శలు వచ్చాయి. కానీ ఆ తర్వాతి ఏడాది వచ్చిన ఆర్యలో తన నటనతో వారందరి నోరు మూయించాడు ఈ లవర్‌ బాయ్‌. ఆర్య, ఆర్య 2, హ్యాపీ, జులాయి మూవీస్‌లో సరదాగా ఉండే పాత్రల్లో ప్రేక్షకులను నవ్విస్తే, పరుగు, వేదం, వరుడు లాంటి సినిమాల్లో తన నటనతో ఆడియన్స్ గుండె బరువెక్కేలా చేశాడు బన్నీ. ఇక సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో, దువ్వాడ జగన్నాథం లాంటి సినిమాల్లో తన యాక్టింగ్‌తో ఇంట్లో సభ్యుడిగా కనిపిస్తాడు. రేసుగుర్రంలో అల్లరి చేస్తూ.. సరైనోడు, నా పేరు సూర్య సినిమాల్లో మళ్లీ సీరియస్‌గా కనిపిస్తూ.. తన మార్క్ నటనతో అదరగొట్టాడు.

ఇక ఈ స్టైలిష్‌ స్టార్‌ డాన్సింగ్ స్టైల్‌ గురించి ప్రత్యేకంగా అవసరం లేదు. నిజానికి అర్జున్‌కు డ్యాన్స్‌ అంటే ప్రాణం. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటలో చెప్పు జారిపోయే స్టెప్ ఓ చిన్న ఎగ్జాంపుల్. ఆయన నటించిన ప్రతి మూవీలో డాన్స్‌ మూవ్స్‌ ఓ క్రేజ్‌ను క్రియేట్ చేస్తాయి. ప్రతి సినిమాలో ఓ సిగ్నేచర్ స్టెప్‌ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సిగ్నేచర్ మూమెంట్స్ మాత్రమే కాదు.. తన మేనరిజమ్స్‌తో కూడా సినిమాకు ఓ హైప్ క్రియేట్‌ చేస్తాడు బన్నీ. పుష్పలో తగ్గేదేలే.. రేసు గుర్రంలో ద్యేవుడా.. సన్నాఫ్‌ సత్యమూర్తిలో చాలా బాగోదు.. ఇలా ఒక్కో మూవీలో ఒక్కో మేనరిజమ్‌తో చింపేస్తాడు.

ఇక బన్నీ టాలీవుడ్‌లోనే కాదు.. కేరళలో కూడా కాసులు కురిపించగలడు. అక్కడి ప్రేక్షకులు బన్నీకి బ్రహ్మరథం పడతారు. ఇక పుష్ప రిలీజ్‌ తర్వాత హిందీ బెల్ట్‌లో కూడా తన సత్తా చాటాడు అల్లు అర్జున్‌. బన్నీ డబ్బింగ్‌ మూవీస్‌కు వచ్చే వ్యూస్‌ అయితే మాములుగా ఉండవు. దీనంతటికి కారణం తన డేడికేషన్.. డిసిప్లేన్‌ అనే చెప్పాలి. ప్రయోగాలకు నో చెప్పడం బన్నీకి అస్సలు అలవాటు లేదనే చెప్పాలి. కథ నచ్చితే చాలు.. ఏం చేయడానికైనా రెడీ అయిపోతాడు. అది హీరోగా అయినా.. గెస్ట్‌ రోల్‌ అయినా తగ్గేదే లే అంటాడు. రుద్రమదేవిలో గోన గన్నారెడ్డి.. వేదంలో కేబుల్‌ రాజు పాత్ర దీనికి ఎగ్జాంపుల్.

విజయం వచ్చినప్పుడు పొంగిపోవడం, అపజయం పలకరించినప్పుడు కుంగిపోవడం కనిపించని ఓ స్థితప్రజ్ఞుడు అల్లు అర్జున్. వివాదాలకు ఆమడ దూరంలో ఉంటూ బిజీగా సినిమాలు చేస్తూ.. ఖాళీ సమయంలో కుటుంబంతో చక్కర్లు కొడుతూ చిల్ అవుతుంటాడు. బన్నీ థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చాడంటే బాక్సులు బద్ధలవ్వాల్సిందే..అవార్డులు క్యూ కట్టాల్సిందే.

Related News

Kaantha : దుల్కర్ సల్మాన్, రానా మల్టీస్టారర్ మూవీ స్టోరీ లీక్… భీమ్లా నాయక్ ను మించే కథ

Koratala Siva about Chiru : కొరటాల కవరింగ్…

Satyam Sundaram Movie : పాపం కార్తీ… లడ్డూ చూపించి గుండు కొట్టించింది…

Natanshi Goel : “లాపతా లేడీస్”లో పూల్ కుమారి వయసు తెలిస్తే షాక్

Chiranjeevi : చిరు సీక్రెట్ ఫామ్ హౌస్… ఎక్కడుంది? ధర ఎంతో తెలుసా?

Sathyam Sundaram First Review: బావా బామ్మర్దులు మెప్పించారా..?

Prasanth Varma : క్రేజీ అంటే ఇదే మామా… ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లో తమిళ్ స్టార్..

Big Stories

×