EPAPER

Pushpa 2: అల్లు అర్జున్ ఓవర్ కాన్ఫిడెన్స్ .. ప్రభాస్ ను బీట్ చేస్తాడా.. ?

Pushpa 2: అల్లు అర్జున్ ఓవర్ కాన్ఫిడెన్స్ .. ప్రభాస్ ను బీట్ చేస్తాడా.. ?

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పేరు. ఈ ఏడాది ఎన్నికల ప్రచారంతో మొదలైన బన్నీ వ్యవహారం.. రోజురోజుకు ఇంకా వివాదంగా మారుతుంది. మెగా- అల్లు కుటుంబాల మధ్య విభేదం.. చిలికి చిలికి గాలివానగా మారుతూ వస్తుంది. పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా బన్నీ నిలవలేదు అన్న దగ్గరనుంచి మొదలైన ఈ గొడవ.. పుష్ప 2 సినిమా వరకు వచ్చి ఆగింది.


పుష్ప 2 రిలీజ్ గురించి సోషల్ మీడియాలో పెద్ద రచ్చనే జరుగుతుంది. ఇంత నెగెటివిటీ మధ్యలో పుష్ప 2 ఎలా రిలీజ్ అవుతుంది.. ఒకవేళ రిలీజ్ అయినా ఎలాంటి రిజల్ట్ ను తెచ్చుకుంటుంది అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన చిత్రం పుష్ప. 2021 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

స్టైలిష్ స్టార్ గా ఉన్న అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ గా మార్చింది. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఇక ఈ చిత్రం తరువాత పుష్ప 2 తో మరోసారి ఇండస్ట్రీ హిట్ అవ్వడానికి బన్నీ రంగం సిద్ధం చేశాడు. ఈ సినిమా కోసమే బన్నీ మూడేళ్ళుగా కష్టపడుతున్నాడు. సుకుమార్ సైతం పుష్ప 2 ను శిల్పాన్ని చెక్కినట్లు చెక్కుతున్నాడు. మొన్నటివరకు పుష్ప 2 పైనే ఫెయిన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఎప్పుడైతే.. మెగా – అల్లు  ఫ్యాన్ వార్స్ మొదలయ్యాయో.. అప్పటినుంచి పుష్ప 2 పై ఒక నెగెటివిటీ ఏర్పడింది.


మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ విడిపోయారు. కొంతమంది అయితే ఏపీలో పుష్ప 2రిలీజ్ అవుతుందా.. ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. దానికి కారణం. ఏపీలో టికెట్ రేట్లు పెంచాలంటే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకే వెళ్ళాలి. ఇక ఇప్పుడు ఈ గొడవల నడుమ పుష్ప 2 కలక్షన్స్ సందిగ్ధంలో పడ్డాయి. సినిమా ఎంత హిట్ టాక్ తెచ్చుకున్నా.. కలక్షన్స్ రావడం ముఖ్యం.

అల్లు అర్జున్ – సుకుమార్ ఇచ్చిన హైప్ కు.. పుష్ప 2 వందకోట్లు కలెక్ట్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి. అంతేకాదు.. ప్రభాస్  బాహుబలి రికార్డ్ ను కొట్టాలని బన్నీ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు. మరి ఈ గొడవల వలన అది సాధ్యమవుతుందా.. ? ఇవన్నీ ఆలోచించకుండానే బన్నీ తన ఆధిపత్యం కోసం పోరాడుతున్నాడా.. ? పుష్ప 2 కనుక హిట్ అయితే.. బన్నీని ప్రశంసలతో ముంచెత్తే సోషల్ మీడియా.. ఒకవేళ మిక్స్డ్ టాక్ ను తెచ్చుకున్నా కూడా ట్రోల్స్ తో మోత మోగిస్తుంది.

ఇదంతా తెలిసే బన్నీ ఇలా చేస్తున్నాడు అంటే.. సినిమాపై అంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడా.. ? పుష్ప 2 తో మరోసారి తానేంటో నిరూపించాలని అనుకుంటున్నాడు అని అనుకోవడంలో తప్పులేదు కానీ,ఫ్యాన్స్ ను నమ్మడానికి వీల్లేదు. ప్రస్తుతం కథ నచ్చకపోతే.. ఎంత వీరాభిమాని అయినా కూడా నిర్మొహమాటంగా నచ్చలేదు అని చెప్పేస్తున్నాడు. ఇక ఇప్పుడు మెగా ఫ్యాన్స్ బన్నీకి యాంటీగా మారారు. ఇన్ని వివాదాల మధ్య పుష్ప 2 అనుకున్న టార్గెట్ ను రీచ్ అవుతుందా.. ? అల్లు అర్జున్.. ప్రభాస్ రికార్డ్ ను బీట్ చేస్తాడా.. ? అనేది తెలియాలి అంటే డిసెంబర్ 6 వరకు ఆగాల్సిందే.

Related News

SSMB29 : మహేష్- రాజమౌళి మూవీ బిగ్ అప్డేట్.. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..!

Devara Pre Release Event : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్.. చీఫ్ గెస్టులు గా స్టార్ డైరెక్టర్స్?

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Big Stories

×