EPAPER

Pushpa 2 Release Date : పంతం నెగ్గించుకున్న బన్నీ… సుక్కుకు అసలు ఛాన్స్ ఇవ్వడం లేదుగా..

Pushpa 2 Release Date : పంతం నెగ్గించుకున్న బన్నీ… సుక్కుకు అసలు ఛాన్స్ ఇవ్వడం లేదుగా..

Pushpa 2 Release Date : 2022లో వచ్చిన పుష్ప పార్ట్ 1 అనుకున్న దాని కంటే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు అదే పెద్ద మైనస్ అయిపోయింది. పుష్ప పార్ట్ 1 నార్మల్ హిట్ అయితే, పుష్ప 2 గురించి డైరెక్టర్, నిర్మాతలు గానీ, హీరో గానీ ఇంత టెన్షన్ పడేవాళ్లు కాదు. కానీ, ఇప్పుడు రాబోయే పుష్ప 2 కచ్చితంగా పార్ట్ 1 కంటే పెద్ద హిట్ కావాలి. అయి తీరాల్సిందే. అలా అవ్వకపోతే, అల్లు అర్జున్ కు ఉన్న పరువు మొత్తం పోయే ఛాన్స్ ఉందని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. ఫ్యాన్స్ గురించి ఆలోచిస్తే… పుష్ప 2 గురించి వాళ్లకు చాలా బెంగ పట్టుకుంది.


ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో…

ఇప్పుడు పుష్ప 1 కంటే పుష్ప 2కు మంచి టాక్ రావాలి..
పుష్ప 1 కంటే ఎక్కువ ఓపెనింగ్స్ రావాలి. కలెక్షన్లూ రావాలి.
దీంతో పాటు అన్నింటి కంటే ముఖ్యమైనది…
ఈ సంక్రాంతికి రాబోయే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీపై అన్ని రకాలుగా డామినేషన్ చూపించాలి.


ఇలా అన్నింటిలో పుష్ప 2 మూవీ రికార్డులు క్రియేట్ చేయాలి. దీని గురించి దర్శక నిర్మాతలకు బాగా తెలుసు. అందుకే పుష్ప 2 సినిమా గురించి కావాల్సినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్క్రిప్ట్ కోసం ఏకంగా నెలల తరబడి టైం కేటాయించారు. ఇక షూటింగ్ అయితే చెప్పనక్కర్లేదు. అలాగే రిలీజ్ డేట్ విషయంలోనూ మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని విధాలుగా ఆలోచించి… డిసెంబర్ 6వ తేదీని ఫిక్స్ చేశారు.

ఇప్పటి వరకు బాగానే ఉన్నారు. కానీ, సడన్‌గా పుష్ప 2 రిలీజ్ డేట్ ను డిసెంబర్ 5 అంటూ ప్రచారం సాగింది. దీని వెనక ఆ మూవీ దర్శకుడు సుకుమార్, నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్ ఉన్నారట. ఒక రోజు ముందు వస్తే… కలెక్షన్లపై ప్రభావం ఎక్కువ ఉంటుందని, టాక్ పాజిటివ్ గా వస్తే, నెల మొత్తం పుష్ప మానియా నడిచే అవకాశం ఉంటుందని భావించారట.

కానీ, దీన్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యతిరేకించినట్టు తెలుస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. బన్నీ లక్కీ నెంబర్, ఫేవరెట్ నెంబర్ 6. అందుకే డిసెంబర్ 6న ఈ మూవీ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశారు. ఇప్పుడు రిలీజ్ డేట్ 5వ తేదీ అంటే బన్నీ అసలు ఒప్పుకోలేదట. లక్కీ నెంబర్‌తో ఉన్న డేట్‌నే రిలీజ్ చేయాల్సిందేనని పట్టు పట్టినట్టు ఇండస్ట్రీలో టాక్.

ఇక చేసేది ఏం లేక మూవీని డిసెంబర్ 6నే రిలీజ్ చేయాలని మేకర్స్ మళ్లీ ఫిక్స్ అయ్యారట. అందుకే ఈ రోజు పుష్ప 2 మరో 50 రోజుల్లో అంటూ చెబుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌తో డిసెంబర్ 5 రిలీజ్ డేట్ అని వస్తున్న వార్తలకు అన్నింటికీ బ్రేక్ వేశాడు బన్నీ. తన లక్కీ నెంబర్‌తో వస్తున్న డేట్‌ రోజే మూవీ రిలీజ్ చేయాలనే పంతాన్ని కూడా నెగ్గించుకున్నాడని ఇండస్ట్రీలో మాటలు వినిపిస్తున్నాయి.

కాగా, రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతికి వస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ చేంజర్, పుష్ప 2 మూవీ రిలీజ్ డేట్స్ చాలా దగ్గర ఉండటం, కొన్ని రోజుల నుంచి మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ రావడంతో ఇండస్ట్రీ మొత్తం ఈ రెండు సినిమాలవైపు చూస్తుంది. ఎవరి మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది..? ఎవ్వరి మూవీకి ఎక్కువ కలెక్షన్లు వస్తాయో అంటూ ఇప్పటి నుంచే హీట్ పెరిగిపోతుంది.

Related News

Anee Master: జానీ మాస్టర్ మంచోడు.. అరెస్టుపై విస్తుపోయే నిజాలు..!

SSMB -29: మహేష్ – రాజమౌళి నుంచీ బిగ్ అప్డేట్.. ఊహించలేదుగా.. !

Samantha: మయోసైటిస్ మాత్రమే కాదు ఆ వ్యాధి కూడా.. హాట్ బాంబ్ పేల్చిన సామ్..!

Veekshanam Movie Review : వీక్షణం మూవీ రివ్యూ…

Most Handsome Hero: వరల్డ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఇతడే.. షారుఖ్ స్థానం ఎంతంటే..?

Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా సెట్ లో ఫోటోలు వైరల్

Kiran Abbavaram: సినిమాని తలపిస్తున్న హీరోగారి లవ్ స్టోరీ.. వింటే షాక్..!

Big Stories

×